Tuesday, December 21, 2010

january మొదటివారంలో ‘రసమయి యమలోకంలో జై తెలంగాణ’

రసమయి బాలకిషన్ ప్రధాన పాత్రలో రసమయి ఫిలింస్ పతాకంపై రసమయి బాలకిషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రసమయి యమలోకంలో జై తెలంగాణ’. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు జరుపుకుని వుంది. చిత్ర దర్శకుడు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ- ప్రజలకోసం ప్రాణాలర్పించిన వీరులు వారి గుండెల్లోనే చిరంజీవులుగా ఉంటారు అన్న కథాంశంతో ఈ చిత్రం నిర్మించాం. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చేలా, విద్యార్థులకు స్పూర్తినిచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 53 సంవత్సరాల నిఘంటువుగా, తెలంగాణ దోపిడీని వ్యతిరేకిస్తూ శ్రీకృష్ణ కమిటీకి ఓ జవాబుగా కూడా ఈ చిత్రం ఉంటుంది. చిత్రంలో మొత్తం ఎనిమిది పాటలుంటాయి. నటీనటులు, గీత రచయితలు, కళాకారులందరు కొత్తవారు పరిచయమవుతున్నారు. రసమయి రూపొంdisthuన్న ‘రసమయి యమలోకంలో జై తెలంగాణ’ పాటలు శివరంజని మ్యూజిక్‌ ద్వారా మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఆడియో తొలిప్రతిని ప్రజాగాయకుడు గద్దర్‌ ఆవిష్కరించారు. january మొదటివారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు. రమేష్, రాజ్‌కుమార్, జంపన్న, శ్యామ్, శశి, కోటశంకర్‌రావు, గౌతంరాజు, శ్రీనివాస్ చౌదరి నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు:మిట్టపపల్లి సురేందర్, యష్‌పాల్, అభినయశ్రీను, సంగీతం: రమేష్ ముక్కెర, ఎడిటింగ్: గుహన్, కెమెరా: తిరుపతిరెడ్డి, కథ, మాటలు, నిర్మాత, దర్శకత్వం: రసమయి బాలకిషన్.