Saturday, April 30, 2011

Idiot Box (2010) w/ Eng Sub - Hindi Movie

Well Done Abba (2010) w/ Eng Sub - Hindi Movie

Gullu Dada Return (2010) - Hindi Movie

federico fellini - 8 ½ (7/16)

బాలీవుడ్‌లో మహిళా చిత్రాలజోరు!

‘నో వన్ కిల్‌డ్ జెస్సికా…’!
‘సాత్ ఖూన్ మాఫ్’…!
‘టర్నింగ్ 30’…!
‘ఐ యామ్…’!

ఈ సినిమాలన్నింటిల్లో ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే ఇవన్నీ మహిళ ఇతివృత్త ప్రధాన చిత్రాలు కావడమే! ఇలా గతంలో ఎన్నడూ లేనంతగా బాలీవుడ్‌లో ఈ సీజన్‌లో లెక్కకు మిక్కిలి మహిళా చిత్రాలు రూపొందుతున్నాయి. సంఖ్యా పరంగానే కాకుండా, ఈ సినిమాల బడ్జెట్‌లు, వీటిలో నటిస్తున్న నటీమణులు, వీటికి దర్శకత్వం వహిస్తున్న దర్శకులు అందరూ కూడా టాప్ రేంజిలో ఉండడం ఇప్పుడు బాలీవుడ్‌లో జోరందుకుంటున్న ఈ మహిళా చిత్రాలపై చర్చను లేవనెత్తుతోంది!

మహిళా చిత్రాలేంటి?

సాధారణంగా బాలీవుడ్ కానీ, మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా కానీ అన్ని వర్గాల అన్ని స్థాయిల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించడం సహజం! సినిమా హిట్ కావాలంటే, బాక్సాఫీస్ కలెక్షన్లు పెరగాలంటే అందరు ప్రేక్షకులూ ఆ సినిమాను ఆదరించడం అవసరం. అంటే ఓ సాధారణ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్నిరకాల ఎలిమెంట్స్ ఆ సినిమాలో ఉండాలన్న మాట! అయితే ఈ సూత్రానికి భిన్నంగా కొన్ని సినిమాలు, ఓ ప్రత్యేక, కథ-కథనం-ఇతివృత్తంతో నిర్మాణమవడం, ఆ సినిమాలు మొదట్లోనే ఆ ప్రత్యేక తరగతికి చెందిన సినిమాలుగా ముద్రపడడం కూడా జరుగుతోంది. అలాంటి వాటిలో మహిళా ప్రధాన చిత్రాలు కూడా ఒకటి! ప్రపంచ సినిమా గ్రామర్‌లో ఈ తరహా సినిమాలను ‘విమెన్ -సెంట్రిక్ సినిమాల’నీ, ‘్ఫమేల్ ఓరియెంటెడ్ సినిమా’లనీ, ‘హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల’నీ అంటారు.

ఇక మహిళా చిత్రాలనగానే కొన్ని లక్షణాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. 1.ఈ సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఉంటుంది. 2. మహిళలు సాధారణంగా ఎదుర్కొనే సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక సమస్యలే వీటిలో ఇతివృత్తం 3.కథ యావత్తు హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. 4. సెంటిమెంట్, హ్యూమన్ కంపాషన్ ఈ సినిమాల్లో కనిపించే ఎలిమెంట్స్, 5. సానుభూతి, యాగ్రెసివ్‌నెస్-తిరుగుబాటు-చైతన్యం–సామాజిక మార్పు అనేవి ఈ సినిమాల్లో ప్రధానంగా కనిపించే అంశాలు. 6.అణిచివేత-దోపిడీ-లింగ వివక్ష-స్ర్తిలపై విచక్షణలు- న్యూలైఫ్ స్టైల్స్‌లో స్ర్తిలు ఎదుర్కొనే సంఘర్షణలు ప్రధాన కథా వస్తువులు 7. ఆధునిక నగర జీవన శైలులలో స్ర్తిపరమైన అస్తిత్వ వేదనలు, అచీవ్‌మెంట్స్, జీవన పోరాటాలు వీటిలో మూలాంశాలు.

గతంలో లేవా?

మహిళా ప్రధాన కథా చిత్రాల నిర్మాణం ఇటీవలి ధోరణే అనుకుంటే పొరపాటే! బాలీవుడ్‌లో 1913లో తొలి సినిమా నిర్మాణం నుంచి మొదలుకొని ఇప్పటివరకు వేర్వేరు కాలాలు-తారలు-సందర్భాలకు అనుగుణంగా రకరకాల మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఫిక్షనల్ స్టోరీలు కాగా, మరికొన్ని నిజ జీవిత సంఘటనలనుగాని ఇన్‌స్పిరేషన్‌తో రూపొందినవి. ఇంకొన్ని మాత్రం ఏకంగా నిజ జీవిత మహిళల కథలనే ‘బయోపిక్’ తరహాలో తెరకెక్కించారు. అయితే ఇవన్నీ సమకాలీన సామాజిక పరిస్థితుల నేపథ్యంలో స్ర్తి స్థాయినీ, పోరాటాన్ని చూపించడం విశేషం!

బాలీవుడ్‌లో మహిళా ప్రధాన చిత్రాలకు ఒక పూర్తి షేప్‌ను తెచ్చిన సినిమాగా ‘మదర్ ఇండియా’ను చెప్పుకోవాలి. నర్గీస్‌దత్ టైటిల్‌రోల్‌లో వచ్చిన ఈ సినిమా గ్రామీణ భారతంలోని భూమి-స్ర్తిల అనుబంధాలను, కుటుంబ బంధం-న్యాయం మధ్య సంఘర్షణను అద్భుతంగా తెరకెక్కించి మహిళా ప్రధాన చిత్రాలలో మణిమకుటంగా నిలిచింది. ఇదే కాకుండా నూతన్ ‘సుజాత’, ‘బందినీ’ సినిమాలు…మీనాకుమారి ‘పాకీజా’ సినిమా…షర్మిలాఠాగూర్ ‘వౌసమ్’ సినిమా ఈ కోవలోనివిగానే గుర్తింపు పొందాయి. కాగా 16వ శతాబ్దపు లక్నో గాయనీమణి ఉమ్రావ్‌జాన్ జీవితం ఆధారంగా రేఖ హీరోయిన్‌గా అదే టైటిల్‌తో ఓ సినిమా వచ్చింది. ముజఫర్ అలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ నర్తకి జీవితంలోని అన్ని రకాల దశలను అత్యద్భుతంగా ప్రజెంట్ చేసింది. బాలీవుడ్ సినీ ప్రస్థానంలోఓ క్లాసిక్‌గా రూపొందిన ఈ సినిమా, ఆ తర్వాత ఐశ్వర్య మెయిన్ లీడ్‌లో రీమేక్‌గా సైతం రూపొందింది. ఇక మొఘల్ కాలంనాటి కథతో రూపొందిన ‘అనార్కలి’, ‘మొఘల్-ఎ-ఆజమ్’ సినిమాలు కూడా మహిళా ప్రధాన చిత్రాలుగానే గుర్తింపుపొందాయి.

మరోవైపున సమకాలీన నిజ జీవిత సంఘటనలు, వ్యక్తుల జీవితాలతో ఒ కొన్ని మహిళా చిత్రాలు వచ్చాయి. వాటిలో గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆంధీ’ సినిమాని ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. సంజీవ్‌కుమార్-అపర్ణాసేన్ జంటతో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇందిరాగాంధీ జీవితాన్ని పోలి ఉందనే వివాదాలను సైతం ఎదుర్కొంది.

‘దామిని’ సంచలనం

బాలీవుడ్‌లో తొలితరం మహిళా చిత్రాలన్నీ స్ర్తి సహజమైన అబలత్వాన్ని, అసహాయతను సింపథెటిక్‌గా చూపిస్తూనే, ఉద్యమించే మూర్తిమత్వాన్ని, ధిక్కరించే స్వభావాన్ని వ్యక్తీకరించాయి. కానీ 1980 దశకం తర్వాత వచ్చిన మహిళా చిత్రాలన్నీ మరింత నిర్మాణాత్మకంగా, మరింత ‘్ఫకస్‌డ్’ రావడం విశేషం. అలాంటి సినిమాలలో రాజ్‌కుమార్ సంతోషి ‘దామిని’ చెప్పుకోదగ్గ సినిమా! తన సాటి స్ర్తికి జరిగిన అన్యాయాన్ని తన భర్త, కుటుంబాన్ని సైతం ఎదిరించి న్యాయస్థానంలో పరిష్కారం కనుక్కొన్న ఒంటరి స్ర్తి పోరాటమే ఈ సినిమా!ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించి మహిళా చిత్రాల స్టామినాను తెలియజెప్పింది.

ప్యారలల్ సినిమా నీరాజనం

భారతీయ వెండితెరపై 1955లో మొదలైన ‘న్యూవేవ్’ సినిమా ఆర్ట్ఫిలిం, ప్యారలల్ సినిమా ఉద్యమాలు స్ర్తి ప్రధాన కథా చిత్రాలకు పెద్దపీట వేసాయి. ఇంకా చెప్పాలంటే ప్యారలల్ సినిమాకి ప్రధాన పునాది స్ర్తియే అయిందన్నా ఆశ్చర్యంలేదు…ఆ మాటకొస్తే ప్యారలల్ సినిమా మూవ్‌మెంట్‌కు పునాది వేసిన ‘పథేర్ పాంచాలి’ సినిమా కూడా మహిళా ప్రధాన కథా చిత్రమే! ఇక శ్యామ్‌బెనగల్ అంకుర్, భూమిక, మండీ, మంధన్ మొదలగు సినిమాలు సాయిపరంజపే ‘స్పర్శ్’, ‘సతి’ సినిమాలన్నీ ఈ కోవలోనివే!

ఇక కల్పనా లజ్మి దర్శకత్వంలో డింపుల్ కపాడియా మెయిన్ రోల్‌లో వచ్చిన ‘రుడాలి’ ఈ తరహా చిత్రాలతో గొప్ప సినిమాగా నిలిచిందని చెప్పాలి. తర్వాత ‘దమన్’ ‘చింగారీ’ సినిమాలు కూడా కల్పనా లజ్మిలోని స్ర్తి ప్రధాన కథా ఇతివృత్తాలకు వివిధ కోణాలను ఆవిష్కరించినవే! ఇవే కాక, జగ్‌మోహన్ ముంద్రా దర్శకత్వంలో వచ్చిన ‘బవందర్’ (నందితాదాస్ హీరోయిన్), ‘ప్రోవోక్‌డ్’ (ఐశ్వర్యారాయ్) సినిమాలు మహిళల ప్రస్తుత స్థితిగతులకు అద్దం పట్టినవే!

మలుపు తిప్పిన ‘చాందినీ బార్’

మహిళా ప్రధాన కథా చిత్రాల దశను-దిశను ఇటీలి కాలంలో మలుపుతిప్పిన సినిమాగా ‘చాందినీ బార్’ను చెప్పుకోవచ్చు. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో టబు హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలే కాక, బాక్సాఫీస్ కలెక్షన్లను కూడా సాధించింది. 1991 అనంతర భారతీయ సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితులలో పొడసూపిన నూతన పోకడలకు ఈ సినిమాలు అద్దం పట్టాయి. బసు భట్టాచార్య డైరక్షన్‌లో రేఖ హీరోయిన్‌గా వచ్చిన ‘ఆస్థా’ కూడా ఈ కోవలోనిదే!

ప్రీతిజింటా ప్రధాన పాత్రలో వచ్చిన ‘క్యాకెహనా’ సినిమా పెళ్లికిముందే గర్భవతైన స్ర్తి సమస్యను ఇతివృత్తంగా స్వీకరించగా టబు హీరోయిన్‌గా వచ్చిన ‘అస్తిత్వ’ సినిమా ఓ మధ్య వయస్కురాలి మనోవేదనలోంచి పెల్లుబికిన అస్తిత్వ వేదనగా నిలిచింది! ప్రకాష్‌ఝా దర్శకత్వంలో వచ్చిన మృత్యుదండ్, లజ్జ, సుధీర్ మిశ్రా డైరక్షన్ వహించిన ‘్ఛమేలీ’ (కరీనా హీరోయిన్) సినిమాల్లో స్ర్తి సమస్యలను సామాజికాంశాల నేపథ్యంతో చక్కగా వివరించారు. నగేష్‌కుకునూర్ ‘డోర్’ సినిమా కూడా ఇలాంటిదే.

అలాగే మధుర్ భండార్కర్ డైరక్షన్‌లో వచ్చిన ‘పేజ్-3’ సినిమా మెట్రో నగరాల్లోని హైక్లాస్ మహిళల లైఫ్‌స్టయిల్‌ని, ‘్ఫ్యషన్’ సినిమా మోడలింగ్ ప్రపంచంలో అమ్మాయిల జీవన గతుల్ని ఎంతో రియాలస్టిక్‌గా ప్రజెంట్ చేసింది. ప్రదీప్ సర్కార్ డైరక్షన్‌లో వచ్చిన ‘పరిణీత’, ‘లాగా చున్రీమే దాగ్’ సినిమాలు కూడా స్ర్తి సమస్యలను తమదైన కోణంలో విశే్లషించాయి.

తాజాగా హాలీవుడ్ ‘స్టెప్‌మామ్’ ఆధారంగా కరీనా, కాజోల్‌లతో వచ్చిన సినిమా ‘వి ఆర్ ఫ్యామిలీ’! ఈ సినిమా ప్రస్తుత నగర జీవనంలోని కుటుంబ అనుబంధాలను, ఫ్యామిలీ వాల్యూస్ సంరక్షణలో స్ర్తిల పాత్రలను నేటి ఆధునిక ధోరణులనుంచి పరిశీలించింది

అడపా దడపా వచ్చిన ఈ మహిళా చిత్రాలు గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా రూపొందుతున్నాయి. ‘నోవన్ కిల్‌డ్ జస్సికా’ సినిమా ఈ కోవలో ప్రస్తావించుకోవాల్సిన సినిమా! న్యూఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో మనుశర్మ అనే ఓ మంత్రి కొడుకు తాగిన మత్తులో చంపేసిన బార్ టెండర్ ‘జెస్సికాలాల్’ జీవితగాధ ఆధారంగా ఈ సినిమా రూపొందది! పూర్తి రియలస్టిక్ ప్యాటర్న్‌లో జెస్సికా హత్యానంతర పరిస్థితులు, ఆమెకు న్యాయం కోసం ఆమె అక్క చేసిన పోరాటం ఈ సినిమా ఇతివృత్తం. రాజ్‌కుమార్ గుప్తా డైరక్షన్‌లో రాణీముఖర్జీ, విద్యాబాలన్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా ఆసక్తిని క్రియేట్ చేసి, మంచి సక్సెసును సాధించింది.

ఇక మధుర్ భండార్కర్ డైరక్షన్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా వచ్చిన సినిమా-‘సాత్ ఖూన్ మాఫ్’! రస్కిన్ బాండ్ రాసిన ‘సుసన్నాస్ సెవెన్ హజ్బెండ్స్‌‘ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా వెరైటే సినిమాగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
‘రాజ్‌నీతి’ దర్శకుడు ప్రకాశ్‌ఝా నిర్మాణంలో అలంకృత శ్రీవాస్తవ డైరెక్షన్‌లో గుల్‌పనాగ్ హీరోయిన్‌గా రిలీజ్ అయిన న్యూఏజ్ స్టోరీ ‘టర్నింగ్ 30’ కూడా మంచి మార్కులనే కొట్టేసింది.!

రానున్న సినిమాలు?

కోల్‌కత్తాలో అదృశ్యమైన తన భర్తకోసం అనే్వషణ జరిపే మహిళ కథతో ‘సుజయ్‌ఘోష్’ రూపొందిస్తున్న సినిమా-కహానీ! విద్యాబాలన్ హీరోయిన్‌గా వస్తున్న ఈ సినిమాకి మహిళా ఇతివృత్తమే ప్రధానం! ఇక, అపర్ణాసేన్ డైరక్షన్‌లో కొంకణాసేన్ శర్మ హీరోయిన్‌గా వస్తున్న ‘ఇతి మృణాళిని’ మరోటి! సినీనటి జీవితగాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో గ్లామర్ ప్రపంచంలోని స్ర్తిల స్థితిగతులను చూపించనున్నారు.

ఇవే కాకుండా, ‘ఐయామ్’ అనే టైటిల్‌తో ఓనిర్ డైరెక్షన్‌లో ఓ వెరైటీ సినిమా రూపొందుతోంది. నందితాదాస్, జుహీచావ్లా, మనీషా కోయిరాలా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ సినిమా మహిళలను వేధిస్తున్న నాలుగు విభిన్న సామాజిక సమస్యలను ఆధునిక దృక్కోణంనుంచి నాలుగు వేర్వేరు కథలుగా తీయడం విశేషం!

ఇక, దివంగత నటి సిల్క్ స్మిత జీవిత గాధ ఆధారంగా వస్తున్న సినిమా- ది డర్టీ పిక్చర్! విద్యా బాలన్ హీరోయిన్ గా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది..

సక్సెస్ రేటెంత?
మొత్తం ప్రేక్షక జనంలో సగం మంది మహిళా ప్రేక్షకులే! ఒకప్పుడు ‘అత్యంత మహిళాదరణతో నడుస్తున్న చిత్రం’గా చెప్పుకోవడం ఓ విశేషంగా ఉండేది. కానీ గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి సినిమాలన్నీ హీరో డామినేటెడ్‌గా మారి స్ర్తి ఇతి వృత్తాలు వెనక్కి తగ్గాయి. ఆ లోటును పూరిస్తూ ఇప్పుడు వస్తున్న మహిళా చిత్రాల విజృంభణ ఈ దిశగా ఓ ఆశారేఖ! అయితే ఈ విమెన్ సెంట్రిక్ సినిమాలకు బాక్సాఫీసు కలెక్షన్లు ఎలా ఉంటాయి అనేది ఓ పెద్ద ప్రశ్న!
మహిళా ప్రధాన చిత్రాలు ప్రధానంగా బడ్జెట్ పరమైన ఆటంకాలను ఎదుర్కోవడమే కాక, డిస్ట్రిబ్యూషన్, విడుదల పరంగా కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన సినీ పరిశ్రమకానీ, ప్రేక్షకవర్గం కానీ ‘మేల్ డామినేటెడ్ హీరోయిన్ సినిమాల ప్యాటర్న్’కే ఎక్కువగా అలవాటుపడడం, ఆ సినిమాలకే మార్కెట్ ఉంటుందనే నమ్మకాలతో ఉండడం కూడా ఈ సినిమాలు అంతగా ప్రమోట్ కాకపోవడానికి కారణం అవుతున్నాయి. మరోవైపున హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో బిగ్‌స్టార్ హీరోలు నటించడానికి విముఖత చూపించడం కూడా ఈ సినిమాలకు ఆడియన్స్ తగ్గడానికి కారణంగా మారుతున్నాయి. పైగా ఈ సినిమాలకు ఇంకా ‘ఆర్ట్ ఫిలిం’ ముద్రలే ఉంటున్నాయి. అయితే మంచి కథ, కథనం, ప్రమోషన్ దొరికిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్‌హిట్ కూడా అయ్యాయి! విమెన్ సెంట్రిక్ సినిమాలు అనగానే ఏడ్పుగొట్టు కథలనే ముద్ర జనంలో బలంగా ఉండడం, సినిమా అంతటా సందేశాలతో ఊదరగొడతారనే ఇమేజ్ ఏర్పడడం కూడా ఈ సినిమాల సక్సెస్ రేట్‌ని నిర్దేశిస్తున్నాయి. వీటికి తోడు, బాలీవుడ్ సినిమాల్లో హీరోలోగా మూడు గంటల సినిమాని తన భుజాలమీద తీస్కెళ్లగలిగే హీరోయిన్‌లు కూడా మన పరిశ్రమలో లేకపోవడం మరో సమస్య! ఇవన్నీ ఇలావుండగా, సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలో టికెట్ రేట్లు పెరగడం కూడా ఈ మహిళా చిత్రాల సక్సెస్‌రేటును శాసిస్తున్నాయి. రేట్ల పెరుగుదల వల్ల కుటుంబం మొత్తం సినిమాలకు వెళ్లడాన్ని తగ్గించడం దీనికి కారణం!
మొత్తంమీద మన దేశంలో స్ర్తిల ఎదుగుదలకు ఎన్ని ఆటంకాలున్నాయో, అన్ని ఆటంకాలే ఈ మహిళా చిత్రాలకు కూడా ఉన్నాయి. అయినప్పటికీ పదుల సంఖ్యలో త్వరలో బాలీవుడ్ తెరను ఆక్రమించనున్న ఈ మహిళా చిత్రాలు కొత్త ట్రెండ్‌కు నాంది పలకాలని ఆశిద్దాం!

The End of Poverty

Tere Bin Laden. full movie part 1

Saturday, April 9, 2011

Please Murder Me

అన్నా హజారే ఎవరు..? ఎందుకీ ఆమరణ నిరాహార దీక్ష..!?

అవినీతిపై అహింసా అస్త్రాన్ని సంధించి ఆమరణ నిరాహార దీక్షకు ఉపకరించిన ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే గురించి తెలుసుకోవాల్సిన పది విషయాలు...


1. అసలు అన్నా హజారే ఎవరు..?
ఓ మాజీ ఆర్మీ వ్యక్తి. 1965 భారత్-పాక్ యుద్ధంలో పోరాడిన వీరుడు.

2. అతనిలో అంత ప్రత్యేకమైన అంశం ఏంటి..?
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో రాలేగావ్ సిద్ధి అనే గ్రామాన్ని నిర్మించారు.

3. అయితే ఏంటి..?
ఈ గ్రామం పూర్తిగా స్వయం ప్రతిపత్తి మీద ఆధారపడినది. ఇక్కడి విద్యుత్‌ను కూడా గ్రామస్తులే స్వంతంగా.. సౌరశక్తి, జీవ ఇంధనం, పవన విద్యుత్‌ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. 1975లో ఈ గ్రామం అత్యంత దారిద్ర్యంతో అలమటించేది. కానీ ఈ గ్రామం ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ధనిక గ్రామంగా ఎదిగి దేశానికే ఆదర్శంగా నిలిచింది.

4. సరే,....?
ఈ వ్యక్తి (అన్నా హజారే) చేసిన సామాజిక సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇతనిని ప్రతిష్టాత్మకమై "పధ్మ భుషన్" అవార్డుతో సత్కరించింది.

5. నిజంగానా, అయితే ఇతను దేనికోసం పోరాటం చేశారు..?
భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతిని పారద్రోలేందుకు చట్ట సవరణలు చేయాలని పోరాటం చేస్తున్నారు.

6. మరి ఇదెలా సాధ్యమవుతుంది..?
లోక్ పాల్ బిల్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వాధికారులను స్వతంత్రంగా విచారించి అవినీతిపరులకు సాధారణ కోర్టుల కన్నా అత్యంత వేగంగా శిక్ష పడేలా చేయటం ఈ బిల్లు ప్రత్యేకత. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని చాలా కాలం నుంచి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

7. ఇది పూర్తిగా కొత్త విషయమే కదా..?
కాదు.. 1972లోనే ఈ బిల్లును ప్రతిపాదించడం జరిగింది. అప్పటి న్యాయశాఖ మంత్రి శాంతి భూషన్ ఈ బిల్లును ప్రతిపాదించారు. కానీ మారుతున్న ప్రభుత్వాలు మాత్రం దీనిని పక్కకు నెట్టేస్తూ వచ్చాయి. కొందరు అవినీతి రాజకీయ నాయకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ బిల్లును మార్చాలని కూడా ప్రయత్నించారు. ఈసారి ఎలాగైన ఈ బిల్లును ప్రభుత్వం ఆమోదించేలా చేయాలని హజారే నడుం బిగించారు. యువత కూడా భారీగానే ఆయనకు తమ మద్దతు తెలుపుతున్నారు.

8. ఓహో.. అలాగా... మరి అతను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నది ఆ బిల్లు పూర్తిగా అమలయ్యేలా చేయడానికన్నమాట..! మరి ఇంత తక్కువ సమయంలో అదెలా సాధ్యమవుతుంది..?
హజారే మొదటిగా అడుగుతున్నదేంటంటే.. ఈ బిల్లును ఆమోదిస్తానని ప్రభుత్వం ముందు రావాలి. తర్వాత లోక్ పాల్ బిల్లును డ్రాఫ్ట్ చేయడానికి.. 50 శాతం ప్రభుత్వం తరఫు నుంచి, 50 శాతం ప్రజల తరఫు నుంచి కూడిన సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ సంయుక్త కమిటీని (జాయింట్ కమిటీని) ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వాన్ని నమ్మడం అసాధ్యం. అలా చేస్తే ప్రభుత్వంలో ఉన్న కొందరు అవినీతిపరులు చట్టం కళ్లు కప్పి తప్పించుకునే ఆస్కారం ఉంది.

9. బావుంది, ఈ బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుంది..?
లోక్ పాల్ బిల్లు పాస్ అయితే కేంద్రం ఓ "లోక్ పాల్‌"ను ఎన్నుకోవడం జరుగుతుంది. అతనికి పూర్తి స్వతంత్రాధికారాలు ఉంటాయి. ఉదాహారణకు భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) మాదిరిగా అన్నమాట. ప్రతి ఒక్క స్థాయిలోనూ లోకాయిక్తను నియమించడం జరుగుతుంది. ఒక్క ఏడాదిలోపు అవినీతిపరులందరనీ విచారించడం జరుగుతుంది. మరో ఏడాదిలోగా సదరు అక్రమార్కులను శిక్షించడం జరుగుతుంది. భోఫోర్స్ కుంభకోణం, భోఫాల్ గ్యాస్ విషాదం వంటి కేసుల్లో మాదిరిగా 25 ఏళ్ల పాటు విచారణ జరిపి చిన్న చిన్న శిక్షలు విధించ కుండా ఉండాలంటే ఈ బిల్లు పాస్ అవ్వాల్సిందే. ఈ బిల్లు పాస్ అయితే.. రెండేళ్లలోపే అవినీతిపరులు ఊచలు లెక్కబెడతారన్నమాట.

10. అతను ఒక్కడేనా..? అన్నా హజారేతో ఈ పోరాటంలో మరెవరూ లేరా..?
ఎందుకు లేరు... మాజీ ఐపిఎస్ కిరణ్ బేడి, ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేష్, ఆర్‌టిఐ విప్లవవేత్త అరవింద్ కెజ్రివాల్‌ కూడా ఆయనకు తోడుగా నిలిచారు. అంతేకాకుండా.. అశేష భారతావని జనం ఆయనకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

సరే అర్థమైంది. మరి నేనేం చేయగలను..?
అవీనితిపై జరుగుతున్న ఈ పోరాంటంలో పాల్గొందాం. అన్నా హజారేకు మన మద్దతు ప్రకటిద్దాం. కనీసం ఈ సందేశాన్నైనా మీ మిత్రులు శ్రేయోభిలాషులకు చేరవేద్దాం. అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం. భావిసమాజానికి బాటలు వేద్దాం. మన తర్వాతి తరమైన హాయిగా గుండెలపై చేయి వేసుకొని నిద్రేంచేలా చేద్దాం..!

bbb

Wednesday, April 6, 2011

opra winfrey show








టాక్ షోలకి వరవడి ‘ఓప్రా షో’
ఓప్రా విన్‌ ఫ్రే షో... ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఎన్నో టాక్‌షోలకు మూలం. 'ఈ టాక్‌షోను మొదలుపెట్టి దాదాపు పాతికేళ్లు కావస్తోంది, ఇక 2011 సెప్టెంబరులో ముగింపు పలుకుతాను' అని ప్రకటించింది ఓప్రా.

'ఓప్రా విన్‌ఫ్రే షో' అసలు పేరు 'ఎ.ఎం.షికాగో షో'. 1983లో ఈ టాక్‌షో నిర్వహణలో తొలిసారి పాలుపంచుకుంది ఓప్రా. అప్పట్లో ఈ షోకి పెద్దగా ఆదరణ లేదనే చెప్పాలి. కానీ ఓప్రా వచ్చాక కొన్ని నెలల వ్యవధిలోనే ఈ షో టెలివిజన్‌ రేటింగుల్లో అట్టడుగు నుంచి అగ్రస్థానానికి చేరుకుంది.

* 1986లో 'ఎ.ఎం.షికాగో షో' పేరు ఓప్రా విన్‌ఫ్రే షో గా మారింది. నాలుగేళ్ల తర్వాత ఈ షోని ఓప్రా సొంతంగా రూపొందించడం మొదలుపెట్టింది. 'హార్పో (HARPO-ఓప్రా అనే పేరుని తిరగేస్తే హార్పో అని వస్తుంది)' పేరిట స్టూడియోను ఏర్పాటు చేసుకుని ఈ షోని తానే నిర్వహించింది.

* ఓప్రా విన్‌ఫ్రే షోకు ఇది రజతోత్సవ సంవత్సరం. ఈ షోను మొదలుపెట్టి 2011, సెప్టెంబర్‌ నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ పాతికేళ్లలో 5000కు పైగా ఎపిసోడ్స్‌ ప్రసారమయ్యాయి. ఒక్కో ఏడాదినీ ఒక్కో సీజన్‌గా లెక్కేస్తే అమెరికన్‌ టెలివిజన్‌ చరిత్రలో వరసగా 19 సంవత్సరాలపాటు అగ్రస్థానంలో నిలిచిన టాక్‌షో ఇదే.

* మీడియాకు అంతగా ఇంటర్వ్యూలివ్వని మైకేల్‌జాక్సన్‌ ఓప్రావిన్‌ఫ్రే షోకి హాజరయ్యాడు. జాక్సన్‌ విటిలిగో(బొల్లి) వ్యాధితో బాధపడుతున్న విషయం ప్రపంచానికి ఈ షో ద్వారానే తెలిసింది.

* ఓప్రా విన్‌ఫ్రే షోని వారానికి దాదాపు ఐదుకోట్ల మంది చూస్తారని అంచనా. షో జరిగేటప్పుడు స్టూడియోలో మూడొందల మంది వీక్షకులుంటారు. అలా ఈ ఇరవై ఐదేళ్లలో ఈ షోని ప్రత్యక్షంగా చూసిన ప్రేక్షకుల సంఖ్య పదకొండు లక్షల పైమాటే!

* ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా దాకా... ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లో ఓప్రావిన్‌ఫ్రే షో ప్రసారమవుతోంది.

* ఇప్పటివరకూ ఈ షోలో పాల్గొన్న ప్రముఖుల సంఖ్య 900కు పైమాటే. ఇక గిన్నిస్‌ రికార్డులు సాధించినవారూ జీవితంలో ఘోరకష్టాలను అనుభవించి మానసిక స్త్థెర్యంతో పైకొచ్చినవారూ... ఇలాంటి వారందరినీ కలుపుకొంటే దాదాపు 28,000 మంది ఈ షోలో పాల్గొన్నారు. అందరికన్నా అత్యధికంగా ప్రముఖ హాలీవుడ్‌ నటి జూలియారాబర్ట్స్‌ దాదాపు పదిసార్లు ఈ షోలో పాల్గొంది. పురుషుల్లో ఎక్కువసార్లు ఈ షోలో కనిపించిన ఘనత అమెరికన్‌ నల్లజాతి గాయకుడు లూధర్‌ వాండ్రాస్‌కి దక్కింది.

* ఇక దేశాధినేతలూ తదితర ప్రముఖుల విషయానికొస్తే... ముగ్గురు ప్రెసిడెంట్లు(బిల్‌ క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా) ఈ షోకి హాజరయ్యారు. ఇంకా... నలుగురు (అమెరికా) ప్రథమమహిళలూ ఒక మహారాణి(జోర్డాన్‌రాణి రానియా), మరొక మాజీ మహారాణి, ఆరు దేశాల యువరాజులూ ఆరుగురు యువరాణులూ... ఓప్రా షోకి వన్నెతెచ్చారు.

* 1989లో తన షోకి వీక్షకాదరణ పెంచుకునేందుకో కొత్త ఆలోచన చేసింది ఓప్రా. అలాస్కా రాష్ట్రానికి చెందిన కొందరు బ్రహ్మచారులను ఎంపిక చేసుకుని వారందరినీ ఒకే విమానంలో షికాగోకి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని ముందుగానే ప్రచారసాధనాల ద్వారా హోరెత్తించడంతో ఆ అబ్బాయిలలో తమకు నచ్చేవాడెవరైనా ఉంటారేవోనన్న ఆశతో టీనేజీ అమ్మాయిలు వేలాదిగా ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చారు.

* 2005లో తన షో చూడ్డానికి స్టూడియోకి వచ్చిన 300 మందికీ పప్పుబెల్లాలు పంచిపెట్టినట్టు కార్లు పంచిపెట్టింది ఓప్రా. అందుకు ఆవిడ తన సొంత సొమ్ము వినియోగించలేదనుకోండీ. తమ సంస్థకు ప్రచారం కోసం ఓ కార్ల కంపెనీ వారు చేసిన ఏర్పాటు అది. పేరు మాత్రం ఓప్రాకే వచ్చింది.

* గత పాతికేళ్లుగా తన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న ప్రేక్షకుల్లో 300 మందిని 'విశిష్టప్రేక్షకులు' పేరుతో ఎంపిక చేసింది ఓప్రా. ఈఏడాది సిరీస్‌ ప్రారంభించే నేపథ్యంలో ఆ మూడొందల మందినీ ప్రత్యేకవిమానంలో ఆస్ట్రేలియాకు తీసుకెళ్లి అక్కడే రెండువారాల కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందుకోసం అయ్యే ఖర్చులో సగభాగాన్ని ఆస్ట్రేలియా పర్యాటక శాఖ భరించింది. ఇక ఈ సిరీస్‌కి వచ్చిన తొలి విశిష్ట అతిథి జాన్‌ ట్రవోల్టా.
...అవండీ ఓప్రా షో 'సమ్‌'గతులు.

Friday, April 1, 2011