Tuesday, July 26, 2011

కాగితం

క్రీ.పూ. 3500 సంవత్సరం ప్రాంతంలో పురాతన ప్రపంచంలో రాయడం కోసం వాడబడిన వస్తువు "పేపిరస్" అనే పదం నుండి "పేపర్" వచ్చింది. ప్రాచీన ఈజిప్టులోని ప్రజలు రాయడానికి ఒక కాడ నుండి ఈ పేపిరస్ తయారుచేయబడేది. దృఢత్వానికీ, ఎడారిలోని పొడిగాలికీ అనువైన పేపిరస్ పైన నమోదైన పాత రికార్డులు యింకా లభిస్తున్నాయి. వాటి వల్ల మనం గత నాగరికతల గురించి చక్కగా తెలుసుకోగలుగుతున్నాము. పురాతన కాలంలో గొర్రె లేక మేక తోలునుండి తయారుచేసిన తోలు కాగితం కూడా రాయడానికి ఉపకరించేది. తోలు కాగితంగానీ రాసే పేపరస్‌గానీ ఖరీదైనవి. చాలా తరచుగా తక్కువ ఖరీదైన చిన్న మైనపు పలకలకు అవి భర్తీ చేయవడ్డాయి. చాలాసార్లు శుభ్రంగా గీకివేసి మళ్ళీ రాతకు వాడుకునేలాగ జంతువుల తోళ్ళు ఉపకరించాయి. హాన్ వంశపు రాజులు సాహితీ, మత, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాలు వికసించడానికి ప్రోత్సహించారు. పరిపాలన ప్రయోజనాల కోసం కవిలెల్ని (రికార్డులను) అట్టే పెట్టుకోవడం అవసరమనిపించింది. ఆ కాలం ప్రమాణపత్రాలు పొడుగైన సన్నని కర్రముక్కలపైన, పట్టుగుడ్డ ముక్కలపైన లిఖించబడేవి. కాగితం చైనాలో క్రీ.శ. 105లో కనుగొనబడింది. హూటై చక్రవర్తి వద్ద ఉద్యోగి అయిన టిసైలున్ దీనిని కనిపెట్టాడు. మల్బెరీ చెట్టు ఆకులు, ఇతర పీచులు, చేపల్ని పట్టే చిరిగిపోయిన వలలు, పాత గుడ్డ పీలికలు, జనపనార చెత్తలతో యితను ఒక కాగితాన్ని తయారుచేశాడు. పట్టుగుడ్డ మీదకంటే అలా చేయబడ్డ కాగితం పైన రాయడం చాలా సులువైంది. తక్కువ ఖర్చుతో ఏ కష్టమూ లేకుండా అది తయారైంది కూడా. అతి ప్రాచీనమైన చైనా కాగితంలో కనబడే ముక్కలు ముతకగా, దళసరిగా నేడు అనిపిస్తాయి.

టి.సైలున్‌ను చక్రవర్తి కానుకతో సత్కరించాడు. క్రొత్తగా కనుగొన్న కాగితం ఉత్పాదక ప్రక్రియకు అతని సహాయ ఉద్యోగి చాలా మెరుగులు దిద్దాడు. హాన్ వంశపు రాజుల కాలంలో వెలువడిన చైనీయ నిఘంటువులో కాగితాన్ని "పీచు చెత్తల చాప" (a mat of refuse fibres) అని నిర్వహించబడింది. చైనీయులకు కాగితం ఉపయోగకరమై చైనా దేశమంతటా ప్రయోగాత్మకమైంది. హాన్ రాజ వంశ కాలంలో ఈ కాగితంతో తయారైన తొలి గ్రంధం "వసంత, శరత్కాలాల వార్షిక సంఘటనలు - వాటిపై ట్సో వ్యాఖ్యానం" అనేది. తరువాతి కొన్ని శతాబ్దాల వరకూ కాగితాన్ని తయరుచేసే ప్రక్రియను చైనీయులు ఇతర దేశాల వారికి గోప్యంగా వుంచారు. క్రీ.శ. 8వ శతాబ్దంలో కాగిత న్రిమాణం గురించి మధ్య ఆసియాకు వెల్లడయ్యింది. అరబ్ బంధనకర్తలు సమర్ఖండ్ వద్ద జరిగిన తలాస్ యుద్ధానంతరం క్రీ.శ.768లో ఈ కాగితం నిర్మాణ రహస్యాన్ని చైనీయుల యుద్ధ ఖైదీల నుండి నేర్చుకున్నారు. క్రీ.శ. 793లో చైనీయ పద్ధతిని అనుసరించి తొలి కాగితం బాగ్దాద్‌లో ఇస్లామియ సంస్కృతికి స్వర్ణయుగమైన కాలిఫ్ హరున్ అల్ రషీద్ రాజ్యంలో తయారైంది. మధ్య తూర్పు (పశ్చిమ ఆసియా) దేశాల అరబ్ ఉత్పాదకుల వద్ద నుండి మరియు స్పెయిన్ దేశం నుండి 11వ శతాబ్దం మధ్య ప్రాంతంలో ఐరూపాలోని ఆగ్నేయ దేశంలోని బైజాంటైన్ సామ్రాజ్యానికీ, ఆసియా మైనర్ దేశాలకూ, తరువాత ఐరోపా ఖండమంతటికీ కాగితం వ్యాపించింది.

కాగితం నిర్మాణం స్పెయిన్‌లో 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆ దేశంలో మూర్ అనే ముస్లిం దేశ ద్రిమ్మరులు కాగితం మిల్లులను నెలకొల్పారు. 13వ శతాబ్దంలో ఉత్తర భాగంలో పేపర్ నిర్మాణ యంత్రాంగశాలలు ఇటలీలో స్థాపించబడ్డాయి. 14వ శతాబ్దంలో ఫ్రాన్స్, జర్మనీలో కూడా ఈ యంత్రాంగాలు బయలుదేరాయి. ఐరోపాలో చాలా దేశాల్లో రాయడానికి కాగితం విరివిగా వాడబడింది. శతాబ్దాలు గడిచేటప్పటికి కాగితం నిర్మాణంలో వివిధ ప్రక్రియలు చాలా యాంత్రికమయ్యాయి. కాని దాని మౌలిక ప్రక్రియ మాత్రం మారలేదు. తడి పీచు, కర్ర, గుడ్డ పీలికలు మొదలైనవి మెత్తటి ముద్ద చేయబడి తరువాత పీచురేకుగా తయారవుతుంది. అది బాగా ఒత్తబడి దానిలో నీటిని వెలువరించాక దానిని ఆరబెట్టి వివిధ రసాయనిక పదార్ధాలతో అది వ్యవహరించబడ్డాక ఏ రకం కాగితం కావాలో దానికి అవసరమైనట్లు విభిన్న ప్రక్రియలలో అది పంపబడుతుంది. ఈ పీచుకు కర్ర ముఖ్యాధారమైనా, అత్యధికమైన గట్టితనానికీ, మన్నికకు స్థిరతకు గుడ్డ పీలికల నార యింకా ఉపకరిస్తోంది. గడ్డి, చెరుకుపిప్పి, వెదురు, జనపనార, గోగునార కూడా దీని వాడుకలో వున్నాయి. 1450లో ముద్రణా యంత్రం కనుగొనబడినప్పటి నుండి కాగితం యొక్క ఆవశ్యకత చాలా పెరిగింది. మొట్టమొదటి విజయవంతమైన కాగిత యంత్రశాల ఇంగ్లాండులో 1859లోనూ, అమెరికాలో 1690లోనూ ఫిలడెల్ఫియాకు చెందిన విలియం రిటెన్ హౌస్ చేత నెలకొల్పబడ్డాయి.

నికొలస్ లూయీ రాబర్ట్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త 1798లో మొట్టమొదటి కాగిత నిర్మాణ యంత్రాన్ని నిర్మించాడు. దీనిని కనుగొనడానికి ముందు కాగితాన్ని చేతితో తయారుచేసేవారు. రాబర్ట్ పనిని ఫ్రెంచ్ ప్రభుత్వం గుర్తించి అతనికి ప్రత్యేక హక్కును ఇచ్చింది. హెన్రీ, సీలీ ఫౌర్డ్రినియర్ సోదరులు ఇంగ్లాండులో 1803లో దీన్ని మెరుగుపరిచారు. 1875 నాటికి ఫొటో మలచబడే కొత్త ప్రక్రియలో యంత్రం చేత పూతపూయబడిన కాగితం అర్థ స్థాయిలలో వాడబడింది. నేడు ఫౌర్డ్రినెర్ యంత్రంలో దాదాపు కాగితమంతా తయారవుతుంది. కాగితం, గుజ్జు, కాగిత వస్తువులను తయారుచేసే ప్రముఖ దేశాలు కెనడా, రష్యా,అమెరికా, స్కాండినేవియా దేశాలు. ఇండియాలో కర్రకు కొరత ఉండడం వలన పచ్చగడ్డి, వ్యర్ధమైన కాగితం, తాళ్ళు, బియ్యం ఊక,ఎండుగడ్డి, గుడ్డ పీలికలు యింకా యితర వ్యవసాయక వ్యర్ధ పదార్ధాలతో కాగితం తయారవుతోంది. మన దేశంలోని అనేక కాగిత యంత్రాగారాలు కాగితపు గుజ్జుని దిగుమతి చేసుకుని, కాగితాన్ని తయారుచేస్తాయి.

తెలుగు పత్రికల తీరు తెన్నులు

1885లో "ఆంధ్ర ప్రకాశిక" తో మొదలైన తెలుగు పత్రికలు నేటి కంప్యూటర్ యుగంలోకూడా సమాజంలో ప్రముఖ పాత్ర పోషించవలిసివుంది
ఇటీవల కాలంలో పత్రికా ప్రచురణలోనూ, వార్తా సేకరణ పద్ధతులలోనూ చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. మనం ప్రజాస్వామికాపాలనా విధానాన్ని వరించాము. నిజమైన స్వేచ్ఛగల పత్రికా వ్యవస్థ ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటిది. కనుక ఈ వచ్చిన, వస్తున్న మార్పుల ప్రభావం గణనీయమైనదిగా ఉంటుంది.

తెలతెలవారుతుండగానే తలుపు తట్టి, వాటిక పేపరువేసి వెళ్ళే కుర్రాడు నేటి నాగరికత జీవనంలో మేలుకొలుపు గీతిక పాడే బాల హరిదాసు వంటివాడు. అతడు తెచ్చి ఇచ్చే దినపత్రిక మండతల్లో ప్రకృత ప్రపంచం మన కంటిముందు సాక్షాత్కరిస్తుంటుంది. వార్తలు, వింతలు, విశేషాలు, వినోదాలు, విషాదాలు కలగలసి ఉండే పంచామృతం వంటిది వార్తాపత్రిక. పత్రికలు చదవడంలో ఎవరి అభిరుచులు వారివి, ఎవరి అలవాట్లు వారివి. ఆయా వ్యక్తుల, కుటుంబాల పరిసరాలను, అవసరాలను, ఆశయాలను బట్టి ఈ అభిరుచులు వేరువేరుగా ఉంటాయి.

తనకు తెలియని సంగతులు తెలుసుకోవాలన్న తహతహ, ఆశ్చర్యాతిరేకం, హర్షాతిశయం కలిగించే అద్భుతాలను, ఆధునిక మానవ విజయాలనూ గురించి తెలుసుకోవాలన్న కుతూహలం, అన్నిటినీ మించి స్వీయ వివేక వికాసాలను అనుదినం పెంపొందించుకోవాలన్న తపన - ఇవన్నీ మనచేత పత్రికలను చదివిస్తాయి. క్రమేపీ ఇదొక అలవాటుగా, వ్యవసనంగా మనలో గూడుకట్టుకుంటుంది.

అయితే, ప్రజాస్వామిక స్వేచ్ఛా సమాజంలో ఈ అలవాటుకు ఒక పత్ర్యేక కారణం ఉన్నది. వార్తా విశేషాలను విపులంగా తెలుసుకొని తీరవలసిన ఒక ఆవశ్యకత ఈ వ్యవస్థలో పౌరులకు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయాలు ప్రజల అభిమతం మీద ఆధారపడి ఉంటాయి. ఈ ప్రజాభిమతాన్ని వివేక పూరితమైనదిగా తీర్చి దిద్దగల శక్తి వార్తాపత్రికలకున్నది. ప్రభుత్వ పరంగా, సమాజపరంగా నిత్యం ఏమి జరుగుతున్నదీ, ఎలా జరుగుతున్నదీ పౌరులు తెలుసుకోవటానికి పత్రికలు ముఖ్య సాధనం. అయితే ఈనాటి పౌరులకు తమ సమాజంలో తమ ప్రాంతంలో, తమ దేశంలో ఏమి జరుగుతున్నదో మాత్రమే తెలుసుకుంటే చాలదు. మనచుట్టూ ఉన్న బయటి ప్రపంచంలో వస్తూ ఉండే దైనందిన పరిణామాలను కూడా తెలుసుకోవడం అవసరం. ఈ తెలివిడికి పత్రికలు గవాక్షం వంటివి.

కనుక పత్రికల ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. మన దేశంలో తొలుదొలుత పత్రికలు ప్రారంభించిన వారు క్రైస్తవ మత ప్రచారకులు, వారిని చూచి హిందూమత ప్రచారకులూ, సంఘ సంస్కరణవాదులూ పత్రికలు ప్రారంభించారు. అయితే పత్రికలకు మనం చెప్పుకునే నిర్వచనం ప్రకారం అవేవీ వార్తాపత్రికలనిపించుకోవు. ఇలా చూచినప్పుడు తెలుగులో మొట్టమొదటి వార్తాపత్రిక 1885లో వెలువడింది. ' ఆంధ్ర ప్రకాశిక' అనే ఆ పత్రికను ఆవుల చినపార్థసారధి నాయుడు ప్రారంభించారు. అంతకు ముందు యాభై సంవత్సరాల పత్రికల చరిత్ర నన్నయకు పూర్వం తెలుగు సాహిత్య చరిత్ర వంటిదే.
ఆ తరువాత ఈ శతాబ్ధి మొదటి పాదంలో వచ్చిన 'కృష్ణాపత్రిక' (1901), '' స్వరాజ్య'' (1905), ఆంధ్ర ( వార) పత్రిక (1907), '' ఆంధ్ర (దిన) పత్రిక'' (1914), '' కాంగ్రెస్'' 91921), '' జమీన్ రైతు'' 91930), '' వాహిని'' 91935), '' ఆంధ్రప్రభ'' 91938) ఇలా వరుసగా తెలుగులో పత్రికలు పుట్టుకొచ్చాయి. అయితే వీటిలో '' జమీన్ రైతు'', '' ఆంధ్రప్రభ'' మాత్రమే ఇప్పటికీ సజీవంగా కొనసాగుతున్నాయి. ఇలా జరుగుతూ వచ్చిన తెలుగు పత్రికా రంగం చరిత్రలో 1941 నుంచి ఒక కొత్త మలుపు వచ్చింది. అప్పటి వరకూ ఈ పత్రికలన్నీ గ్రాంధిక భాషలో ఉండేవి.

కాగా, నార్ల వెంకటేశ్వరరావుగారు ఆ యేడు ఆంధ్రప్రభ సంపాదకత్వాన్ని చేపట్టడంతో ఈ పెద్ద మార్పు వచ్చింది. పత్రికా రచనలో జన భాషను ఒక పద్ధతిలో ప్రవేశపెట్టి, వాడుక భాషలోనే వార్తలను అందించే ఆధునిక సంప్రదాయాన్ని నెలకొల్పిన ఘనత నార్ల వారిక దక్కుతుంది. గిడుగు వారి వ్యావహారిక భాషా ఉద్యమం, తాపీవారి వాడుక భాష వినియోగ ప్రయోగాలు నార్ల వారికి ఈ విషయంలో తోడ్పడ్డాయి. ఇలా వుండగా 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దానితోపాటే పరాగతం కారాని జన్మహక్కులు, పౌరహక్కులు మనకు సంక్రమించాయి. పర్యవసానంగా మన బాధ్యతలు పెరిగాయి. పత్రికల ప్రాముఖ్యమూ పెరిగింది.

స్వాతంత్ర్యానంతరం మన వార్తా పత్రికల సంఖ్యలోనూ, వాటి ప్రాచుర్యంలోనూ విశేషమైన పెరుగుదల వచ్చింది. అలనాటి చిలక ముద్రణ దశ నుంచి ఈనాడు కంప్యూటర్తోనే చేసే అక్షరాల కూర్పు పద్ధతి వరకు ముద్రణ పద్ధతులలో ఎంతో పురోగమనం జరిగింది. అలాగే ఒకానొకటి ' ఏడురోజులనాటి' తాజావార్త అని పత్రికలు చెప్పుకొనే స్థితి నుంచి ఏడు నిమిషాలలో, ఈరేడు లోకాలలో ఎక్కడ ఏమి జరిగిందీ, జరుగుతున్నదీ తెలుసుకొని ప్రచురించగల మహోన్నత సాంకేతిక దశకు పత్రికలు చేరుకున్నాయి.

అయితే మన పత్రికా రచనా ప్రమాణాల విషయంలో ఆశించవలసినది ఎంతైనా ఉంది. జడ్జీల వలెనే జర్నలిస్టులు కూడా రాగద్వేషాలకతీతంగా వాస్తవాలను నిష్పాక్షిత దృష్టితో విషయ వివేచన చేసి చెప్పడం సబబు, సుముచితము, వాంఛనీయమూ. మరి, మన పాత్రికేయులందరూ ఈనాడు అలా చేస్తున్నారని చెప్పగలమా? అటువంటి జర్నలిస్టులు అసలే లేరని కాదు, అటువంటి పత్రికలూ లేవని కాదు. ఆ సంఖ్య అతి స్వల్పం. మన రేడియో, టెలివిజన్ సౌకర్యాలు పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలో వున్నందున వాటి నుంచి నిష్పాక్షికతను ఆశించజాలము. మన పత్రికలు సైతం వాటి యజమానుల అన్య పారిశ్రామిక పరిరక్షణకు మాత్మే ఉపకరిస్తున్నాయన్న భావం ప్రబలంగా ఉన్నది.

నిజానికి ఈనాడు మన జర్నలిజం ఒకవైపున పాలకుల ఒత్తిళ్ళకూ, మరొకవైపున వ్యాపార ప్రకటనలిచ్చి పోసించే పారిశ్రామికుల ఒత్తిళ్లకూ మధ్యన నలిగిపోతున్నది. ఇటీవలి కాలంలో మన పత్రికా రంగంలో మరొక అవాంఛనీయమైన పరిణామం వచ్చింది. పత్రికా నిర్వహణలో ఒకనాడు సంపాదకునికి ఎనలేని ప్రాముఖ్యం ఉండేది. ఈనాడు అతడు దానిని కోలోపయాడు. ఈ తిరుగులేని పెత్తనం పత్రికల బిజినెస్ మేనేజర్ల చేతుల్లోకి పోయింది. పలితంగా ఈనాటి పత్రికా సంపాదకుడు ముగ్గురు పెత్తందార్లను సంతృప్తి పరచవలసిన దయనీయమైన పరిస్థితులలో పడిపోయాడు. సంపాదకుని పూర్వ ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతిన్నది. అందువల్లనే ఒకనాడు ఎడిటర్లకు జర్నలిస్టులకు ఉన్న గౌరవం ఈనాడు లేదు
మన పత్రికా రంగంలో వచ్చిన మరొక సరికొత్త పరిణామం మితిమీరిన వ్యాపార దృష్టి - ముద్రణ పద్ధతులలో వచ్చిన విప్లవాత్మకమైన అభివృద్ధి వలన నేటి పత్రికలు చూడ ముచ్చటగా వుంటున్నాయి. మరి, చదువ ముచ్చటగా వుంటున్నాయా? ఎప్పుడో ఒకటీ అరా తప్ప నేటి పత్రికలలో ఇది మరీ అరుదైన మాట అయింది. ఒకనాడు పెద్ద పత్రికలు కొన్ని స్వల్ప విషయాలను స్థానిక చిన్న పత్రికలకు వదలి వేసేవి. ఈనాడు అలాకాదు. ప్రతీ చిన్న పెద్ద విషయాలలో తలదూర్చి చిన్న పత్రికల మనుగడను దుర్లభం చేస్తున్నాయి. ఒకనాడు సమాజ శ్రేయస్సే పత్రికల ప్రధాన ధేయ్యంగా ఉండేది. ఈనాడు అలాకాదు. యజమానుల వ్యాపార పారిశ్రామిక ప్రయోజనాలను పెంపొందించుకొనటానికి ఉపకరణాలుగా పత్రికలు ఉపయోగపడుతున్నాయి. అలాగే రాజకీయాధికారపు ప్రాపును పొందటానికి, వీలైతే రాజకీయ అధికార పదవులను చేజిక్కించుకొనటాననకీ యజమానులు పత్రికకలను సోపాననలలగా ఉపయోగించుకొంటున్న సందర్భాలూ ఉన్నాయయ.ఇవన్నీ చూచినపుడు అటు ప్రభుత్వ ప్రసార సంస్థలకూ, ఇటు పత్రికలకూ తేడా అట్టే కనిపించదు. ఇవన్నీ అందరూ జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయాలు

Thursday, July 14, 2011

టబు,Tabu


టబు,Tabu


పరిచయం :
•టబు బాలీవుడ్ నటి . హిందీ లోనే కాకుండా ... తమిళ్, తెలుగు , మలయాళం , బెంగాలీ భాషలలో నటించారు . ఒకఅమెరికన్ ఇంగ్లీష్ ఫిలిం లో నటిచారు ,
ప్రొఫైల్ :

•పేరు : టబు పూర్తిపేరు 'తబస్సుమ్ హాష్మి'
•పుట్టిన తేది : 04 నవంబర్ 1970 ,
•పుట్టిన ఊరు : హైదరాబాదు లో పుట్టి ముంబై లో స్థరపడిన సినిమా నటి.
•తండ్రి : జమాల్ హష్మి ,
•తల్లి : రిజవాన -స్కూల్ టీచర్ ,- టబు పుట్టిన తరువాత తన తల్లి దండ్రులు విడిపోయారు .
•తోబుట్టువు : నటి ఫరాహ్ చెల్లెలు, మరియు నటి సభాన అజ్మి కి మేనకోడలు (నైస్)
కెరీర్ :

•నటి దివ్యభారతి యొక్క స్నేహితురాలు. దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది. మొదటిగా 15 సం. వయసు లో " Hum Naujawan(1985) లో దేవానంద్ కూతురు గా నటించారు .,

టాబు నటించిన తెలుగు చిత్రాలు
•కూలీ నంబర్ 1
•నిన్నే పెళ్లాడుతా
•ఆవిడా మా ఆవిడే
•సిసింద్రీ (ప్రత్యేక నృత్యం)
•పలనాటి బ్రహ్మనాయుడు
•అందరివాడు
•ఇదీ సంగతి
•పాండురంగడు.
అవార్డ్స్ : National Film Awards
•* 1997, National Film Award for Best Actress, Maachis.
•* 2002, National Film Award for Best Actress, Chandni Bar.
Filmfare Awards
•* 1995, Filmfare Best Female Debut Award, Vijaypath
•* 1996, Filmfare Best Actress South, Kadhal Desam
•* 1998, Critics Award Best Performance, Virasat
•* 2000, Critics Award Best Performance, Hu Tu Tu
•* 2001, Critics Award Best Performance, Astitva
•* 2007, Critics Award Best Performance, Cheeni Kum
Star Screen Awards
•* 2001, Star Screen Award Best Actress, Astitva
•* 2007, Star Screen Award Best Actress (Critics), Cheeni Kum
Zee Cine Awards
•* 2001, Zee Cine Award Best Actor- Female, Astitva
•* 2002, Zee Cine Award Best Actor- Female, Chandni Bar
International Indian Film Academy Awards
•* 2002, IIFA Best Actress Award for Chandni Bar
Bollywood Movie Awards
•* 2001, Bollywood Movie Award - Critics Award Female, Astitva
Bengal Film Journalists' Association Awards
•* 1997, Bengal Film Journalists' Association Awards, Best Actress (Hindi Movies), Maachis
•* 2002, Bengal Film Journalists' Association Awards, Best Actress (Hindi Movies), Chandni Bar

అనూప్

పరిచయం (Introduction) :
•అనూప్ రూబెన్స్ తెలుగు సినిమా సంగీగ దర్శకుడు . చిత్రం సినిమా ద్వారా కీబోర్డ్ ప్లేయర్ గా పరిచయమయ్యారు .
జీవిత విశేషాలు (profile) :
•పేరు : అనూప్ రూబెన్స్ ,
•ముద్దుపేరు : చంటి ,
•పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
•చదువు : ఎం.కాం ,
•అభిమాన సంగీతదర్శకులు : రహమాన్‌, ఇళయరాజా , హారిస్ జైరాజ్ ,
•నచ్చే సంగీతము : రోజాలోని " నా చెలి రోజావే... "
•నచ్చే చిత్రము : బెన్‌హర్ ,
•నచ్చే ప్రదేశాలు : గోవా , సింగపూర్ ,
•ఇష్టమైన ఆహారము : చేపల కూర , మజ్జిక ,
•నచ్చే దుస్తులు : జీన్స్ , టీషర్ట్ ,
•అభిమాన తారలు : రజనీకాంత్ , ఐశ్వర్యరాయ్ ,
•లక్ష్యం : ఏళ్ళ తరబడి గుర్తుండిపోయే పాటలను కంపోజ్ చేయడం ,
సినిమాలు (filmography ):
•హోళి (2002)సింగర్ గా ,
•తపన (2004)-సింగర్ గా ,
•ధైర్యం (2005)సంగీతం ,
•గౌతం s s c (2005)-సింగర్ ,
•వీధి (2006)-సంగీతం -సింగర్ ,
•బాస్ (2006)- సంగీతం ,
•వేడుక (2007)-సంగీతం ,
•ద్రోణ (2009)-సంగీతం ,
•నా స్టైలే వేరు (2009)- సంగీతం ,
•సీతారాముల కళ్యాణము (2010)-సంగీతము ,
•అందరి బందువయా (2011)- సంగీగం ,
•నేను నా రాక్షసి (2011) -సంగీతం ,
•కోడిపుంజు (2011)- సంగీతం ,
•చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి (2011) -సంగీతం ,
•హౌస్ ఫుల్ (2011) -సింగర్ గా ,

చందాల కేశవదాసు, Chandala Keshavadas


చందాల కేశవదాసు, Chandala Keshavadas



పరిచయం (Introduction) : తెలుగు సినిమా తొలి పాటల రచయిత చందాల కేశవదాసు భక్త ప్రహ్లాద లో ప్రత్యేకంగా రాసిన మూడు పాటలు ఇవి-
•పరితాప భారంబు భరియింప తరమా;
•తనయా ఇటులనే తగదుర బలుకా;
•భీకరమగు నా ప్రతాపంబునకు ---
అంచేత సినిమాకి ప్రత్యేకంగా పాటలు రాసిన తొలి రచయితగా చందాల కేశవదాసుగారిని చెప్పుకుంటున్నాం. జీవిత విశేషాలు (profile) :
•పేరు : శ్రీ చందాల కేశవదాసు సిద్ధాంతి ,
•పుట్టిన ఊరు : జక్కేపల్లి గ్రామము .. ... ఖమ్మం జిల్లా ,
•పుట్టిన తేదీ : 20 జూన్‌ 1876 ,
•చదువు : బడి చదువులల్తో పాటు సంస్కృతాంధ్రము చదివేరు .
•మరణము : 14-5-1956 .
రచనలు / సినిమాలు (filmography ): కనక్తార అనే నాటకము వ్రాసారు . కరక తార గా సినిమా తీసారు , నాటకాలలో పాటలు వ్రాసేవారు , హరికథలు , గేయాలు , పద్యాలు వ్రాసారు , భక్తప్రహ్లాద లో మూడు పాటలు ....
•పరితాప భారంబు భరియింప తరమా;
•తనయా ఇటులనే తగదుర బలుకా;
•భీకరమగు నా ప్రతాపంబునకు ---
భలే మంచి చౌక బేరము --కృష్ణతులాభారం, మునివరా తుదకిట్లు , కొట్టు కొట్టండిరా
•మీరజాలగలడా ... తులాభారము సినిమాలో ,
నాటినుంచి, నేటి వరకూ కూడా, నాటక ప్రదర్శనారంభంలో- ముఖ్యంగా పద్య నాటకాలు- 'పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద' అన్న ప్రార్థనా గీతాన్ని నటులందరూ కలిసి పాడతారు. ఇది రాసినది చందాల కేశవదాసుగారు. దీన్ని స్వరపరిచింది పాపట్ల లక్ష్మీకాంతయ్యగారు. ఈనాటికీ అదే పాటని అదే వరసలో పాడడం- పాట మీద భక్తి! ఇదొక విశేషం.
•కడారు నాగభూషణంగారు 1954లో తీసిన 'సక్కుబాయి'లో కేశవదాసు గారివి ఐదు పాటలు ఉపయోగించుకున్నారు. వాటిలో 'ఆటలాడుకోరా', 'గజ్జెలందియలు', 'కృష్ణా పోబోకుమా' బహుళ ప్రచారం పొందాయి. ఈ మూడు పాటల్ని అదినారాయణరావుగారు నిర్మించి, సంగీతం చేసిన 'సక్కుబాయి' (1965)లోనూ ఉపయోగించుకున్నారు