Thursday, September 29, 2011
Wednesday, September 28, 2011
Thursday, September 22, 2011
ANAGANAGA O DHEERUDU
Monday, September 19, 2011
Wednesday, September 14, 2011
ప్రేమ పక్షులు-సహ జీవనాలు
apr - Thu, 8 Sep 2011, IST Share ..
Email Print ఓహో గులాబిబాలా అందాల ప్రేమమాలా, సొగసైన కురులదానా సొంపైన మనసుదానా అని ప్రేమకోసం వెంటబడే ప్రియులు, పెద్దలు నిశ్చితార్థం కుదిరిస్తే పెళ్ళికి అంగీకరించినవారు పెళ్ళి అయ్యాక కొందరు ఆ ఆరాధన అలా జీవితాంతం కొనసాగిస్తే, కొందరు ప్రేమ మత్తు దిగాక 'ఛీ ఛీ గడ్డిపూవా, మేకప్ మోసకారీ...' అనే స్థితికి చేరతారు. సరే ఇదిలా ఉంచితే...
నృత్యదర్శకుడుగా రాణించి దేవదాసు, సువర్ణసుందరి వంటి చక్కని చిత్రాలు తన దర్శకత్వ ప్రతిభతో అందించిన వేదాంతం రాఘవయ్య నటి సూర్యప్రభని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
మిస్ మద్రాస్‌గా ఎంపికై, నటిగా, గాయనిగా సుప్రసిద్ధురాలైన టంగుటూరి సూర్యకుమారి పలు విదేశీయాత్రల అనంతరం ఇంగ్లండ్ కు చెందిన పెయింటింగ్ కళాకారుడు హెరాల్డ్ ఎల్విన్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకుని అక్కడే స్థిరపడి చక్కని సంసార జీవనం గడిపారు.
దర్శకుడు తాపీ చాణక్య, నటి సురభి బాల సరస్వతిల ప్రేమ సహజీవనం కొంతకాలం కొనసాగింది.
'ఏది నిజం' చిత్రంలో హీరో అయిన నాగభూషణం తర్వాత పలుచిత్రాల్లో కామెడీ పాత్రలు, కామెడి విలన్ పాత్రలుచేసి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగానూ రాణించారు. ఈయన ప్రదర్శించే 'రక్తకన్నీరు' నాటకం కోసం చాలా సినిమాలు వదులుకున్నారు కూడా. వేలాదిగా 'రక్తకన్నీరు' ప్రదర్శనలు ఇచ్చారు. చిత్ర నిర్మాతగాను వ్యవహరించారు. వివాహితుడైన నాగభూషణం 'రక్తకన్నీరు'లో నటించే సీత ప్రేమలోపడి ఆమెను వివాహమాడారు.
మలయాళ చిత్రరంగానికి చెందిన సీమ తెలుగు, తమిళ చిత్రాల్లోను హీరోయిన్‌గా చేసింది. మలయాళీ దర్శకుడు ఐ.వి.శశి కూడా కొన్ని తెలుగు చిత్రాలు డైరక్ట్ చేసారు. వీరిద్దరి ప్రేమవివాహం ఒడిదుడుకులు లేకుండానే సాగుతోంది.
విక్టరీ మధుసూదనరావుగా గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు వీరమాచనేని మధుసూదనరావు ప్రజానాట్యమండలి నుంచి సినీరంగంలోకి అడుగిడారు. ప్రజానాట్యమండలి కళాకారిణిగా సరోజనితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. వైవాహిక జీవితమూ హ్యాపీగానే కొనసాగుతోంది.
తమిళ నటి పుష్పలత, తమిళ నటుడు ఎ.వి.ఎం. రాజన్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
'మాయదారి మల్లిగాడు, బంగారుబాబు, నేరం నాదికాదు ఆకలిది, జేబుదొంగ' వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించిన మంజుల వివాహితుడైన నటుడు విజయ్‌కుమార్‌ని ప్రేమించి పెళ్ళాడారు. వీరికి పుట్టిన శ్రీదేవికూడా హీరోయిన్‌గా రాణించి వివాహం చేసుకుంది ఇటీవల.
చెల్లెలు పాత్రలు పోషించి ముత్యమంత ముద్దు, పోలీస్‌భార్య మున్నగు చిత్రాల్లో నాయికగా నటించి ఇటీవల కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూన్న సీత తమిళ చిత్రనటుడు, దర్శకుడు పార్దీబన్ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. కొన్నేళ్ళతర్వాత ఈ దంపతులు విడిపోయారు. అయినా అత్తగారు అప్పుడే కాదు ఇప్పటికీ సీతనే సమర్థిస్తూ వుంటుంది.
'భక్త ప్రహ్లాద'లో ప్రహ్లాదుడుగా నటించి తరువాత హీరోయిన్‌గా కొనసాగి, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మారిన రోజారమణి ఒరియా చిత్రాల హీరోగా వుండే చక్రపాణి (తర్వాత తెలుగు చిత్రాల్లోనూ నటించారు) ల మధ్య ప్రేమ చివురించి కొంతకాలం తర్వాత వివాహబంధంకి దారితీసి ఆనందంగా కొనసాగుతోంది. తరుణ్ వీరి కుమారుడు. నటుడు నవభారత్ బాలాజీది కూడా ప్రేమ వివాహమే.
నటుడు దర్శకుడు భాగ్యరాజ్‌కి తొలుత ప్రవీణతో వివాహమయింది. ఆమె మరణించిన తరువాత ఆయన చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన పూర్ణిమా జయరామ్‌తో ప్రేమలో పడ్డారు. పెళ్ళి చేసుకున్నారు.
కథానాయకుడు, చిత్రనిర్మాత అయిన సురేష్ ఇటీవలి కాలంలో విలన్‌గా కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తొలిదశలో గాయని అనితారెడ్డిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. వీరి దాంపత్యం కొంతకాలమే సాగింది.
కన్నడ నటి అయిన భారతి నాజూకు అందాలతో తెలుగు తెరపై కూడా 'నిన్నే పెళ్ళాడుతా, గోవుల గోపన్న' తదితర చిత్రాల్లో నటించింది. కన్నడ నటుడు విష్ణువర్ధన్, ఈమె పరస్పరం ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వీరిది ఆదర్శ దాంపత్యమే. విష్ణువర్ధన్ ఇటీవల మరణించారు.
అందాలనటి సుమలత 'రాజాధిరాజు, శుభలేఖ, ఖైదీ, రాక్షసుడు గ్యాంగ్‌లీడర్' తదితర చిత్రాల్లో నటించింది. ఈమె కేరక్టర్ ఆర్టిస్టుగానూ మారారు. ఈమె చేస్తున్న 'బ్రతుకు జట్కాబండి' టెలిసీరియల్ ద్వారా దాంపత్య జీవితంలో దెబ్బతిన్న వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఈమె కన్నడ నటుడు అంబరీష్‌ని ప్రేమించారు. చాలాకాలం పాటు ప్రేమికులుగా గడిపాక అంబరీష్‌తో వివాహమైంది. ఆదర్శ దాంపత్య జీవితం గడుపుతున్నారు.
నటి జయప్రద నిర్మాత, పంపిణీదారుడు సుందర్‌లాల్ నహతా కుమారుడైన శ్రీకాంత్ నహతా (ఈయనకూడా నిర్మాత, పంపిణీదారుడు)ను ప్రేమించి పెళ్ళాడారు. శ్రీకాంత్ నహతాకు అప్పటికే పెళ్ళి అయింది. రాజకీయ రంగంలోకి వెళ్ళి నటన తగ్గించినా అప్పుడప్పుడు మెరుస్తున్నారు. టెలీ ఇంటర్వ్యూలలో కూడా అలరిస్తున్నారు.
నటి జయసుధకి పంపిణీదారుడు రమణతో తొలుత వివాహమయింది. మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరువాత దర్శకత్వశాఖలో పనిచేస్తున్న నితిన్ కపూర్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. జె.కె.కంబైన్స్ పతాకాన పలుచిత్రాలు నిర్మించారు కూడా. వీరి దాంపత్యం సజావుగా సాగుతోంది. కేరక్టర్ ఆర్టిస్టుగా, ఎం.ఎల్.ఎ.గా రాణిస్తున్నారు.
హీరోయిన్ శ్రీదేవి, కమల్‌హాసన్ ప్రేమలో పడింది తొలిదశలో. పెద్దల అభ్యంతరంతో వారి ప్రేమ పెళ్ళివరకు రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేస్తూ వివాహితుడైన బోనీకపూర్‌తో పెరిగిన పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. వీరిద్దరూ అన్యోన్యంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఆమె రీ ఎంట్రీ విషయంలో కూడా నిర్మాత బోనీకపూర్ ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు.
నటి రమ్యకృష్ణ, దర్శకుడు కృష్ణవంశీలది కూడా ప్రేమ వివాహమే. షూటింగ్‌లో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. పెళ్ళి తర్వాత కూడా రమ్యకృష్ణ నటిగా కొనసాగుతున్నారు.
నటుడు శ్రీకాంత్, నటి ఊహ కూడా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఫిలిం కెరీర్‌లోనే వీరి ప్రేమపుట్టింది. వివాహం తర్వాత ఊహ గృహజీవితానికే పరిమితమయింది.
మలయాళ చిత్రాల్లో కావేరిగా రంగ ప్రవేశం చేసి, తెలుగులో 'శేషు' చిత్రంతో పరిచయమైన కళ్యాణి 'పెదబాబు' షూటింగ్ సమయంలో దర్శకుడు సూర్యకిరణ్‌తో ప్రేమలో’పడింది. ఇద్దరి ప్రేమ పెద్దల అంగీకారంతో ఫలించి పెళ్ళికి దారితీసింది. ఈమె నిర్మాతగా, భర్త దర్శకుడుగా 'చాప్టర్-6' చిత్రం కూడా ఇటీవల రూపొందించారు.
నటుడుగా పుంజుకుంటున్న సమయంలో శ్రీహరి, నటి డిస్కోశాంతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్ళి తర్వాత డిస్కోశాంతి సినిమాలకు స్వస్తి చెప్పింది. వీరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.
తుళు కుటుంబంలో జన్మించిన నటుడు ప్రకాశ్‌రాజ్ తొలుత డిస్కోశాంతి సోదరి లలితకుమారిని వివాహం చేసుకున్నారు ప్రేమించి. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి మరణించాడు. ఆ తర్వాత లలిత కుమారితో విడిపోయి గతసంవత్సరం కొరియోగ్రాఫర్ పోనీవర్మని వివాహం చేసుకున్నారు.
నటి రాధిక తొలుత నటుడు ప్రతాప్‌పోతన్‌ని ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. ఆ దాంపత్యం కొంతకాలమే కొనసాగింది. ఈ ఇద్దరూ కలిసి నటించిన చిత్రానికి నేషనల్ అవార్డ్ కూడా లభించింది. ఆ తర్వాత ఓ బ్రిటిషర్‌తో పరిచయం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి అది పెళ్ళకి దారితీసింది. కొన్నాళ్లు ఆ దాంపత్యం కొనసాగాక విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తమిళహీరో శరత్‌కుమార్ రాధికని ప్రేమించారు. పెళ్ళి మాట తెస్తే తొలుత రాధిక అంగీకరించలేదు. హీరోని పెళ్ళాడటం ఇష్టంలేదని ఖచ్చితంగా చెప్పారు. కానీ తల్లి ఒత్తిడి, శరత్ కుమార్ ప్రపోజల్‌తో ఇరువురూ దంపతులై దాంపత్య జీవితం హ్యాపీగా కొనసాగిస్తున్నారు.
కమల్‌హాసన్, శ్రీదేవి ప్రేమించుకున్నారు కానీ ఇరువర్గాల పెద్దలు అంగీకరించక పోవడంతో ప్రేమబంధమే కొన్నాళ్ళు సాగింది. ఆ తర్వాత వాణీ గణపతిని ప్రేమించి వివాహమాడారు. కొంతకాలం తర్వాత విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ సారిక పరిచయంతో ఇద్దరిమధ్య ప్రేమ పుట్టి వివాహబంధం అయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక మనస్పర్థలు పెరిగి విడాకులకు దారితీసింది. ఇప్పుడు నటి గౌతమితో సహజీవనం కొనసాగిస్తున్నారు.
నటి రమాప్రభ (అప్పటికే వివాహిత), నటుడు శరత్‌బాబుని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరి వివాహబంధం కొంతకాలం బాగానే కొనసాగింది. ఇరువురూ ఫిలిం కెరీర్‌లోనే కొనసాగుతుండగా కొన్ని అనివార్య కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత శరత్‌బాబు తమిళ విలన్, కేరక్టర్ నటుడు నంబియార్ కుమార్తెను పెళ్ళాడి దాంపత్యజీవితం హ్యాపీగా కొనసాగిస్తున్నారు.
పాటల రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ సుచిత్రలది ప్రేమ వివాహమే. సుచిత్రా చంద్రబోస్ ఆ మధ్య 'పల్లకీలో పెళ్ళికూతురు' చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు.
హ్యాపీడేస్ ఫేమ్ వంశీ కాలేజీరోజుల్లోనే ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఆ ప్రేమ పెళ్ళిబంధంగా మారింది.
ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సావిత్రిలది ప్రేమ వివాహమే. బాలు పాటలకు తొలుత అభిమాని సావిత్రి. ఆ తరువాత వారి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.
నాగార్జునది తొలుత పెద్దలు కుదిర్చిన పెళ్ళి. నిర్మాత డి.రామానాయుడు కుమార్తె లక్ష్మితో వివాహం అయింది. వీరి పుత్రుడే నాగచైతన్య. ఆ తరువాత దాంపత్య జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తి విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఫిలిం కెరీర్‌లో ఏర్పడ్డ పరిచయాలతో అమలకి తన ప్రేమ ప్రపోజ్ చేసారు. కొంతకాలం అమల నుంచి సమాధానం రాలేదు. ఆ తర్వాత హీరోయిన్ అమల, నాగార్జునల మధ్య చిగురించిన ప్రేమ పెళ్ళికి దారితీసింది. పెళ్ళి తర్వాత అమల గృహజీవితానికి అలవాటుపడి, తరువాత మూగజీవుల సంరక్షణను కొనసాగిస్తోంది. వీరి పుత్రుడే అఖిల్.
మహేష్, నమ్రతా శిరోద్కర్‌లది ప్రేమ వివాహామే. తొలి చూపులోనే ప్రేమ అంటే నచ్చని తత్వం గల మహేష్ పరిచయం తర్వాత స్నేహంగా మారాక, అది ప్రేమకు దారితీసాక తలిదండ్రులు అనుమతితో వివాహబంధంగా మార్చుకున్నారు.
ప్రముఖ గాయని పి. సుశీల, డా. మోహన్‌రావులది ప్రేమ వివాహమే. ఆనందంగానే చివరివరకు కొనసాగింది. ప్రముఖ గాయని ఎస్.జానకి రాంప్రసాద్‌లది కూడా ప్రేమ వివాహమే. వీరిదీ అన్యోన్య దాంపత్యమే.
గాయకుడు రామకృష్ణ, గాయని జ్యోతి ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు. గాయనీ గాయకులు గోపికా పూర్ణిమ మల్లికార్జున్‌లది కూడా ప్రేమ వివాహమే.
హఠాత్తుగా అనారోగ్యం సంప్రాప్తించిన హీరోయిన్ వాణిశ్రీకి వైద్య చికిత్స చేసిన డా. కరుణాకర్ మెల్లిగా ఆమెను ప్రేమించసాగారు. అక్క, బావలతో ఉంటూన్న వాణిశ్రీకి ఒక అండకూడా అవసరమైన కారణంగా కరుణాకర్ ప్రేమను అంగీకరించడంతో వివాహమైంది. వీరిదీ అన్యోన్య దాంపత్యమే.
నటి రోహిణి, నటుడు రఘువరన్‌లది, నటుడు మహర్షి రాఘవ నటి మహాలక్ష్మి (పుష్పత-ఏవిఎమ్ రాజన్‌ల కుమార్తె) లది కూడా ప్రేమ వివాహమే. అయితే ఈ దంపతుల వైవాహిక జీవితం కొన్నేళ్లే బాగా కొనసాగింది.
నటి విజయశాంతి, తర్వాత నిర్మాత అయిన శ్రీనివాస్ ప్రసాద్‌లదీ ప్రేమ జీవనమే. దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్, నటి అనితలది ప్రేమైక సహజీవనమే.
సీతారత్నంగారి అబ్బాయి, ముగ్గురు మొనగాళ్ళు, భైరవద్వీపం, చిత్రాల హీరోయిన్‌గా రాణించి తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన రోజా పలు తమిళ చిత్రాల్లో నటించింది. తమిళ దర్శకుడు సెల్వమణి చిత్రాల్లో నటిస్తుండగా ఇద్దరి మధ్య పుట్టిన ప్రేమ పెళ్ళికి దారితీసి ఆనందమయ జీవనం గడుపుతున్నారు.
హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికల ప్రేమ వివాహం అన్యోన్యంగా సాగుతోంది.
బాలనటిగా ప్రవేశించి హీరోయిన్‌గా ఎదిగిన రాశి దర్శకుడు నివాస్‌లది కూడా ప్రేమ వివాహమే.
సహాయ పాత్రలు పోషిస్తూ, అందమైన కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సుమిత్ర, కన్నడ దర్శకుడు రాజేంద్రబాబు కూడా ప్రేమించి పెళ్ళాడారు.
పవన్ కళ్యాణ్‌కి నందితకు వివాహం అయింది. తర్వాత సమస్యగామారి విశాఖపట్టణం కోర్టులో చాలాకాలం సాగి విడాకుల వరకు దారితీసింది. తర్వాత రాజీపడ్డారు. నటి రేణుకాదేశాయ్‌తో చాలాకాలం సహజీవనం సాగించాక మూడు ముళ్లు వేసారు పవన్‌కళ్యాణ్.
తలంబ్రాలు చిత్రంలో హీరోయిన్‌గా తెలుగుతెరకు పరిచయమైన జీవిత, ఆ చిత్రంలో నటించిన డా. రాజశేఖర్ కొన్ని చిత్రాల్లో జంటగా నటించారు. వారి మధ్య చివురించిన ప్రేమ 'మగాడు' చిత్రంలో రాజశేఖర్‌కి యాక్సిడెంట్ కావడంతో మరింత బలపడి పెద్దల ఆశీర్వాదంతో పెళ్ళాడారు. ఈ దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది.
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ, రంగస్థలంలోనూ బిజీగావున్న దాసరినారాయణరావు తన చెల్లెలుకి గాజులు కొనడానికి సుల్తాన్ బజార్ వెడితే, అక్కడ చెల్లెలు చేతికి సరిపోయే గాజులను ఎంపిక చేసిన పద్మతో ఏర్పడిన పరచయం ప్రేమగా మొలకెత్తి పెళ్ళిపీటలు ఎక్కించింది. తర్వాత సినీరంగంలో బిజీ అయ్యారు దాసరి నారాయణరావు. ట్రేడ్ యూనియనిస్ట్‌గా, రాజకీయ వేత్తగా, నిర్మాతగా దాసరి పద్మ కొనసాగుతూ అన్యోన్యదాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు.
దాసరి గురించి రాసాక దాసరిని దర్శకుడిని చేసిన నిర్మాత (ప్రతాప్ ఆర్ట్స్ కె.రాఘవ) ద్వారానే దర్శకుడైన ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గురించి ప్రస్తావించకపోతే ఎలా? దర్శకుడుగా ఎదుగుతున్న కోడిరామకృష్ణకు తెనాలికి చెందిన సినీరంగంలో నటిగా కొనసాగే ప్రయత్నం చేస్తున్న పద్మాంజలితో ఏర్పడ్డ పరిచయం ప్రేమకు దారి తీసి మూడు ముళ్ళు వేయించింది. పెళ్ళి తర్వాత నటజీవితానికి స్వస్తి పలికి గృహిణిగానే కొనసాగుతోంది ఆయన భార్య.
ప్రేమలు, పెళ్ళిళ్ళు గురించి నటి జమున అభిప్రాయం ఒకసారి పరిశీలిద్దాం. తిరుపతిలో రీసెర్చి చేస్తున్న జువాలజీ ప్రొఫెసర్ రమణరావుతో ఆమె వివాహం కుదిరాక, తోటి హీరోయిన్లతో చర్చ వచ్చిందట. సినీపరిశ్రమతో సంబంధంలేని బయట వ్యక్తిని పెళ్ళాడుతున్నావు. ఇది రిస్క్ అని, అపోహలు, అనర్థాలు పెరుగుతాయి అని, ఇప్పటివరకు హీరోయిన్లెవరూ బయటవారిని పెళ్ళాడలేదని అన్నారట. అంతా మన ప్రవర్తనమీదనే ఆధారపడివుంటుందని జమున ఆ ప్రసక్తిని ఖండించింది. ''పరిశ్రమలోని వ్యక్తినో, తోటి హీరోనో, నటుడినో, నటినో పెళ్ళి చేసుకున్న వారిలో ఎంతమంది సుఖసంసారం సాగించారు? అంతా సంస్కారం మీదనే ఆధార పడివుంటుం''దని కూడా వారితో జమున అన్నారు. అంతేకాదు సినీతారలను బయటవారు పెళ్ళి చేసుకోరనే ఒక అపనమ్మకం ప్రబలింది. అందుకే సినిమారంగంలో వారినే ఒక్కోసారి వివాహితుడైనా సినిమావారు చేసుకుంటున్నారు- అని కూడా అన్న జమున తన మాటమీదనే నిలబడి వివాహబంధం చక్కగా కొనసాగిస్తోంది. ఇలా బయట వ్యక్తులను పెళ్ళి చసుకున్నవారిలో బి.సరోజాదేవి, ఎల్.విజయలక్ష్మి, కృష్ణకుమారి ప్రభృతుల వివాహజీవితం ఆనందమయంగానే సాగింది, సాగుతోంది.
ప్రేమ ఎంతో మధురం అది ఫలించే వరకూ. ఫలించి పెళ్ళికి దారితీసాక కొన్ని నెలలకు, కొన్నేళ్ళకు కొందరికి కాలకూటవిషం. కారణం ప్రేమ పొరల్లో చిక్కుకున్నందున భావాలు, ఆలోచనలూ, కోరికలు, ఒకే రకం అని అప్పుడు ఎంత పోలికలతో అనిపించినా ప్రేమామృతం పలుచన అయ్యాక ఒకరి అలవాట్లు, ఆలోచనలు, ఆశలు, కోరికలు విరుద్ధంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కులాంతర, మతాంతర, భాషాంతర ప్రేమికుల్లో కాంప్లెక్స్‌లు బయటపడతాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారతాయి. ప్రేమే జీవితం, ప్రేమే సర్వస్వం అంటూ ప్రేమకోసం ఎన్నోసార్లు పాడిన హీరో, హీరోయిన్‌ల మధ్యగాని, తన ప్రేమను దక్కించుకోడానికి హీరోయిన్, హీరోని అగచాట్ల పాలుచేసిన విలన్లు, వ్యాంపుల విషయంలోనైనా పురుషుడిలోని అహంకారం పరాకాష్ఠకు చేరితే, స్త్రీలోని ఓరిమి సన్నగిల్లుతుంది. సినిమావారి ప్రేమ అయినా, ఇతర రంగాల్లోని వారి ప్రేమ అయినా ఇంతే. అందరాని అందం, అందుకోలేని సుందరి అందాక కొన్నాళ్ళకు మొహం మొత్తుతుంది. పరస్త్రీలపై వ్యామోహం పెరుగుతుంది ('తేనెటీగ' ఇతివృత్తం ఇదే). దీనికి కారణం కొంత భార్య వ్యవహార శైలియే. తొలిరోజుల్లో ఎంతో విరహాత్కంఠితలా ఎదురుచూచే భార్య, కుటుంబ బాధ్యతలు, వంట-వార్పులు వల్ల ఇంట్లోంచి బయట కెళ్ళడంలేదు కదా అని, ఇంకా నాలో ఏం ప్రత్యేకత- వుంది అనే భావనలో సింగారానికి దూరం అవుతారు. తద్వారా భర్త ఈసడింపులు ఎక్కువవుతాయి. భర్తకూడా అలాగే వ్యవహరిస్తాడు. ప్రేమ వికటిస్తుంది.
ఒకే కెరీర్‌లో వున్నా పెళ్ళి తర్వాత భార్య అందలం ఎక్కితే భర్త సహించలేడు. భార్యలోని ప్రతి అంశమూ తప్పుగానే, తనను అవమానిస్తున్నట్టుగానే తోస్తుంది. ఈ అంశాన్ని అమితాబ్, జయబాధురి సినీరంగానికి చెందిన పాత్రలు పోషించిన 'అభిమాన్' చిత్రంలో చక్కగా చూపారు.
సినీరంగానికి చెందిన పాత్రలు కాకపోయినా భానుమతి ఎన్టీఆర్ నటించిన 'వివాహబంధం'లోనూ చూపారు.
దాసరి దర్శకత్వంలో శోభన్‌బాబు, శారద నటించిన 'బలిపీఠం' కూడా ఒక ఉదాహరణ.
ప్రేమే సర్వస్వం అన్నవారికి ప్రేమ తిండిపెట్టదు- అనే విషయం కొంతకాలం తర్వాత అనుభవపూర్వకంగా తెలుస్తుంది. జగదేకవీరుడు సగటు మానవుడు, అతిలోక సుందరి సాధారణ స్త్రీ అయి పోతారు. ప్రేమ పైత్యం అనిపిస్తుంది. పెళ్ళి పీడగా కనిపిస్తుంది. సర్దుకుపోయే మనస్తత్వం, ఓరిమి, సహనం, పట్టు విడుపులు లేకపోవడం వల్లే పలు ప్రేమ పెళ్ళిళ్ళు విడాకులకు దారితీస్తున్నాయి.

Thursday, September 8, 2011
Tuesday, September 6, 2011
Friday, September 2, 2011
తెలుగు టాకీ తొలి కిరణం పి.వి. దాసు
ఆదివారం అనుబంధం Sat, 14 May 2011, తొలినాళ్ళలో తెలుగు నాట సినీ రంగానికి ఊపిరి పోసిన పెద్దల పేర్లను రాయమంటే, అందులో ముందు వరుసలో వచ్చే పేరు - పి.వి. దాసు. తెర మీద బొమ్మలు తేట తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత సినీ రంగానికి ఆయన చేసిన సేవలు అపూర్వం. సినిమా షూటింగంటే బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్‌ల చుట్టూ తిరుగుతున్న రోజుల్లో ఆ ధోరణిని మార్చడానికి సాహసించిన మార్గదర్శి ఆయన. దక్షిణ భారతదేశాన్ని, అందులోనూ అప్పటి మన ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని అయిన మద్రాసు మహానగరాన్ని షూటింగులకు కేంద్రంగా మలిచేందుకు గట్టి పునాది వేసిన ఘనత ఆయనది. తమిళ వాణిజ్య ప్రముఖులతో కలసి, మద్రాసులో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' పేరిట చక్కటి స్టూడియో నిర్మాణం జరిపిన తెలుగు బిడ్డగా పి.వి. దాసు చిరస్మరణీయులు.
పి.వి. దాసు పూర్తి పేరు - పినపాల వెంకట దాసు. కృష్ణాజిల్లా బందరులో పుట్టి, పెరిగారు. స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నారు. చదువు పూర్తయ్యాక ఆయన నెల్లూరులోని తమ బావ గారి దగ్గరకు వెళ్ళారు. పెట్రోలు ఏజెన్సీ వ్యాపారస్థులైన బావ గారి దగ్గర గుమస్తాగా పనిచేస్తూ, వ్యాపారంలోని మెలకువలు నేర్చుకున్నారు. అక్కడ కొన్నాళ్ళున్న తరువాత దాసు మళ్ళీ బందరుకు వచ్చేశారు. ఇదంతా 1915 నాటి సంగతి. సొంత ఊరికి వచ్చిన తరువాత ఆయన కృష్ణాజిల్లా మొత్తానికీ 'బర్మా షెల్' సంస్థ వారి కిరోసిన్, పెట్రోలు ఏజెన్సీ తీసుకున్నారు. ఆ వ్యాపారానికి తోడుగా ఓ సోడా ఫ్యాక్టరీ పెట్టారు. అలాగే, ఐస్ ఫ్యాక్టరీని నెలకొల్పి, నడిపారు. అప్పట్లో ఆయన చేసిన ప్రతి వ్యాపారమూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడిచింది. ఈ వ్యాపారాలే కాక, ఆయనకు సొంతంగా చాలా భూములు కూడా ఉండేవి. ఇటు వ్యాపారంలో, అటు వ్యవసాయంలో ఆయన బోలెడంత డబ్బు సంపాదించారు.
ప్రదర్శక రంగం నుంచి చిత్ర నిర్మాణానికి...
పి.వి. దాసుకు కళలంటే మహా ప్రీతి. ఆ కళాభిరుచి కారణంగా ఆ కాలంలోని ఉత్తమ కళాకారులతో, కవులతో, సాహితీవేత్తలతో ఆయన పరిచయాలు పెంచుకున్నారు. నాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేశారు. పలు నాటక ప్రదర్శనల్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో మంచి నాటకాలు కావాలంటూ రచనలపై చర్చలు జరిపేవారు. ఆ రోజుల్లో నాటకానికీ, సినిమాకూ ఉన్న విడదీయరాని సంబంధం వల్ల ఆయన సహజంగానే సినీ రంగం వైపు కూడా ఆకర్షితులయ్యారు. సినీ రంగానికి తెలుగునాట ప్రాచుర్యం కల్పించాలనే కోరిక కలిగింది. అలా ఆయన మూకీ చిత్రాల రోజుల్లోనే చిత్రసీమలోకి వచ్చారు. సినిమాల ప్రదర్శన నిమిత్తం కొందరు మిత్రులను కూడగట్టుకొని, బందరులో 1925లో 'మినర్వా' హాలు నిర్మించారు. (ఇప్పటికీ అది 'మినర్వా టాకీసు' పేరుతో నడుస్తోంది). అలాగే, ఆ తరువాతి రోజుల్లో గుంటూరు జిల్లా రేపల్లెలో 'శ్రీకృష్ణా' అంటూ మరో సినిమా హాలు కట్టారు. అలా చలనచిత్రాల ప్రదర్శక రంగంలోకి వచ్చిన పి.వి. దాసు సహజంగానే కాలక్రమంలో చిత్ర నిర్మాణం వైపు మళ్ళారు. 1931 నాటికల్లా భారతదేశంలోకి టాకీలు వచ్చేసినా, తెలుగు చిత్రాలు తీసే నిర్మాతలందరూ బొంబాయి, కలకత్తా, కొల్హాపూర్ నగరాలకు వెళ్ళి, అక్కడే చిత్ర నిర్మాణం చేయాల్సి వచ్చేది.
రాజా వారి బంగళాలో రమ్యమైన స్టూడియో
మనకే మద్రాసులో స్టూడియో ఉంటే, సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయనే ఉద్దేశం పి.వి. దాసుకు కలిగింది. దాంతో, మద్రాసుకు చేరుకొని, తమిళనాట చలనచిత్ర ప్రదర్శకులైన ఎం.టి. రాజన్, స్వామి, సి.పి. సారథి, జయంతీలాల్ ఠాకూర్‌లనూ, అలాగే చల్లపల్లి రాజా గారి లాంటి పెద్దలనూ కలుపుకొని, 'వేల్ పిక్చర్స్'ను స్థాపించారు. వాటాల జారీతో దాన్ని 'వేల్ పిక్చర్స్ లిమిటెడ్'గా తీర్చిదిద్దారు. మద్రాసులోని తేనాంపేట ప్రాంతంలో ప్రస్తుత వీనస్ కాలనీ (ఒకప్పుడు వీనస్ స్టూడియో)కి దగ్గరలో పిఠాపురం రాజా వారికి 'డన్‌మోర్ హౌస్' అనే పెద్ద బంగళా ఉండేది. పి.వి. దాసు అది తీసుకొని, దానిలో 'వేల్ పిక్చర్స్' పేరున సినిమా చిత్రీకరణలకు అనువైన స్టూడియోను నెలకొల్పారు. అప్పటికి మద్రాసులో 'శ్రీనివాస సినీటోన్' అనే మరో సినిమా సంస్థ ఉంది. దక్షిణ భారతదేశంలోనే తొలి టాకీ స్టూడియో అయిన 'శ్రీనివాస సినీటోన్' ఆ సంస్థదే!
'శ్రీనివాస సినీటోన్' కన్నా ఎంతో ఉత్తమంగా, నాణ్యమైన సాంకేతిక వసతులతో 'వేల్ పిక్చర్స్ స్టూడియో' ఏర్పాటైంది. వేల్ పిక్చర్స్ స్టూడియో నిర్మాణం, నిర్వహణకు పి.వి. దాసు ఎంతో శ్రమించారు. 'వేల్ పిక్చర్స్' కంపెనీ వారు విశేషంగా పరిశ్రమించి, వ్యయానికి లెక్క చేయకుండా, ఉత్తమమైన చిత్రాలను తయారుచేయాలనే లక్ష్యంతో పాటుపడ్డారు. పైగా, వాళ్ళు స్టూడియో నిర్మించుకున్న 'డన్‌మోర్ హౌస్' అన్ని విధాల వాళ్ళ ఉద్యమానికి అనుకూలమైంది. స్టూడియో కోసం ఆధునిక యంత్ర సామగ్రిని చాలా వరకు తెప్పించారు. అజంతా, ఎల్లోరా చిత్తరువుల సంప్రదాయాలను అనుసరించి, వస్తు వాహనాలను విరివిగా తయారు చేయించారు. ఆంధ్రదేశంలోనూ, అరవ దేశంలోనూ ఉండే శిల్పులు, వడ్రంగుల్లో ప్రవీణులైన కొందరిని రప్పించి, స్టూడియోకు అవసరమైన సరంజామాను అమర్చుకున్నారు.
స్టూడియోకు సారథ్యం
మద్రాసులోని 'డన్ మోర్' భవనంలో కొత్తగా స్థాపించిన వేల్ పిక్చర్స్ కంపెనీ వారి స్టూడియోను 1934 జూలై 31 మంగళవారం ఉదయం 8 గంటలకు మద్రాసు రాష్ట్ర గవర్నర్ సర్ మహమ్మద్ ఉస్మాన్ సాహెబ్ బహద్దూర్ ప్రారంభించారు. పురప్రముఖులు పలువురు ఆ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 'వేల్ పిక్చర్స్' కంపెనీ డైరెక్టర్ల పక్షాన గవర్నర్ గారికి, పి.వి. దాసు సన్మానపత్రం సమర్పించారు.
'వేల్ పిక్చర్స్' సంస్థ తమ స్టూడియోలో తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాలను కూడా నిర్మిస్తూ వచ్చింది. డైరెక్టర్లు, ఇతర నిర్వాహకులను కూడా తెలుగు చిత్రాలకు తెలుగు వాళ్ళనూ, తమిళ చిత్రాలకు తమిళ వాళ్ళనూ ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ స్టూడియోలో కెమేరామన్‌గా కె. రామనాథ్, కళాదర్శకుడిగా ఏ.కె. శేఖర్, రచయితగా టి.ఎస్. మురుగదాస నియమితులయ్యారు.
చిత్ర నిర్మాణం, స్టూడియో ప్రారంభం కాక ముందు నుంచి స్టూడియోలోనే ఉండి, అన్ని పనులూ దాసే స్వయంగా నిర్వహించుకొనేవారు. ఆ రకంగా స్టూడియోలో సాంకేతిక విషయాలన్నిటిలో ఆయన చక్కటి పరిజ్ఞానం సంపాదించారు. ఆ పరిజ్ఞానం ఎంతటిదంటే - అవసరాన్ని బట్టి సినిమా షూటింగులో ఆయనే సౌండ్ రికార్డు చేసేవారు. ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించేవారు.
బందరు సమాజంలో కీలకపాత్ర
'వేల్ పిక్చర్స్' వ్యవహారంతో మద్రాసుకు తరలిరావడానికి ముందు బందరులో ఆయన కీలక భూమికలే నిర్వహించారు. బందరులో మునిసిపల్ సంఘంలో సభ్యులుగా వ్యవహరించారు. అలాగే, జిల్లా బోర్డులో కూడా సభ్యులుగా వ్యవహరించారు. పట్టణంలో ప్రముఖులుగా నిలిచారు. అయితే, 'బర్మా షెల్' ఏజెంటుగా ఉన్నప్పుడు, బందరు, రేపల్లెలో సినిమా హాళ్ళ నిర్వహణప్పుడు, పట్టణ సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పుడు కన్నా మద్రాసులో వేల్ పిక్చర్స్ నిర్మాణంతో ఆయనలో తేజం ఆరంభమైంది. వేల్ పిక్చర్స్ స్టూడియోను నిర్మించిన తరువాతి సంవత్సరాలు ఆయన జీవితంలో ఎంతో ప్రకాశవంతంగా సాగాయని చెప్పవచ్చు. ఆ స్టూడియో నిర్మాణంతో మద్రాసులో స్టూడియోల లోటు తీరడమే కాక, ఆ పతాకం నుంచి వెలువడిన 'సీతాకల్యాణము', 'శ్రీకృష్ణలీలలు' టాకీ చిత్రాలు తెలుగు టాకీలలో ఉత్తమ శ్రేణికి చెందినవిగా నిలిచాయి. ఆ రెండు మహత్తరమైన టాకీలను ప్రసాదించి, తెలుగునాటి నంతటినీ వినోదింపజేసిన నిపుణమతి - పి.వి. దాసు.
దక్షిణాది తయారీ తొలి తెలుగు టాకీ
'వేల్ పిక్చర్స్' తొలి చిత్రం - తెలుగు సినిమా 'సీతా కల్యాణము' (1934). ఆ స్టూడియోలో ప్రథమంగా నిర్మించినది కూడా ఈ చిత్రమే! ఆ రకంగా మద్రాసులో తెలుగు చలనచిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది - పి.వి. దాసు. అప్పటి దాకా ఉత్తర భారతదేశంలోని నగరాల్లో రూపొందుతున్న తెలుగు చిత్రాలకు భిన్నంగా, దక్షిణ భారతదేశంలోనే తయారైన తొలి తెలుగు చిత్రంగా 'సీతా కల్యాణము' చరిత్ర సృష్టించింది. వేల్ పిక్చర్స్ అధినేతలు తమ స్టూడియోలో పని చేయడానికి బొంబాయి, కలకత్తాల నుంచి సుశిక్షితులైన సాంకేతిక నిపుణులను పిలిపిద్దామని భావించారు. కానీ, ఈ సాంకేతిక నిపుణుల త్రయం మాత్రం అలా చేయనక్కరలేదని వారించింది. స్థానికులనే రప్పించి, వారికి అద్భుతమైన శిక్షణనిచ్చింది. రారు థియేటర్‌లో చీఫ్ ప్రొజెక్షనిస్టుగా పని చేసే సి.ఇ. బిగ్స్ ఈ స్టూడియోలో శబ్దగ్రహణ శాఖకు అధిపతిగా వచ్చారు. ఎంతోమంది సౌండ్ ఇంజనీర్లకు ఆయన శిక్షణనిచ్చారు. ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలతో, అప్పటికి అధునాతన సాంకేతిక సౌకర్యాలతో స్టూడియో అనుపమాన స్థాయిలో ఉండేది.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను బెజవాడ సమీపంలోని కొండపల్లి దగ్గర అడవుల్లో ఔట్‌డోర్‌లో తీయడం విశేషం. అలా తెలుగు నాట ఔట్‌డోర్ చిత్రీకరణకు కూడా ఈ సినిమాయే శ్రీకారం చుట్టింది. 'సీతా కల్యాణము'లో వచ్చే ఊరేగింపు సీన్లు, జనకుని రాజాస్థానం వగైరా సీన్లన్నీ బెజవాడ సమీపంలో చల్లపల్లి సంస్థానంలో తీశారు. ''అప్పట్లో బెజవాడలో 'మారుతీ సినిమా', 'శ్రీదుర్గాకళామందిరం' రెండు హాళ్ళలోనూ ఏకకాలంలో 'సీతా కల్యాణము' సినిమా విడుదలైంది. నాకు తెలిసి అలా ఒకే కేంద్రంలో ఎక్కువ థియేటర్లలో సినిమా రిలీజు కావడమనేది తెలుగులో ఆ సినిమాతోనే మొదలు!'' అని అప్పట్లో తన 15 ఏళ్ళ వయస్సులో ఆ సినిమా చూసిన సంగతులను తొలితరం సినీ జర్నలిస్టు అయిన 91 ఏళ్ళ మద్దాలి సత్యనారాయణ శర్మ (ఎం.ఎస్. శర్మ) గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద ఉత్తరాది వారి డబ్బులతో కాకుండా, తెలుగు వారి పెట్టుబడితో, దక్షిణాదిన రూపుదిద్దుకున్న తొలి టాకీ 'సీతా కల్యాణము' విశేష జనాదరణను పొందింది.
చిత్ర నిర్మాణ సారథిగా దాసు కృషి
వేల్ పిక్చర్స్ సంస్థ మరోపక్క 'మార్కండేయ' తదితర తమిళ టాకీలు కూడా నిర్మించింది. ఇక, వారి రెండో తెలుగు చిత్రం - 'శ్రీకృష్ణలీలలు' (1935). దానికీ సారథ్యం - పి.వి. దాస్‌దే! ఆయన గొప్పదనం ఏమిటంటే - ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రతిభావంతులను తెర మీదకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతమైన కృషి చేసేవారు. సరిగ్గా గమనిస్తే - 'వేల్ పిక్చర్స్'లో ఏ చిత్రానికి ఆ చిత్రం నటీనటులు మారిపోయేవారు. ప్రతి సినిమాకూ వేర్వేరు నటీనటులను తీసుకొనేవారు. 'శ్రీకృష్ణలీలలు' విడుదలప్పుడు ప్రచారం విషయంలో పి.వి. దాసు మరో కొత్త పుంత తొక్కారు. ప్రత్యేకంగా విమానం అద్దెకు తీసుకొని, ప్రముఖ పట్టణాలలో గగనతలం నుంచి కిందకు సినిమా ప్రచార కరపత్రాలను వెదజల్లే ఏర్పాట్లు చేశారు. ఆ రోజుల్లో విమానమే వింత అయితే, విమానంలో నుంచి కరపత్రాలను జారవిడవడం మరో పెద్ద వింత. ఆ వినూత్న ప్రచార వ్యూహం జనంలో పెద్ద క్రేజును సృష్టించింది.
ఆ తరువాత మూడో తెలుగు ప్రయత్నంగా, స్వీయ దర్శకత్వంలో 'శశిరేఖా పరిణయము' ('మాయాబజార్' - 1936) చిత్రాన్ని పి.వి. దాసు ప్రారంభించారు. అయితే, షూటింగ్ సగంలో ఉండగానే, దాసు హఠాన్మరణం చెందారు. వేల్ పిక్చర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి. రాజన్ ఆ చిత్రాన్ని పూర్తి చేసి, విడుదల చేశారు. ఆ సినిమా చివరన ''రిమెంబర్ ఇట్ ఈజ్ ఏ వేల్ పిక్చర్స్ ప్రొడక్షన్'' అంటూ ఆంగ్లంలో టైటిల్ కార్డు వేశారు. తెలుగు చిత్రాలకు అలా వేయడం కూడా అదే ప్రథమం.
మచిలీపట్నంలో ఓ సినిమా హాలు యజమానిగా మొదలై వేల్ పిక్చర్స్ స్టూడియోకు బిజినెస్ డైరెక్టర్‌గా ఎదిగిన పి.వి. దాసు వ్యాపారానుభవం అపారం. అలాగే, చిత్ర నిర్మాణంలోని ప్రతి చిన్న అంశం మీద ఆయనకు అమితమైన పట్టు ఉండేది. ఛాయాగ్రహణం లాంటి సాంకేతిక అంశాల్లో సైతం ఆయనకున్న పరిజ్ఞానం అపారం. జీవించిన కొద్దికాలంలోనే పి.వి. దాసు, 'సౌత్ ఇండియన్ సౌండ్ కార్పొరేషన్' అనే సంస్థను స్థాపించి, శబ్దగ్రహణానికి కావాల్సిన పరికరాలెన్నిటినో దిగుమతి చేసి, ఇతరులకు సరఫరా చేసేవారు.
కళ విషయంలో కల్లలైన కలలు
చిత్ర నిర్మాణ, దర్శకత్వ శాఖలకు సంబంధించి దాసు ఎన్నో కలలు కన్నారు. అయితే, 'శశిరేఖా పరిణయము' చిత్రాన్ని పూర్తి చేయకుండానే, ఆయన అకస్మాత్తుగా మరణించడంతో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. ఇప్పటికి సరిగ్గా 75 ఏళ్ళ క్రితం 1936 మే 10వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మద్రాసులో పి.వి. దాసు మరణించారు. తేనాంపేటలోని వేల్ పిక్చర్స్ స్టూడియోకు ఎదురుగా ఉన్న స్వగృహంలో మరణించేనాటికి పి.వి. దాసు వయస్సు కేవలం 46 ఏళ్ళే! ఆయనకు భార్య, ఏడుగురు పిల్లలు ఉండేవారు. పి.వి. దాసు మేనల్లుడే తరువాతి రోజుల్లో ఛాయాగ్రాహకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న బందరు వాస్తవ్యుడు - పి. శ్రీధర్.
ఆదర్శాలన్నీ సఫలం కాకుండానే, దాసు మరణించిన తరువాత 'వేల్ పిక్చర్స్' ప్రాభవం కూడా క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆ పతాకం నుంచి మళ్ళీ తెలుగు సినిమాలేవీ రాలేదు. కొన్ని తమిళ చిత్రాలను రూపొందించినప్పటికీ, చివరకు ఆ సంస్థ చిక్కుల్లో పడింది. పి.వి. దాసు మరణం తరువాత స్టూడియో నిర్వహణపై క్రమంగా నీలినీడలు పరుచుకున్నాయి. స్టూడియోను మద్రాసులోనే తేనాంపేట నుంచి గిండీ ప్రాంతానికి మార్చారు. ఆ తరువాత సంస్థ దివాళా తీసి, సాంకేతిక సామగ్రిని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్టూడియో ప్రాంతమే ఆ తరువాత 'నరసూస్ కాఫీ' అధినేతల చేతుల్లోకి వెళ్ళి, 'నరసూ స్టూడియోస్'గా అవతరించింది. ఆ తరువాత అదీ పోయింది. ఇప్పుడు ఆ స్థలమంతా గిండీ వంతెన పక్కనే క్యాంపా కోలా మైదానంగా కనపడుతుంది.
ఏమైనా, పి.వి. దాసు సారథ్యంలో మొదలైన వేల్ పిక్చర్స్ సంస్థ అప్పట్లో ఓ సంచలనం. ప్రతిభావంతులకు ఆటపట్టు. తరువాతి రోజుల్లో ప్రముఖ సంగీత దర్శకుడై, మాస్టర్ వేణుగా ప్రసిద్ధికెక్కిన బందరు కుర్రాడు మద్దూరి వేణుగోపాల్ సైతం వేల్ పిక్చర్స్‌లో సంగీత విభాగంలో హార్మోనిస్టుగా పనిచేసినవారే! ఎంతో కాలం చిత్రపరిశ్రమలో లేకపోయినా, లెక్కకు మించిన చిత్రాలు తీయకపోయినా సరే, తెలుగు చలనచిత్ర రంగ ప్రారంభ దినాల్లో పి.వి. దాసు ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన అవిస్మరణీయుడైంది అందుకే!

Subscribe to:
Comments (Atom)