Thursday, July 14, 2011

చందాల కేశవదాసు, Chandala Keshavadas


చందాల కేశవదాసు, Chandala Keshavadas



పరిచయం (Introduction) : తెలుగు సినిమా తొలి పాటల రచయిత చందాల కేశవదాసు భక్త ప్రహ్లాద లో ప్రత్యేకంగా రాసిన మూడు పాటలు ఇవి-
•పరితాప భారంబు భరియింప తరమా;
•తనయా ఇటులనే తగదుర బలుకా;
•భీకరమగు నా ప్రతాపంబునకు ---
అంచేత సినిమాకి ప్రత్యేకంగా పాటలు రాసిన తొలి రచయితగా చందాల కేశవదాసుగారిని చెప్పుకుంటున్నాం. జీవిత విశేషాలు (profile) :
•పేరు : శ్రీ చందాల కేశవదాసు సిద్ధాంతి ,
•పుట్టిన ఊరు : జక్కేపల్లి గ్రామము .. ... ఖమ్మం జిల్లా ,
•పుట్టిన తేదీ : 20 జూన్‌ 1876 ,
•చదువు : బడి చదువులల్తో పాటు సంస్కృతాంధ్రము చదివేరు .
•మరణము : 14-5-1956 .
రచనలు / సినిమాలు (filmography ): కనక్తార అనే నాటకము వ్రాసారు . కరక తార గా సినిమా తీసారు , నాటకాలలో పాటలు వ్రాసేవారు , హరికథలు , గేయాలు , పద్యాలు వ్రాసారు , భక్తప్రహ్లాద లో మూడు పాటలు ....
•పరితాప భారంబు భరియింప తరమా;
•తనయా ఇటులనే తగదుర బలుకా;
•భీకరమగు నా ప్రతాపంబునకు ---
భలే మంచి చౌక బేరము --కృష్ణతులాభారం, మునివరా తుదకిట్లు , కొట్టు కొట్టండిరా
•మీరజాలగలడా ... తులాభారము సినిమాలో ,
నాటినుంచి, నేటి వరకూ కూడా, నాటక ప్రదర్శనారంభంలో- ముఖ్యంగా పద్య నాటకాలు- 'పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద' అన్న ప్రార్థనా గీతాన్ని నటులందరూ కలిసి పాడతారు. ఇది రాసినది చందాల కేశవదాసుగారు. దీన్ని స్వరపరిచింది పాపట్ల లక్ష్మీకాంతయ్యగారు. ఈనాటికీ అదే పాటని అదే వరసలో పాడడం- పాట మీద భక్తి! ఇదొక విశేషం.
•కడారు నాగభూషణంగారు 1954లో తీసిన 'సక్కుబాయి'లో కేశవదాసు గారివి ఐదు పాటలు ఉపయోగించుకున్నారు. వాటిలో 'ఆటలాడుకోరా', 'గజ్జెలందియలు', 'కృష్ణా పోబోకుమా' బహుళ ప్రచారం పొందాయి. ఈ మూడు పాటల్ని అదినారాయణరావుగారు నిర్మించి, సంగీతం చేసిన 'సక్కుబాయి' (1965)లోనూ ఉపయోగించుకున్నారు

3 comments:

  1. iam chandala.santhoshnaidu iam proud of my ansister

    ReplyDelete
  2. I am chandala govinda rao grandson of chandala keshavadasu and my father's name is chandala veeraraghavulu,I am living in khammam district of telangana(old A.P) .9491912255.

    ReplyDelete
    Replies
    1. I can i get whole lyric of para brahma parameswara

      Grate ful to u.

      Delete