కాళోజీ..
ధిక్కార స్వరానికి నిలువుటద్దం..
మానవత్వపు మనుగడకు
నిలువెత్తు నిదర్శనం..
ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పరితపించిన మహనీయుడు...
ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి..
ఆయన ఖలేజాకు జీ హుజూర్.
ఈ రోజు కాళోజీ వర్థంతి సందర్భంగా ఈ సిల్‌సిలా.
హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతంలో కాళోజీ నారాయణ రావు ఇంటికి వెళ్లాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇంట్లోకి అడుగుపెడుతోంటే ‘ఏంరా.. ఏం చేస్తున్నారు?’ అని ప్రశ్నిస్తున్నట్లు కాళోజీ చిత్రపటాలు ఉన్నాయి ఆ గదిలో. ఓ అల్మారాలో పద్మవిభూషణ్ అవార్డు అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకవూటామన్ కాళోజీకి అందిస్తోన్న ఫొటో. వాటి ముందు ఒక సోఫాలో మౌనమునిలా కాళోజీ నారాయణరావు కుమారుడు కాళోజీ రవికుమార్ కూర్చున్నారు. ‘అమ్మగారు లేరా’ అని అడిగితే.. ‘కూర్చొండి’ అంటూ సైగ చేశారు. నాన్నగారి గురించి, ఆయన జ్ఞాపకాల గురించి చెబుతారా? అన్న ప్రశ్నకు జవాబుగా ఆయన మిగిల్చిన వారసత్వాన్ని, త్యాగాన్ని, తెలంగాణ పట్ల, దేశరాజకీయాలపట్ల, తన తండ్రితో తనకున్న సాన్నిహిత్యాన్నీ ఇలా వివరించారు.
ఆయనతో స్నేహబంధమే..
మా నాన్నగారితో నాకు స్నేహబంధమే ఉండేది. అయినా ఆయనతో మాట్లాడాలంటే భయం. ఆయన బయట అనేక రకాల అభివూపాయాలతో ఉండేవారు. ఇంట్లో మాత్రం గంభీరంగా ఉండేవారు. ఆయన చేసిన త్యాగం, తెలంగాణ కోసం తపించిన సందర్భాలు గుర్తుకువచ్చినప్పుడల్లా దుఃఖం వస్తుంది. నేను చదువుపట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. పదో తరగతి వరకే చదువుకున్నాను. నాకు చదువు మీద కంటే ఇతరత్రా అంశాలపట్ల మక్కువ ఉండేది. మా నాన్నగారి దగ్గరికి చాలామది వస్తుండవారు. రకరకాల స్వభావాలు, అభివూపాయాలు కలిగి ఉండేవారు. నా కంటే ముందు అన్నయ్య, అక్కయ్య, తమ్ముడు పుట్టిపోయారు. ఇప్పుడు నేనొక్కడినే. నాకూ మా బాబు (పేరు సంతోష్. ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్) ఒక్కడే. నన్ను చాలా మంది కాళోజీగారి అబ్బాయి అని, కొంతమంది రవికుమార్ అని, మిత్రులు చిన్నకాళోజీ అని సంబోధిస్తుంటారు. నాకు 55 ఏళ్లు యిప్పుడు. ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఆయన ఏం సంపాదించారో. ఆయన దేశం కోసం, తెలంగాణ కోసం చేసిన త్యాగం ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. నేను నాన్నగారితో మాట్లాడేందుకు భయపడేవాడ్ని. ‘నీకేం కావాలో పెద్దనాన్నగారిని అడిగి తీసుకో.. నా అవసరం ఏమిటీ? నాకు లోకంతో పని. లోకంతో నాకూ పని ఉంది. వారు అనేక కష్టాల్లో ఉన్నారు. వారిని నేను చూసుకుంటాను. నీకు కావలసినవన్నీ పెద్దనాన్న చూసుకుంటారు’ అని అనేవారు ఆయన. నాకేం కావాలన్నా మా పెద్దనాన్న కాళోజీ రామేశ్వరరావునే అడిగేవాడ్ని. నాకు కావలసివన్నీ చిన్నతనం నుంచి ఆయనే సమకూర్చేవారు.
నాన్నగారి కోసం అనేక మంది దేశం నలుమూలల నుంచి వచ్చేవాళ్లు. సాహిత్యరంగంలో శ్రీశ్రీ మొదలు, దాశరథి సోదరులు, సినారె, బిరుదురాజు రామరాజు, పల్లా దుర్గయ్య ఇలా ఎంతో మంది వచ్చేవారు. ఎవరు వరంగల్‌కు వచ్చినా ఆయనతో మాట్లాడందే తిరిగి వెళ్లేవాళ్లు కాదు. వాళ్లు మాట్లాడుతుంటే నేను వినేవాణ్ణి. వారిలా ఆలోచించే వాణ్ణి. కానీ నేను వారిలా తయారుకాలేదన్న బాధ నాకిప్పటికీ ఉంటుంది. నేను చదివిన చదువుకు తగ్గట్టుగా అప్పుడు నాకు ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగం వచ్చింది. నన్నందరూ కాళోజీ గారి అబ్బాయి అని చూసేది. ఆయన పేరును ఎట్టిపరిస్థితుల్లోనూ బదునాం చేయవద్దని ప్రతీక్షణం అనుకునేవాణ్ణి. ఇప్పటి వరకు ఆ పనిచేయలేదనే నమ్ముతాన్నేను. నేను ఇప్పుడు వీఆర్‌ఎస్ తీసుకొని ఇంటివద్దే ఉంటున్నాను. సాహిత్యంలో పెద్దగా ప్రవేశం లేకపోయినా నాన్న వారసత్వంగా వచ్చిన అక్షరాల కోసం నగరంలో జరిగే సాహితీసభలకు వెళుతుంటాను. మిత్రమండలి సమావేశానికి క్రమం తప్పకుండా హాజరవుతుంటాను.
దేశమంత ఇల్లు కట్టుకున్నారు: రుక్మిణిబాయి
ఆయన దేశాలు తిరిగేది. ఇంటిపట్టున ఉండేవాడు కాదు. ముక్కుసూటి మనిషి. బయట ఏదన్నా ఘోరం జరిగిందని తెలిస్తే వలవలా కన్నీళ్లు కార్చేవారు. నాకు 12 ఏళ్ల వయస్సున్నపుడే ఆయనతో పెళ్లి అయింది. ఇప్పుడు 87 సంవత్సరాలు. ఆయన ఇంటిని పట్టించుకోలేదు. కానీ ఈ దేశమంతా ఇల్లుకట్టుకునే ఉన్నారు. అందరూ ఆయనను ఆరాధనగా కొలుస్తుంటే నాకు ఇంకేం కావాలనిపిస్తది. ఆయనతో మాట్లాడాలంటే ఇంట్లో వాళ్లు భయపడేది. మాకు పెళ్లయిన కొత్తలో వరంగల్‌లో ఉండేవాళ్లం. ఆయన దేశాలు పట్టుకొని తిరిగేవారు కదా. మొదట పెళ్లే వద్దన్నాడట. కానీ ఆయన గురువు డి.రాజా(రాజేశ్వరరావు) నాకు మేనమామ. ఆయన కుదిర్చిన పెళ్లే. పెళ్లిచూపుల తరువాత నాలుగోనాడు నన్ను ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నాడు. మా అత్తామామలు రమాబాయి, రంగారావులు. మా బావగారు రామేశ్వరరావుగారే ఇంటిని చూసుకున్నారు. కొంతకాలం మేం వరంగల్‌లో ఉన్నాం. అప్పుడొకసారి ఆయన దేశాలుపట్టుకొని తిరుగుతున్నప్పుడు మేం ఉంటున్న కిరాయి ఇంటిని ఖాళీ చేయమన్నారు. ఏదో మాటవరుసకు అంటున్నారు కదా అని అనుకున్నాను. కానీ వాళ్లు మా సామాను అంతా ఓ బండిలో వేసి మా బావగారి ఇంటికి పంపారు. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడే ఉంటున్నాం. (కాళోజీ నారాయణగారికి ఇప్పటికీ ఆయన పేరుమీద ఓ సొంత ఇల్లూ కూడా లేదు. ఆయన ఎమ్మెల్సీగా, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు). ఆయన జ్ఞాపకాలంటే ఎన్నని చెప్పను. రోజూ ఈ గదిలో కూర్చొని ఆయనతో నేను ఢిల్లీకిపోయిన సంగతిని, విశాఖపట్నం పోయిన సంగతి గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాను. అసలు ఆయనను మరచిపోతేనా.
ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎప్పుడూ తెలంగాణ కోసం ఆరాటపడేది. ఇది అందరికీ తెలుసు. ఆయనకు పీవీసాబ్ ఢిల్లీలో (పద్మవిభూషణ్ అవార్డు సందర్భంగా) అవార్డు ఇచ్చినపుడు ఆయనతో వెళ్లాను. అందరూ ఆయన్ని తెలంగాణ కాళోజీ అన్నారప్పుడే. అసలు తెలంగాణోళ్లకు అవార్డు కూడా ఇస్తారా? అని కొందరు ఆయనతోనే అన్నారట. దానికి ఆయన వారితో పెద్దయుద్ధమే చేశారుపూండి. ఆయన బతికినన్నాళ్లు తెలంగాణ కోసమే బతికారు. ఆయనలో సగభాగమైన నేను తెలంగాణ అనకుండా... లేకుండా ఎందుకుంటాను చెప్పండీ?
ప్రశ్నల కొడవలి..
తెలుగునాట ఆ మాటకు వస్తే యావత్ దేశంలోనే పరిచయం అవసరం లేని ధిక్కార కాగడ కాళోజీ. ఆయన అసలుపేరు రఘువీర్ నారాయణ లక్ష్మికాంత శ్రీనివాసరావు రామరాజా కాళోజీ. ఆయన 9 సెప్టెంబర్, 1914న జన్మించారు. తండ్రి రంగారావు, తల్లి రమాబాయి. అన్నయ్య ప్రముఖ ఉర్దూకవి, న్యాయవాది కాళోజీ రామేశ్వరరావు. వరంగల్ జిల్లా హన్మకొండ మండలం మడికొండ నివాసం. ఆయన ప్లీడరీ చేసినా సాహితీవేత్తగా, ఉద్యమవేత్తగా, కార్యకర్తగా, గ్రంథాలయోద్యమనాయకుడిగా, విద్యార్థి సంఘాల నాయకుడిగా, కవిగా, పౌరహక్కుల గొంతుకగా అసమ్మతీ నిరసన, ధిక్కారాల స్వరంగా అందరికీ కేరాఫ్ అడ్రస్. ఇంట్లో ఉన్నా, కోర్టులో ఉన్నా, సభలో ఉన్నా, వక్తగా ఉన్నా చివరికి జైలులో ఉన్నా ఆయన వ్యక్తిత్వం నిఖార్సయిన ప్రశ్నల కొడవలి. ఆయన చాలా మందికి ఎమ్మెల్సీ అని ఈ తరం ప్రజావూపతినిధులకు తెలియకపోవచ్చు. అలుపెరుగని ప్రజాఉద్యమ కార్యకర్తగా ఉన్న ఆయన తెలంగాణ కోసం నిత్యం తపించేవారు. 1933లో వైతాళిక సమితి స్థాపించారు. వందేమాతర ఉద్యమానికి విరాళాలు సేకరించారు. గొప్ప దేశభక్తుడు. తెలంగాణ ఆరాధ్యుడు. ఆయన అసలు సిసలు ప్రజాసామ్యవాది. ఇవన్నే కాదు ఆయన క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు. ఆయనకు 1992లో పద్మవిభూషణ్ వచ్చింది. కాళోజీ కథానికలు, ఖలీల్ జీబ్రాన్ అనువాద రచ లతోపాటు అనేక మరాఠీ, బెంగాలీ, రచనలకు తెలుగు అనువాదాలు చేశారు. 1946లో పార్ధీవవ్యయంగా రూపుదిద్దుకున్న నా గొడవ ఆరు సంపుటాల సమగ్ర సాహిత్యం ఆనాటి ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన 13, నవంబర్ 2002లో అస్తమించారు. ఆయన వర్థంతి సందర్భంగా కాళోజీ ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు (ఆదిలాబాద్, యాది సదాశివ)కు స్మారక అవార్డు ఇస్తున్నారు.
Monday, November 28, 2011
కథనం
సిల్వర్‌స్క్రీన్ మీద 24 ఫ్రేమ్స్ ఏం చెప్పాయి..కంటే ఎలా చెప్పాయి అన్నదే పాయింట్ అదే కథనం... సినిమా భాషలో నరేషన్ హిట్టూ, ఫట్టును నిర్థారించే ప్రెజెంటేషన్ దాని మీదే నేటి రంగులకల డిస్కషన్ సృజనాత్మక ప్రక్రియలన్నిట్లో వ్యక్తీకరణ ముఖ్యం. దీనికి మూలమైన అంశంగా నరేషన్ నిలుస్తుంది. కథను ఆవిష్కరిస్తూ సాగే సినిమాలకైతే ఈ నరేషన్ లైఫ్‌లైన్ లాంటిది. ప్రేక్షకుడు దృశ్యసమాహారమైన సినిమా పట్ల అనురక్తి పొందడానికి వస్తు విలక్షణతోపాటు కథనంలో కూడా వైవిధ్యాన్ని ఆశిస్తాడు. అలాంటి నరేషన్ సినిమాల్లో కథాపరమైన వివరాలు ఇవ్వడానికంటే కూడా కథకు దృశ్యరూపం కల్పిస్తూ మౌలికమైన కథాంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే ప్రాధాన్యం ఇస్తుంది.
ఆడంబరాలు...అవాస్తవికత
సినిమా తొలినాళ్లలో నరేషన్ సాదాసీదాగా కథను ముందుకు నడిపిస్తూ సాగిపోయేది. ప్రపంచంలో మొట్టమొదటి ఫిక్షన్ ఫిలింగా వినుతికెక్కిన ‘ ఎ ట్రిప్ టు మూన్’లో, ఆ తర్వాత క్రైం అంశంతో నిర్మించిన ఫస్ట్ మూవీ ‘గ్రేట్ ట్రైన్ రాబరీ’లో మూలకథకు కొంచెం కళాత్మకత తోడై నరేషన్ నేరుగా సాగుతుంది. అట్లాగే మనదేశంలో కూడా తొలి రోజుల్లో నిర్మించిన పౌరాణిక చిత్రాల్లో మూల రచనల్లో సాగిన రీతిలోనే నరేషన్ కనిపిస్తుంది. కాలం గడుస్తున్న కొద్దీ రచయితలు, దర్శకులు కొత్త ఆలోచనల్ని సంతరించుకుని సినిమా నరేషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఫ్లాష్‌బ్యాక్, ఫిల్మ్ ఇన్ ఫిల్మ్ లాంటి వైవిధ్యభరితమైన నరేషన్ టెక్నిక్స్‌ని అమలులోకి తెచ్చారు. మరోపక్క సినిమా రంగంలో పెరుగుతూ వచ్చిన స్టార్ వాల్యూ, అధికపెట్టుబడులు తదితర కారణాల రీత్యా నరేషన్‌లో నవ్యత కంటే ఆడంబరం, అవాస్తవికత, టెక్నికల్ అంశాలపైన చలనచివూతకారుల దృష్టి మళ్లింది. ఫలితంగా తెలుగు సినిమాల్లో వైవిధ్యభరితమైన నరేషన్‌కి ఆశించినంత స్థానం లభించలేదనే చెప్పుకోవచ్చు.
డిజైసిస్
కాని ప్రపంచ సినిమాను ముఖ్యంగా యూరోప్ సినిమాను పరిశీలిస్తే సినిమా నరేషన్‌లో కథను నిర్మించడానికి అనేక సూత్రాలు, ఆనవాయితీలు పాటిస్తారు. ప్రాథమికంగా వాస్తవ ప్రపంచాన్ని తెరపై చిత్రించడానికి ప్రయత్నిస్తారు. ఫలితంగా ప్రేక్షకుడు సినిమాల్లో తనని తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. లేదా తెరపై సాగే కథనంలో తానూ భాగస్వామిగా ఫీలవవుతాడు. అలా దృశ్యంలో ప్రేక్షకుడు లీనమయ్యేందుకు కథనాత్మకత, చిత్రీకరణల్లో డిజైసిస్ ప్రధాన భూమికను పోషిస్తుంది. డిజైసిస్ కథనంలోని ఇతివృత్తం, కథలోని విషయ ప్రపంచం రెండూ కలగలసిన స్థితిని సూచిస్తుంది. అంటే తెరపై కనిపించే కథావాస్తవమూ కథా సమస్తమూ డిజైసిస్‌లో ఒక భాగమన్నమాట. ఇంకా చెప్పాలంటే పాత్రలు, వాటి సంభాషణలు, వేషభాషలు, అలవాటు,్ల నటన అన్నీ డిజైసిస్‌లో అంతర్భాగమే. సినిమాల్లో వినిపించే ధ్వని, కనిపించే సెట్లు, నృత్యాల్లో హీరోహీరోయిన్లు, చుట్టూ డ్యాన్స్ చేసే ఎక్స్‌ట్రా నటీనటులు అంతా డైజిసిస్‌లో భాగమై సినిమా నరేషన్ పై ప్రభావం చూపిస్తాయి.
అయితే సినిమాల్లో ‘నరేషన్’ వాస్తవికతను ఆధారం చేసుకుని సాగినపుడు వాటిల్లోని పాత్రలన్నీ ఏదో ఒక ప్రేరణతో ముందుకు సాగుతాయి. అనేకసార్లు పాత్రల స్వభావం, వాటి చలనం వల్లే సినిమాల్లో కథ ఆవిష్కృతం అవుతుంది. ముఖ్యంగా ప్రధాన స్రవంతి సినిమాల్లో ఈ ప్రేరణ పురుష పాత్రల ఆధారంగానే ముందుకు నడుస్తుంది. దాదాపు అన్ని భాషల్లోని వ్యాపార సినిమాల్లో కథాకథనాలు పురుషదృక్కోణం నుంచే సాగుతాయి. ఎక్కడైనా స్త్రీ ప్రధాన పాత్రగా కనిపించినప్పటికీ ఆ సినిమాను చివరికి పురుష అవగాహనతోనే ముగింపు పలుకుతారు.
పారలల్ నరేషన్
ఇలా వ్యాపార చిత్రాలు, కళాత్మక చిత్రాల్లో నరేషన్ రీతులు భిన్నంగా ఉంటున్నాయి. అయినా కొందరు కథకులు, నవలాకారులు, స్క్రీన్‌ప్లే రచయితలు ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ సినిమా కథనంలో విలక్షణ, వైవిధ్యాన్ని సాధించేందుకు కృషి చేస్త్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల ఫలితంగా ఆవిర్భవించిందే ‘పారలల్ నరేషన్’ లేదా మల్టిపుల్ నరేషన్. ఈ టెక్నిక్ మనకు నవలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నవలల్ని ఆధారం చేసుకుని నిర్మించిన సినిమాల్లో సైతం ఈ కథనశైలి కనిపిస్తుంది. మెమంటో, రన్ లోలారన్, షైన్, పల్ఫ్‌ఫిక్షన్, ది స్వీట్ హియర్ ఆఫ్టర్ లాంటి సినిమాలు వైవిధ్యమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.
విజయాలు...వైఫల్యాలు
నిజానికి ఈ నరేషన్‌కి సంబంధించి ప్రపంచ సినీ చరివూతలో చేసిన ప్రయోగాల్లో కొన్ని విజయవంతమయ్యాయి. మరికొన్ని అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ‘ షైన్’ చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్ చిత్రీకరణ గొప్ప విజయాన్ని సాధిస్తే ‘సాటర్ డే నైట్’లో వైఫల్యం చెందింది. ‘సిటిజన్ కేన్’లో ఫ్లాష్‌బ్యాక్‌లు అద్భుతమైన కథనరీతికి ఉదాహరణగా నిలిచాయి. ఆ తర్వాత అంత ప్రభావంతమైన ఫ్లాష్‌బ్యాక్‌ను నిర్వహించిన వారేలేరు. అట్లాగే ‘ది స్వీట్ హియర్ ఆఫ్టర్’ సినిమాల్లోని 11 కథల్లో 9కథలు వేర్వేరు కాలాలకి చెందినవి. అలాంటి కథన ప్రయత్నం మరొకరు చేయలేదు.
అయితే సినిమా నిర్మాణానికి సంబంధించినంత వరకు కథనరీతి శిలాశాసనం కాదు. అది నిరంతరం మార్పునకు లోనయ్యే ప్రక్రియే. అట్లాగే అన్ని రకాల కథలకి ఒకే రకమైన కథనం ఉండదు. భిన్నమైన కథలకు వైవిధ్యమైన కథనశైలి కనిపిస్తుంది. అదే పారలల్ నరేషన్ (సమాంతర కథనం). ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కథనశైలిగా చెప్పుకోవచ్చు. ఈ తరహా కథనంలో అర్థవంతమైన కథా వేగం, భిన్న కథనాల మధ్య సంబంధం, చివరగా ముగింపులు ప్రధానమైనవి. అనేక కథల్ని సమాంతరంగా నడిపిస్తూ వాటి మధ్య సమన్వయాన్ని సాధించడమే ఈ నరేషన్ ప్రధాన లక్షణం. పారలల్ నరేషన్‌లో కూడా రకాలున్నాయి
ఊహలకు సమాంతరంగా...
మొట్టమొదటిది ప్లాష్‌బ్యాక్ ట్రీట్‌మెంట్. ప్రేక్షకుల ఊహలకు రెక్కలు తొడిగి వాటికి సమాంతరంగానూ, భిన్నంగానూ కథనాన్ని కొనసాగించడం ఇందులో కనిపిస్తుంది. సస్పెన్స్, క్రైం, డిటెక్టీవ్ చిత్రాల్లో ఈ టెక్నిక్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు మానసిక సంఘర్షణని సామాజిక సంఘర్షణని చూపించడానికి కూడా ఫ్లాష్‌బ్యాక్ ఉపయుక్తమవుతుంది.
మల్టిపుల్...
రెండవది ‘మల్టిపుల్ ప్రొటగనిస్టు’ శైలి. ఇందులో ముఖ్యాభినేత ఒక్కడే కాకుండా బహుపావూతలు ప్రధానమై ఒక్కొక్కటి ఒక్కో కథని ఆవిష్కరిస్తాయి. అన్నింటి మధ్యా అంతర్‌లయగా మౌళికాంశం కొనసాగుతూనే ఉంటుంది. ఈ తరహా కథనాలు ఆర్మీ, లక్ష్యం కోసం పనిచేసే దళాల కథల్లో కనిపిస్తాయి.
సీక్వెన్షియల్.. టాండెమ్
మూడవది సీక్వెన్షియల్ నరేషన్. ఇందులో భిన్నమైన కథల్ని వరుసక్షికమంలో చెప్పుకుంటూ పోతారు. ముగింపులో ఏదో ఒక అంశం ప్రాతిపదికన వాటిని కలిపేస్తారు. నాలుగవది ‘టాండెమ్ నరేషన్’. ఇందులో సమాన స్థాయిగల కథల్ని అంతే సమానంగా ఆవిష్కరిస్తారు. ఇలాంటి కథనాలు పౌరాణిక చిత్రాలకు ఉపయోగపడతాయి. ఈ పారలల్ నరేటివ్స్‌కి మరో రకమైన విభజన కూడా ఉంది. వాటిని ‘క్యారెక్టర్ బేస్’్డ పారలల్ నరేటివ్, ‘లొకేషన్ బేస్డ్’ పారలల్ నరేటివ్‌గా చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ బేస్డ్ పారలల్ నరేషన్‌లో ప్రేక్షకుడు సినిమా కథని సమక్షిగంగా అర్థం చేసుకోవడానికి విభిన్న పాత్రల దృష్టికోణాలు దోహదం చేస్తాయి. లొకేషన్ బేస్డ్ పారలల్ నరేటివ్‌లో ఒక ప్రత్యేకమైన లొకేషన్‌లో జరిగే పలుసంఘటనల్ని ప్రేక్షకుడు వీక్షించే స్థితి ఉంటుంది. ఇలా పలురకాలుగా ఉన్న సమాంతర కథనాల ద్వారా భిన్న అంశాలు చర్చిండానికి, వైవిధ్యమైన నేపథ్యాల్ని సృజించడానికి ప్రయత్నాలు జరగుతున్నాయి. ఇవ్వాళ్టి వేగంలో ప్రేక్షకలోకానికి అనువైన కథనశైలి ఈ పారలల్ నరేషన్. అయితే దీన్ని నిర్వహించడంలో దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. ఎలాంటి సందిగ్ధతలకు తావులేకుండా భిన్న కథనాల్ని మౌళిక కథాంశాన్ని ఇరుసుగా చేసుకుని నిర్వహించినపుడే అది విజయవంతమవుతుంది. ప్రతికళ మారుతున్న కాలానికి అనుగుణంగా స్పందించాల్సిందే. ఆ మార్పుల్ని తనలో ఇముడ్చుకోవలిసిందే. ఏ కళ అయినా, సినిమా అయినా సరిహద్దుల్ని చెరిపేసేదిగా ఉండాలి. అప్పటిదాకా స్థిరపడ్డ అన్ని లక్షణాల్ని ఛేదించుకుని నవ్యరీతులకు దారులు తీయాలి.

తెలుగు సినిమాల్లో తెలుగెంత?
నేతి బీరకాయలో నేయి ఉంటుందా?
పులిహోరలో పులి ఉంటుందా?
మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా?
ఈ ప్రశ్నలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలో తెలుగు భాష- సంస్కృతి పరిస్థితి అలాగే ఉంది. తెలుగులో తొలి టాకీ సినిమా విడుదలై నిన్నటికి ఎనభై సంవత్సరాలు. ప్రస్తుతం 81 వ ఏట అడుగు పెట్టిన తెలుగు సినిమాలో తెలుగుదనం ఎంత?గత కొంతకాలం నుంచి మనకు తరచూ వినిపిస్తున్న మాట... అందరినీ ఆందోళనకు గురి చేస్తున్న మాట...‘తెలుగు భాష కనుమరుగై పోతోంది. తెలుగు భాషలో తెలుగు భ్రష్టుపట్టిపోతోంది. తెలుగుకు తెగులు తగులుకుంది’ అని. అయితే ఈ పరిణామం ఒక్క భాషకు మాత్రమే కాదు. సర్వకళల సమాహారమైన తెలుగు సినిమాకూ తప్పడం లేదు. జీవసంస్కృతులను కొనసాగించేవి కళలే అనుకుంటే, అలాంటి కళలన్నింటికీ రారాజు అయిన సినిమాలో మాత్రం తెలుగుదనం ఏమేరకుంది అని ఆలోచించాల్సిన తరుణం ఏర్పడిందిప్పుడు. కథల్లో, కాస్ట్యూమ్స్‌లో, లొకేషన్స్‌లో, మాటల్లో, పాటల్లో, యాక్షన్‌లో... ఆఖరికి హీరోయిన్‌లలో, సినిమా టైటిల్స్‌లో అసలు తెలుగెంత అని ఆలోచిస్తే నిరాశే ఎదురవుతుంది.
నేటికి 176 ఏళ్ల క్రితం...తెలుగు సినిమా పుట్టడానికి 104 ఏళ్ల కిందట
1835వ సంవత్సరం...బ్రిటీష్ పార్లమెంట్‌లో భారతదేశంలో విద్యావిధానంపై చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఛైర్మన్ అయిన లార్డ్‌మెకాలే సభకు వివరణ ఇస్తున్నాడు... సభలో ప్రతిపక్ష సభ్యుడొకరులేచి అసలు భారతదేశంలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం వల్ల మనకొచ్చే ప్రయోజనమేంటి? అనడిగాడు. అప్పుడు మెకాలే చిన్నగా గొంతు సవరించుకుని ఇలా చెప్పాడు ‘by this system of english education, they may be indians by blood and color, But will become britishers in tastes, opinions, manners and intellect’ (ఆంగ్ల విద్యా విధానం వల్ల రంగు-రక్తం- పరంగా భారతీయులైన వీరంతా అభిరుచులు- అభివూపాయాలు- పద్ధతులు, మేధాశక్తి పరంగా క్రమక్షికమంగా బ్రిటీష్‌వారిగా మారుతారు)
మెకాలే కల నిజమైంది.
ఇలాంటి సాంస్కృతిక విధ్వంసమే ఇప్పుడు తెలుగు సినిమాకూ జరుగుతోంది. తెలుగుదనం, తెలుగు అని గొప్పగా చెప్పుకొంటున్న జనాలు చూసే తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘నేతి’గా మారింది.
కథల సంగతి
సినిమాకు కథే ప్రాణం! చాలా ప్రెస్‌మీట్లలో అందరూ చెప్పే అరిగిపోయిన మాట ‘స్క్రిప్టే మా హీరో’ అని. అంటే తెలుగు సినిమా భవనానికి పునాది కథ అన్నమాట. కానీ 1931 నుంచి ఇప్పటి వరకూ తెలుగులో వచ్చిన సినిమాలన్నిటినీ గమనిస్తే , ఇందులో తెలుగుదనాన్ని ప్రతిబింబించిన కథపూన్ని? అసలు తెలుగు కథపూన్ని? అని పరిశోధన చేస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేము. ఈ ఎనభై ఏళ్లకాలంలో తెలుగులో దాదాపు 5900 సినిమాలు వచ్చాయి. వాటిలో 65 శాతం పైగా సినిమాలకు మూల కథలు బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం సినిమాలే. అంటే కేవలం 35 శాతం సినిమాలు మాత్రమే మనదైన సొంత కథలలతో రూపొందాయన్నమాట. మిగతావన్నీ అరువు కథలో లేక రీమేక్‌లో అన్నమాట. ఆ లెక్కన అసలు సినిమాకు ఆది పునాది అయిన కథే మనది కానప్పుడు సినిమాలు మాత్రం మన అవుతాయి?
1950,60వ దశకాలలో తెలుగు సినిమాలకు ముడి సరుకు అంతా బెంగాళీ కథలే. ఆ తర్వాత 1970,80 దశకాల్లో సూపర్‌హిట్ అయిన హిందీ సినిమాలను రీమేక్ చేయడం ఓ వెల్లువలా సాగింది. 1980,90 దశకాల కాలం నుండి తమిళ సినిమా రీమేక్‌లు విజృంభించాయి. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. తెలుగు సినిమా అన్ని తరాలలోని సూపర్ హీరోలందరూ పరభాషా కథలతో, సినిమాలు తీసినవారే. దేవదాసు, బాటసారి వంటి సినిమాలు బెంగాలీ సినిమాలకు రీమేక్‌లే.
అన్నదమ్ముల అనుబంధం(యాదోంకీ బారాత్), నిప్పులాంటి మనిషి(జంజీర్), అమరదీపం(ముకద్ధర్ కా సికిందర్), తూర్పు పడమర(అపూర్వ రాగంగాళ్), పదహారేళ్ల వయసు(పదునారు వయదినిలే) వంటి సినిమాలన్నీ రీమేక్‌లే. చిరంజీవి చేసిన త్రినేవూతుడు(జల్వా), ఘరానామొగుడు(మన్నన్), స్నేహం కోసం( నాట్లామై), హిట్లర్(), ఠాగూర్(రమణ).... వంటి సినిమాలన్నీ పరభాషా కథలతో నిర్మాణమైనవే. మోహన్‌బాబు నటించిన అల్లుడుగారు, తప్పుచేసి పప్పుకూడు, పెదరాయుడు వంటి సినిమాలకు మలయాళ కథలే ఆధారం. ఇక వెంక అయితే పరాభాషా కథలతో తెలుగు సినిమా నిర్మాణానికి కేరాఫ్‌గా మారారు. చంటి(చిన్నతంబి), రాజా, శీను, కొండపల్లి రాజా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నాగవల్లి, లేటెస్ట్‌గా రాబోతున్న ‘గంగ ది బాడీగార్డ్’ కూడా రీమేక్‌లే. నేటితరం హీరోల్లో ‘నా ఆటోక్షిగాఫ్(ఆటోక్షిగాఫ్), దొంగోడు(మీసమాధవన్), వీడే(ధూల్), అన్నవరం(తిరుప్పాచ్చి), ఖుషీ, తీన్‌మార్(లవ్ ఆజ్‌కల్), బిల్లా, నాని(న్యూ), లక్ష్మీ నరసింహా(సామి), ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న గబ్బర్ సింగ్(దబంగ్) సినిమాలూ అలాంటివే.ఇక తెలుగు సినిమాలలో హాలీవుడ్ కథల కాపీయింగ్, ఫ్రీమేకింగ్ అనేది గత ఎనభై ఏళ్లుగా సాధారణ సత్యమైపోయింది. ‘ఇన్‌స్పిరేషన్’అనే అందమైన పేరుతో హాలీవుడ్ కథలను అరువు తెచ్చుకోవడం ఓ తప్పనిసరి అంశమైపోయింది.అయితే భాషా వ్యాప్తిలోనూ, సంస్కృతి విస్తరణలోనూ కళారూపాల సార్వజనీనతలోనూ ఇలాంటి ‘ఆదాన ప్రదానాలు’ సర్వసాధారణమే. ఇలాంటి ఇచ్చిపుచ్చుకునే ధోరణుల వల్ల సినిమా కళ కూడా ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇచ్చిపుచ్చుకోవడంలో ‘పుచ్చుకోవడం’ ఎక్కువైపోవడమే ఒకింత బాధాకరం.
క్యాస్టూమ్స్ లొకేషన్స్
సినిమా కళలో పాత్ర స్వభావాన్ని ఇట్టే వ్యక్తీకరించే సాధనం క్యాస్టూమ్స్. ఆహార్యం అని మన ప్రాచీన అలంకారికులు పిలిచే కాస్ట్యూమ్స్- మేకప్ విషయంలో కూడా తెలుగేతర సంస్కృతే ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోల డ్రెస్‌కోడ్ ఎక్కువగా సూటు-బూటు ఉండేవి (మెకాలే ఊహకు సాక్ష్యాలివే). ఆఖరికి పాటలోని సంగీత వాయిద్యం తబలా ధ్వని అయినప్పటికీ దృశ్యంలో మాత్రం ‘పియానో’ మీద పాడుతున్నట్టుగా చూపించిన తీరే (పగలే వెన్నెలా) తెలుగు సినిమాల్లో తెలుగుదనం కనుమరుగవుతున్న క్రమంలో జరిగిన తొలి పరిణామాలని చెప్పాలి.ఇక 1970, 80 దశకాలలో‘మాస్ హీరో’ పేరుతో హీరోలకు వేసే కాస్ట్యూమ్స్‌లో ఎక్కడా తెలుగుదనం మచ్చుకైనా కనిపించదు. పైగా బెదిరిపోయే కలర్స్(యెల్లో షర్ట్, రెడ్ ప్యాంట్ వంటివి)తో డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్స్‌ని చూస్తే కుక్కలు వెంటపడటం ఖాయం అనిపించేది.
1990 దశకం నుంచి హీరోల కాస్ట్యూమ్స్ కొంతవరకు కంటెంపరరీ ధోరణిని, మన నేటివిటీని ప్రతిబింబించినప్పటికీ, హీరోయిన్‌ల కాస్ట్యూమ్స్ మాత్రం హాలీవుడ్ స్టయిల్‌లోకి వెళ్లిపోయాయి. ఇక ఇప్పుడు యంగ్‌హీరోలు, హీరోయిన్లు వేస్తున్న కాస్ట్యూమ్స్, హెయిర్ స్టయిల్స్, గెటప్స్ సంగతి తెలిసిన విషయమే.‘లొకేషన్’ అనేది సినిమా కథలోని మూడ్‌ను, స్థితిని చెప్పే ‘అదృశ్య క్యారెక్టర్’ అని అంటారు. ఇప్పటి సినిమాల్లో ‘విజువల్ రిచ్‌నెస్’, ‘డిఫంట్ లుక్’ పేరుతో ఇతర రాష్ట్రాలు, ఆఖరికి సినిమా మొత్తం (ఆంజ్) విదేశాల్లోనే చిత్రించడం పెరిగిపోయింది. ఇలా మనవి కాని లొకేషన్లు, ప్రదేశాలలో సినిమాని తీయడం కూడా నేటి సినిమాల్లో తెలుగుదనం ఎంత అనే ప్రశ్న ఉత్పన్నమవడానికి దారి తీస్తోంది.
టాలీవుడ్ ఏంటి?
అనుకరణ ‘కాపీ క్యాట్ కల్చర్’కు తెలుగు సినీ పరిక్షిశమను ఇప్పుడు పిలుస్తున్న ‘టాలీవుడ్’ అనే పేరే నిఖార్సయిన ఉదాహరణ. 1960ల వరకు ‘తెలుగు చలన చిత్ర సీమ’ అనే పేరు కాస్తా 1970 తర్వాత ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ’ అయింది. గత 15ఏళ్ల నుండి శాటిలైట్ టీవీ ఛానెల్స్, వెబ్‌సైట్స్ విజృంభించాక ‘టాలీవుడ్’ అంటూ ప్రచారంలోకి వచ్చింది. అమెరికన్ ఇంగ్లీష్ సినిమాకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. దానికి అనుకరణగానే ఈ పేరు వ్యవహారంలోకి వచ్చింది(పేరులో కూడా సొంత తనం లేదు!). అయితే టాలీవుడ్ అనే పేరు ఎంతవరకు సరైంది అనేది మరో ప్రశ్న. ఎందుకంటే టాలీవుడ్ అనే పేరును మనదేశంలో రెండు సినీ పరిక్షిశమలకు ఉపయోగిస్తున్నారు. అవి బెంగాలీ సినీ పరిక్షిశమ, మన తెలుగు చిత్ర పరిక్షిశమ. బెంగాలీ పరిక్షిశమను టాలీవుడ్ అనడంలో అర్థం ఉంది. ఎలాగంటే కోల్‌కతాలోని ‘టాలీగంజ్’ అనే ప్రాంతంలో బెంగాలీ సినీ పరిక్షిశమ ఉంది కనుక. ఆ ఏరియా పేరుతో టాలీవుడ్ అని పిలవడం ఔచిత్యంగా అనిపిస్తోంది. కాని మనకెంత వరకు ఇది రైట్? పైగా ఆ మధ్య హీరో రానా మన సినీ పరిక్షిశమను టాలీవుడ్ అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. చక్కగా మన భాషలో తెలుగు చలన చిత్ర పరిక్షిశమ అనొచ్చు కదా అనేది ఆయన వాదన.
దిగుమతి హీరోయిన్‌లు
సినిమాకు గ్లామర్‌ను, ఆడియెన్స్‌కు మనోల్లాసాన్నిచ్చే తెర సుందరి హీరోయిన్. కానీ తెలుగు తెరపై గత కొన్నేళ్ల నుంచీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్ పాత్రల్లో కనిపించడం లేదు. హీరోయిన్ అనగానే- సావిత్రి, జమున, కృష్ణకుమారి గుర్తొచ్చేవారు. ఆ తర్వాతి తరంలో వాణిశ్రీ, ఆ నెక్ట్స్ తరంలో జయవూపద, జయసుధ. తెలుగు హీరోయిన్లలో విజయశాంతి, భానువూపియలదే చివరి తరం. ఇప్పటి జనరేషన్ హీరోయిన్‌లందరూ దిగుమతి అవుతున్న వారే తప్ప తెలుగు వారు లేరు. లయ, స్వాతి, బిందుమాధవి వంటి అమ్మాయిలు హీరోయిన్‌లుగా చేసినప్పటికీ అంతగా హిట్ కాలేదు. అయితే ఈ దిగుమతి హీరోయిన్‌ల ట్రెండ్ ఇప్పుడే మొదలైంది కాదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలోనే వహీదా రెహమాన్(రోజులు మారాయి) వంటి వారితో వచ్చింది. ఆ తర్వాత శ్రీదేవితో ఊపందుకుని నగ్మా, సౌందర్యతో పతాకస్థాయికి చేరింది. ఆఖరికి తెలుగమ్మాయి’ అనే టైటిల్‌తో వస్తున్న సినిమాలో నటిస్తున్న సలోని కూడా తెలుగు అమ్మాయి కాదు. ఇక తెలుగు సినిమాల్లో తెలుగు అందం ఎక్కడ ఉంది?
సినిమా టైటిల్స్ కూడా...
తెలుగులో ప్రతి ఏటా దాదాపు 120 నుంచి 140 స్ట్రయిట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో దాదాపు 40 నుంచి 50 సినిమాలకు టైటిల్స్ ఇంగ్లీష్ పదాలు, పేర్లే ఉంటున్నాయి. టైటిల్స్ క్యాచీగా ఉండడం పబ్లిసిటీ పరంగా నిజమే కానీ, తెలుగుదనం పరంగా ఇది గొడ్డలిపెట్టే. ఈ విషయంలో తమిళ సినీ పరిక్షిశమను అభినందించకుండా ఉండలేం. అక్కడి సినిమాలకు తప్పనిసరిగా తమిళ పేర్లే పెట్టాలని ఇండస్ట్రీ అంతా నిర్ణయించుకున్నారు. ఆ మేరకే టైటిల్స్ అన్నీ తమిళంలోనే పెడ్తున్నారు. అక్కడి టైటిల్స్ ‘నేటివిటీ ఫీల్’తో ఎంతో కవితాత్మకంగా ఉంటున్నాయి. (కన్నత్తిల్ ముద్దమిట్టల్- చెక్కిలిపై చిరుముద్దు). అవే సినిమాలు తెలుగులో డబ్ అయ్యే సరికి ఇంగ్లీష్ టైటిల్స్‌లోకి మారుతున్నాయి.
ఉదా: యంతిరన్- తెలుగులో రోబో.
ఆ మాటకొస్తే తెలుగు సినిమాల్లో తెలుగుదనం కొరవడడానికి ఆదిలోనే బీజం పడిందని చెప్పాలి. తొలి తెలుగు సినిమా ‘భక్త ప్రహ్లాద’ టైటిల్‌ను తీసుకోండి. తెలుగు భాష ప్రకారం పేరు ఎలా ఉన్నా చివర మాత్రం ‘డు’ అనే ప్రత్యయం చేరడం సంప్రదాయం. ఆ లెక్కన భక్త ప్రహ్లాద సినిమా టైటిల్ భక్త ప్రహ్లాదుడు కావాలి. కానీ ఇక్కడ సంస్కృతంలోని ప్రహ్లాద కాస్తా హిందీలోని ప్రహ్లాదగా మారి తెలుగులో కూడా అదే పేరుగా ఫిక్స్ అయిపోయింది.
యాక్షన్-మాటలు- పాటలు
తెలుగు సినిమాల్లో తెలుగుదనం ‘మిస్’ అవడానికి యాక్షన్-ఫైట్ సీక్వెన్సులు కూడా ఓ కారణమే. ఫైట్స్‌ని తెరపై చూస్తున్నప్పుడు ఏ హాలీవుడ్ హీరో ముఖానికో మన తెలుగు హీరో ముఖాన్ని ‘మార్ఫింగ్’ చేసి పెట్టినట్టనిపిస్తాయి. అలాగే డైలాగులు, పాటల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పాటల్లో ఇంగ్లీష్ వాక్యాలు, ర్యాప్ పదాలు ఇప్పటి సంగీత స్వరాలలో కామన్ అయిపోయాయి. తెలుగు వారి సంగీత వాయిద్యాలైన తబల, మృదంగం, వీణ వంటి స్థానాన్ని ఇపుడు డ్రమ్స్, గిటార్‌లు ఆక్రమించుకున్నాయి. ఇక కొన్ని సినిమాల్లోనైతే వెరైటీ పేరుతో ఏకంగా హిందీ(యే మేరా జహా- ఖుషీ), ఇంగ్లీష్( లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ది మిర్రర్- తమ్ముడు) పాటలనే పెట్టారు.
మాండలిక సినిమానే ఆశ
మెయిన్‌వూస్టీమ్ కమర్షియల్ సినిమా ‘తెలుగుదనాన్ని’ అట్నుంచి నరుక్కొస్తుంటే దాన్ని కాపాడుతున్నది మాత్రం మాండలిక సినిమానే అని చెప్పాలి. నేటివిటీ ఉన్న కథలు, జన జీవనంలోని సంఘర్షణలే ఇతివృత్తంగా తెలుగు సాహిత్యంలో మాండలిక కథలు(రాయలసీమ- తెలంగాణ- ఉత్తరాంధ్ర) ఎలా అయితే సజీవ భాష- సంస్కృతులతో వస్తున్నాయో, సినిమాల్లో కూడా తెలంగాణ, ఉత్తరాంధ్ర మాండలిక సినిమాలు విస్తృతంగా రావలసిన అవసరం ఉంది. చిల్లర దేవుళ్లు, మా భూమి, రంగుల కల, మట్టి మనుషులు, దాసి వంటి సినిమాలు ఇటీవలి జై బోలో తెలంగాణ, గంగ పుత్రులు వంటి సినిమాలు తెలుగు మట్టి పరిమళాలతో తెలుగుదనంలో కనిపిస్తాయి. ప్రస్తుత ప్రపంచం అంతా గ్లోబలైజ్ అవుతున్నా మెయిన్ స్ట్రీమ్ కల్చర్‌కు భిన్నంగా ఉప సంస్కృతులైన మాండలిక సినిమాలే విస్తృతంగా రావలసి ఉంది. అప్పుడు వేలాది మెకాలేలూ, వందలాది హాలీవుడ్‌లూ ఏమీ చేయలేవు.

పాటల తోటలో మన పారిజాతం ...దాశరథి
దాశరథి పేరు చెబితేనే తెలంగాణ ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతుంది. కవిత్వంలోనే కాదు, సినిమా పాటల్లోనూ ఉన్నత సాహిత్య విలువలకు ఆయన ఎప్పుడూ పెద్దపీటే వేశారు. సామాన్యుల నుండి భాషావేత్తలు, సినీ పండితుల వరకు ఎందరివో ప్రశంసలు ఆయన కంఠహారాలైనాయి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలంగాణ తేజాన్ని తెలుగు సాహిత్యంలోకి రంగరించిన కవి బెబ్బులి మన దాశరథి.
ఆయనది మొత్తం తెలంగాణ సాహిత్యంలో బహుముఖమైన ప్రతిభ. ఆనాటి నిజాం నవాబు నిరంకుశత్వాన్ని జైలు గోడలమధ్యే గర్జించి సవాలు చేసిన కలం వీరుడాయన. తొలితెలుగు సినీకవి చందాల కేశవదాసు తర్వాత గేయ రచయితగా సినీ పరిక్షిశమలోకి అడుగిడిన వారు దాశరథి. మనసు కవి ఆత్రేయ దర్శకత్వంలో 1961లో వచ్చిన ‘వాగ్దానం’ చిత్రం ద్వారా దాశరథి కృష్ణమాచార్య తొలిసారిగా ‘సినీకవి’గా పరిచయమయ్యారు. ఇందులో ఆయన రాసిన ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా’ అన్న పాట ఈనాటికీ తెలుగు సినిమా పాటల చరివూతలోనే శిఖరస్థానంలో ఉంది. అదే సంవత్సరం దుక్కిపాటి మధుసూధనరావు ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం కోసమూ ఆయన పాటలు రాశారు.
కృష్ణమాచార్యులు 1927 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. సంస్కృత, ద్రావిడ భాషల్లో విద్యాభ్యాసం చేశారు. తల్లివద్ద తెలుగు నేర్చుకున్నారు. బడిలో ఉర్దూ భాషను ఔపోసన పట్టారు. కొన్నాళ్లు మదరాసులో, తర్వాత ఖమ్మం జిల్లాలో ఆయన చదువు సాగింది. హైదరాబాద్‌లో ఆంగ్లంలో పట్టభవూదులైనారు.
దాశరథి ఎంత అక్షర సైనికుడో అంత మానవతా హృదయం ఉన్న మనిషి. గార్లలోని కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభల్లో చేరి, అనేక పోరాటాలలో పాలుపంచుకున్నారు. అడవుల్లో తిరుగుతూ, కోయలతో కలిసి జీవించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. చివరికి ‘పోలీసు చర్య’ తర్వాతే విడుదలయ్యారు. ఈ పోరాట నేపథ్యమే ఆయనలో కవితా జ్వాలను పుట్టిస్తే, జీవితంలో ఎదురైన అనేక కష్టాలు సినీకవిగా అద్భుత గేయాలను పండించాయి.
గేయ రచనా స్రవంతిలో...
‘ఇద్దరు మిత్రులు’లో ఎస్8.రాజేశ్వర్‌రావు సంగీతంలో దాశరథి రాసిన రెండు పాటలూ గొప్పవే. మొదటిది ‘ఖుషిఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’, రెండోది ఖవ్వాలి పాట. దీనితోనే తెలుగు సినిమాల్లో ఖవ్వాలి పాటలకు శ్రీకారం చుట్టారాయన.
ఆ రోజు మొదటి పాట ఓకే కాగానే దుక్కిపాటి ‘‘మాకు ఖవ్వాలి పాట కావాలి’’ అన్నారు. ఆయన ముందుగానే ట్యూన్ చేసి సాహిత్యాన్ని రాయించుకునేవారు. ఎస్.రాజేశ్వర్‌రావు పద్ధతీ ఇదే. అలా ఆయన ట్యూన్ వినిపించాక మరీ ‘‘చాలా కష్టమండోయ్ రాయడం’’ అని కూడా అన్నారు. దాశరథి ‘‘అవును కష్టంగానే ఉందని’’ రెండు క్షణాలు ఆలోచించి ‘‘నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి’’ అని అన్నారు. అంతే, అందరు ఆశ్చర్యపోయారు. ట్యూన్‌కి ఆ పదాలు అల్లుకు పోయాయి. నిమిషాల్లో పాటంతా పూర్తయ్యింది. ‘‘అమ్మో! హైదరాబాద్ దెబ్బ గట్టిదే’’ అనుకున్నారట అంతా. ఇలా మొదలైన దాశరథి సినిమా పాటల ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత దాశరథి అన్నపూర్ణ వారి చిత్రాలకు, ఆదుర్తి వారి చిత్రాలకు ఎక్కువగా పాటలు రాశారు.
దాశరథి సినిమాల్లోకి వచ్చేనాటికే పరిక్షిశమల్లో సీనియర్ సమువూదాల, కొసరాజు, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి దిగ్గజాలు, సినీ కవులుగా ప్రసిద్ధులు. వీళ్ల నడుమ ఆయన తనను తాను సినీకవిగా రుజువు చేసుకోగలగడం సామాన్య విషయం కాదు. ‘మొదటి బంతే సిక్సర్ పోయినట్టు’ తొలి పాటలే పరిక్షిశమలో మారుమోగాయి. ఇదే ఆయనకు పెద్ద బ్రేక్.
ఆత్రేయ మనుసు పాటలు, విరహ గీతాలకు, కొసరాజు జానపదాలకు, శ్రీశ్రీ అభ్యుదయ గీతాలకు, కృష్ణశాస్త్రి, ఆరువూదలు భావగీతాలకు పెట్టింది పేరైనట్లుగా చలామణి అవుతుంటే దాశరథి తనదైన పంథాలో వీణపాటలకు, భక్తి పాటలకు, ఖవ్వాలి పాటలకు కేరాఫ్ అడ్రస్8 అయ్యారు. ఇంకా ప్రకృతిలోని వెన్నెల, చందమామ, పూలసంపదను తన పాటల్లో విరివిగా కవితాత్మకంగా వినియోగించుకున్నారు. బ్రాండ్‌కు భిన్నంగా కూడా పాటలు రాయగలిగింది దాశరథి ఒక్కరే.
ఇతి వృత్తంలో వైవిధ్యం ఉన్న పాటలు రాయడం కూడా దాశరథి వారి ప్రత్యేకత. ‘పునర్జన్మ’ (1963)లోని ‘దీపాలు వెలిగే, పరదాలు తొలిగే’, ‘కన్నెవయసు’ (1973)లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటలు ఆ రోజులోన్లే సంగీత ప్రపంచంలో మారుమోగాయి. అంతకు ముందరి ‘పాడెద నీ నామమే గోపాలా’ (అమాయకురాలు-1971) పాట తరతరాలుగా ఆడపిల్లలకు అభిమాన గీతమైంది. ‘మీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం’ (పునర్జన్మ), ‘కన్ను మూసింది లేదు, నిన్ను మరిచింది లేదు, నీ తోడు’ (మనుషులు, మమతలు) అనే రెండు పాటలైతే విరహ ప్రేమికులకు ఆ రోజుల్లో తారక మంత్రాల్లా పనిచేశాయి.
ప్రధానంగా ఆదుర్తికి ఆత్రేయలాగ దాశరథి తనకు ‘ఆస్థానకవి’గా పాటలు రాశారు. ‘ఓ బొంగరాల బుగ్గలున్న దాన’ (డాక్టర్ చక్రవరి), ‘గోదారి గట్టుంది, గట్టుమీద సెట్టుంది’ (మూగ మనసులు), ‘నీవు రావు నిదుర రాదు’ (పూలరంగడు), ‘దివినుంచి భువికి దిగివచ్చే’ (తేనె మనుసులు), ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ (మంచి మనసులు), ‘అందెను నేడే అందని జాబిల్లి’ (ఆత్మగౌరవం), ‘ఒకటే హృదయం కోసం’ (చదువుకున్న అమ్మాయిలు) వంటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఇంకెన్నో.
దాశరథి వ్యక్తిత్వ పరిమళాన్ని తెలియజెప్పే ఒక సంఘటన. అప్పట్లో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఆదుర్తి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై ‘సుడిగుండాలు’ సినిమా తీస్తున్నప్పుడు స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి గురించి దాశరథి ఒక పెద్ద పాటను రోజుల తరబడి కూర్చొని రాశారు. దానికి ఆదుర్తి రెట్టింపు పారితోషికాన్ని ఆఫర్ చేయగా ‘‘నేను దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. మీ నో ప్రాఫిట్ చిత్రానికి నేను పైసా తీసుకోను. ఉచితంగా పాట రాసిస్తా’’ అన్నారు. అలాగే, ‘రాం రహీం’ చిత్రంలో ‘యూనాని హకీం హూ’ అని ఉర్దులో పాట రాసి మహ్మద్ రఫి ప్రశంసలు అందుకున్నారాయన.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించిన దాశరథి సినిమాల్లోనూ వీణపాటల స్పెషలిస్ట్ అయ్యారు. ‘మదిలో వీణలు మ్రోగే’ (ఆత్మీయులు), ‘మ్రోగింది వీణ పదేపదే హృదయాలలోన’ (జమిందారుగారి అమ్మాయి) పాటలను పాడుకోని వారుండరు. ‘దొరబాబు’లో ‘ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే’, ‘ఆడపడుచు’లోని ‘అన్నా! నీ అనురాగం’ పాటలు అన్నాచెప్లూల్ల ప్రేమ బంధానికి ప్రతీకలైనాయి. ఆయన రాసిన మొత్తం పాటలు సుమారు 500.
దాశరథి ‘ఆకాశవాణి’లో కార్యక్షికమాల నిర్వహకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడే సినిమాలకు రాయడం మొదలైనా మదరాసు బదిలీపై వెళ్లి పూర్తి కాలం పాటలు రాయడానికి ఆ రేడియో ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ, ఆయన అంచనాల మేరకు సినిమా రంగం ఆయనను వినియోగించుకోలేకపోయింది. అయితే, అప్పటికే ఆయన రాసిన వందలాది పాటలు తరతరాల పాటు ఆయనకు తరగని కీర్తిని ఆర్జించిపెట్టాయి.
సినిమాల కోసం ఉద్యోగం వదులుకున్న ఆయన చివరి రోజుల్లో కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు 1983లో ఆయనను ‘ఆస్థానకవి’ పదవి నుంచి తప్పించటంతో మనస్థాపం చెందారు. చివరకు 1987 నవంబర్ 5న భౌతికంగా మనకు దూరమయ్యారు. అయినా, ఆయన కవితా గర్జన నేటి తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరోవైపు తన సినీపాట సోయగం మనల్ని మరిపిస్తూనే ఉంది.
దాశరథి వారి మరిన్ని మధుర గీతాలు:
‘నడిరేయి ఏ జాములో’ (రంగులరాట్నం), ‘రారా కృష్ణయ్య’ (రాము), ‘తిరుమల మందిర సుందర’ (మేనకోడలు), ‘నను పాలింపగ నడిచి వచ్చితివా’ (బుద్ధ్దిమంతుడు) వంటివి దాశరథి రాసిన భక్తి గీతాలు కాగా, ‘ఓహో గులాబిబాల’ (మంచిమనిషి), ‘పాపాయి నవ్వాలి, పండగే రావాలి’ (మనుషులు మారాలి), ‘ముత్యాల జల్లు కురిసె’ (కథానాయకుడు), ‘ఆవేశం రావాలి, ఆవేదన కావాలి’ (మనసు మాంగల్యం), ‘ఎచటికోయి నీ పయనం’, ‘అందాలబొమ్మతో ఆటాడవా’ (అమరశిల్పి జక్కన), ‘అందాల ఓ చిలక’ (లేతమనుసులు), ‘చిన్నారి పొన్నారి నవ్వు’ (నాదీ ఆడజన్మే), ‘ఒక పూలబాణం రగిలింది మదిలో’ (ఆత్మగౌరవం), ‘మప్లూతీగ వాడిపోగా’ (పూజ) వంటి పాటలకు ఎన్నింటికో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అవి చిరస్థాయిగా ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయాయి.

మ్యూజికల్ దేవదాసు
November 17th, 2011
తారాగణం:
రణబీర్ కపూర్
నర్గీస్ ఫకీరీ
అదితి రావ్ హైదరీ, పియూష్ మిశ్రా
శిఖా జైన్ తదితరులు
సంగీతం: ఏ.ఆర్.రెహ్మాన్
రచన, దర్శకత్వం: ఇంతియాజ్ అలీ
సంగీత ప్రపంచం గురించి ఇంకా కొత్తగా ఏం చెబుతారు? ప్రత్యర్థితో తలపడి విజయం సాధించే ‘డిస్కో డాన్సర్’ దగ్గర్నుంచీ, అంగవైకల్యాన్ని అధిగమించి సంగీతకారుడిగా నిలదొక్కుకునే ‘సౌండ్ ట్రాక్’ వరకూ అనేకం వచ్చాయి. ఇంకా కొత్తగా ‘రాక్ స్టార్’లో చెప్పడానికేముంటుంది? జబ్ వి మెట్, లవ్ ఆజ్‌కల్ చిత్రాల దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రేమకథలు తీయడం తప్ప ఇంకో ఆసక్తి లేదు. తీసిన రెండు ప్రేమ కథలూ ప్రేమ కథలపట్ల అతడి దృక్పథాన్ని విభిన్నంగా చాటాయి. అతి సంక్లిష్టంగా వుండే ప్రేమ కథలకి కళాత్మక విలువలతో క్లాసిక్‌గా తిర్చిదిద్దే అతడి చపలత్వాన్ని ప్రపంచం గమనించింది. అతడిలో ఒక మణిరత్నం, ఇంకో సంజయ్‌లీలా భన్సాలీ ఇద్దరూ వుంటారు. అయితే ప్రేమ కథలతో చాపల్యం కూడా శృతిమించినప్పుడు- లేదా గత సినిమాల కంటే పై స్థాయిలోప్రతిష్ఠించాలన్న ఆదుర్దా అదుపుతప్పినపుడు- అసలుకే మోసం వస్తుంది. అసలేం చెప్పాడన్న గందరగోళమేర్పడుతుంది.
‘రాక్‌స్టార్’ సంగీతంలో అర్హత సంపాదించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేసే కళాకారుడి కథగా - కొత్త కొత్తగా కన్పించి, అంతలోనే అభినవ దేవదాసుగా మారిపోయే అర్థంకాని ప్రేమ కథలోకి తిరగబెట్టే ప్రశ్నార్థకం. ఆకస్మిక ముగింపు ఒక శరాఘాతం.
ఇలా దేవదాసుగా మారిపోయి కళని చెడగొట్టుకునే క్రమం ఇంకో రూపంలో మాదక ద్రవ్యాలతో ‘సౌండ్ ట్రాక్’ ఫస్ట్ఫాలోనే చూశాం. అక్కడ సెకెండాఫ్‌లో తప్పు తెలుసుకున్న హీరో మాదక ద్రవ్యాలతో ప్రాప్తించిన అంగవైకల్యాన్ని జయిస్తాడు. తిరిగి సంగీతకారుడిగా మెరుస్తాడు. ‘రాక్‌స్టార్’లో ప్రేమ మత్తులో కళని చెడగొట్టుకుని, ప్రేమలోనే మునిగి తేలతాడు. ప్రేమ అన్నం పెడుతుందా? దేవదాసు భగ్నప్రేమికుడిగా జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇంతియాజ్ అలీ- ఆ కథని సంగీతానికి పేస్ట్ చేసి కొత్త సృష్టి చేశాననుకొన్నాడు. కానీ దీన్ని ఒక లాజికల్ ఎండ్‌కి తీసుకెళ్ళడంలో విఫలమయ్యాడు.
అయితే సంగీతం కోసం కావచ్చు, తర్వాత ప్రేమ కోసం కావచ్చు, ఇంకా మొదట పల్లెటూరి బైతుగానూ కావచ్చు- ఈ మూడు భిన్న రూపాల్లో రణబీర్‌కపూర్ మాత్రం దేవదాసు కంటే మత్తుగా జీవించాడు. పాత్రల్లోకి దూరిపోయి తను కన్పించకుండా పోయాడు. నటనలో ఇంత పిచ్చిని కనబర్చిన స్టార్‌ని ఈ మధ్యకాలంలో చూడలేదు. అసలు కథెలా ఉన్నా రణబీర్‌కపూర్ పాత్రల్ని అపహరిచుకుపోయి నటనలో మజా అంతా తీర్చుకున్నాడు. వచ్చే సంవత్సరం అతడ్ని ఘెరావ్ చేసేందుకు పెద్ద పెద్ద అవార్డులు పొంచివున్నా ఆశ్చర్యం లేదు. అతను తండ్రి (రిషీకపూర్)ని మించిన తనయుడయ్యాడు. జనార్థన్ జాకఢ్ అలియాస్ జోర్డాన్ (రణబీర్ కపూర్) రాక్‌స్టార్‌గా ఎదగాలని పల్లెటూరు నుంచి గిటార్ పట్టుకుని ఢిల్లీ వచ్చి బస్టాండ్‌లో న్యూసెన్స్ చేస్తుంటే, పోలీసు చెంపవాయించి పట్టుకు పోతాడు. అతనసలు చదువు కోసం వచ్చాడు. కానీ సంగీతమంటే పిచ్చి. నీ పిచ్చిని ఇలా తీర్చుకోలేవు, ఈ పిచ్చి తీరాలంటే నీకింకో పిచ్చి పట్టాలని పొడుస్తూంటాడు కాలేజీ క్యాంటీన్ మేనేజర్. గొప్పగొప్ప కళాకారులు దేనికో మనసు విరిగి, ఆ మంటతో కళాకారులు కాగలిగారంటారు. నీకలాటి గొప్ప సామాజిక బాధలు కలగకపోవచ్చు కానీ, కనీసం ఎవర్నో ప్రేమించి భగ్నప్రేమికుడివికా- అప్పుడు ర్టాక్‌స్టార్‌వి అవుతావని మార్గ నిర్దేశం చేస్తూంటాడు. ఇక జోర్డాన్ మనసు విరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు. కానీ ఎవరూ సహకరించరు.
అప్పుడొక అందమైన అమ్మాయి హీర్ (నర్గీస్ ఫకీరీ) కన్పిస్తుంది. ఈమెతో తన ఆశయం నెరవేరచ్చు అనుకుని వెంటపడతాడు. కానీ ఆమె ఛీ కొట్టకుండా ఇష్టపడేసరికి దెబ్బతింటాడు. ఇంకా ఆమె తాగుడికీ, ‘సి’ గ్రేడ్ సెక్స్ సినిమాలకీ తీసికెళ్ళేసరికి - కష్టమనుకుంటాడు. చివరికామె తనకి జరగనున్న పెళ్ళిగురించి చెప్పేసరికి అడ్డంగా మనసు విరిగిపోతుంది. ఇక గిటార్ పట్టుకుని చెలరేగిపోయి అంతర్జాతీయ ప్రదర్శనలకి ఎదిగిపోతాడు. రాక్‌స్టార్ అన్పించుకుంటాడు.
కానీ ఆమె మీద ప్రేమని చంపుకోలేకపోతాడు. ఆమె వుంటున్న ‘ప్రాగ్’కి చేరుకుని ఆమె వైవాహిక జీవితంతో చెలగాటమాడుతుంటాడు. పోలీసులు, అరెస్టులూ కేసులూ వీటన్నిటి మధ్య ఇంకా దేవదాసుగా మారిపోయి అభిమానుల చేత ఛీ కొట్టించుకుంటాడు. రాక్‌స్టార్‌గా పతనవుతాడు.
అయితే ఇలా దేవదాసుకి సాహసించగల్గిన దర్శకుడు దాన్ని విషాదాంతం చేయడానికి ఈ కాలం ప్రేక్షకుల దృష్ట్యా భయడినట్టు- సుఖాంతం చేశాడు. అయితే ఇక్కడ ప్రేమ, సంగీతం అనే రెండు గమ్యాలున్నాయి. ప్రేమ సబ్జెక్టివ్ స్టోరీ పాయింట్ అయితే, సంగీతం ఆబ్జెక్టివ్ స్టోరీ ప్రాబ్లం. ప్రేమతో ప్లాట్ క్లయిమాక్స్‌వుంటే, సంగీతంతో స్టోరీ క్లయిమాక్స్. ప్లాట్ క్లయిమాక్స్‌తో ముగించాలంటే అందులో పే ఆఫ్ కాని బీట్స్ ఏమీ లేవు. ఆమెకి పెళ్లయి పోయింది. ప్రధాన కథ సంగీత ప్రయాణం అయినప్పుడు ఈ సినిమా స్టోరీ క్లయిమాక్స్‌నే డిమాండ్ చేయాలి. ఇందులో కావలసినన్ని పే ఆఫ్ కాని బీట్స్ వున్నాయి దీన్ని విస్మరించి పెళ్ళయిన హీరోయిన్‌తోనే ప్రేమ కథని ఒక ఆకస్మిక పరిణామంతో సుఖాంతం చేయడంతో తెల్లబోవడం మనవంతైంది. సంజయ్ లీలా భన్సాలీ తీసిన ‘హమ్ దిల్‌దే చుకే సనమ్’లో హీరోయిన్‌కి పెళ్ళయినా కాపురం చేయలేదు. హీరో హీరోయిన్ల బాధచూసి ఆమెకి విముక్తి కల్గిస్తాడు భర్త. ఇది ఇండియన్ సెంటిమెంటు. కానీ ఇంతియాజ్ అలీ ఫారిన్ సెంటిమెంటు కోసం తీసినట్టు ఈ సినిమా తయారైంది.
ఈ సినిమాకి ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం పెద్ద ఎస్సెట్ అని బయట అన్పించినా, సినిమాలో చాలాపాటలు పల్లవి, లేదా ఒక చరణంతో ముగిసిపోయేవే!

‘బాపు’రే (ఖా) రామరాజ్యం.-
November 24th, 2011
** శ్రీరామరాజ్యం ( ** ఫర్వాలేదు )
బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీకాంత్, విధూసింగ్, సంగీతం: ఇళయరాజా
మాటలు: ముళ్లపూడి
పాటలు: జొన్నవిత్తుల
నిర్మాత: యలమంచిలి సాయబాబు
దర్శకత్వం: బాపు
---
అందరికీ తెలిసిన కథే..తెలుగునాట సినీ ప్రేక్షక జనాన్ని నేటికీ వెంటాడే ఉత్తర రామ చరితానికి వెండితెర రూపం ఇచ్చిన ‘లవకుశ’. ఇప్పుడు శ్రీరామరాజ్యం పేరిట ఆధునిక సాంకేతిక హంగులతో మళ్లీ సాక్షాత్కరించింది. ఈ శ్రీరామరాజ్యం దిగ్ధర్శకుడు బాపు తన అనుభవాన్ని రంగరించి తెరపై ‘రంగు’రించిన ‘చిత్రం’. చిత్రంలో కాకలు తీరిన నటీనటులు వుండొచ్చు..ఆ వెనుక వెన్నుదన్నుగా సరైన సాంకేతిక నిపుణులుండొచ్చు. కానీ ప్రతి ఫ్రేమ్‌లో, నటీనటుల హావభావాల్లో, కెమేరా కదలికల్లో, సెట్ ప్రాపర్టీస్‌ల్లో ఆరంభం నుంచి సమాప్తం వరకు బాపు కనిపిస్తూనే వుంటే, సినిమాలోని ప్రతి మాటలో రమణ వినిపిస్తూనే వుంటారు. అందుకే ఇది శ్రీరాముడి..శ్రీరామరాజ్యం కాదు. అచ్చంగా బాపురమణల శ్రీరామరాజ్యం.
లంకలో రావణుడ్ని దునుమాడిన అనంతరం పుష్పకంలో అయోధ్యకు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా అయోధ్యకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. తమ అభిమాన రామచంద్రునికి జనం సాదర స్వాగతం పలకడం, పదునాలుగేళ్ల క్రితం అర్ధాంతరంగా ఆగిన పట్ట్భాషేకం సంపూర్తికావడం, ఇక అంతా బాగే అనుకున్న సమయంలో, సాధారణ పౌరుడి మత్తుపలుకులు ములుకులుగా గుచ్చుకున్న ఆవేదనతో రాముడు, అగ్ని పునీత సీతను అడవులకు పంపడం, ఆమె అక్కడ వాల్మీకి ఆశ్రమంలో లవకుశలకు జన్మనివ్వడం చిత్రంలోని కొన్ని ఘట్టాలు. ఆపై రాముని అశ్వమేధయాగ ప్రయత్నం, ఆ అశ్వానికి అడ్డు పడిన రాముని బిడ్డలు, చివరికి భూజాత తల్లి ఒడికి చేరడంతో చిత్రం ముగుస్తుంది.
శ్రీరామరాజ్యం సినిమాను తీయాలనుకోవడం మూడంచెల రిస్క్. ఒకటి నేటికీ జనం కళ్లల్లో నిలిచిపోయిన ‘లవకుశ’. రెండు వేగానికి మారుపేరుగా మారిపోయిన జీవితాలకు, మెలోడ్రామా రంగరించిన కథను అందించాల్సి రావడం. మూడవది కనీసం రెండు మూడయినా పెద్ద సినిమాలు తీసుకోవడానికి సరిపోయేంత బడ్జెట్ అవసరం. చివరిదైన బడ్జెట్ సమస్యను అధిగమించే నిర్మాత (యలమంచిలి సాయిబాబు) సినిమాకు లభించడం తొలి సౌలభ్యం. అంతటి బడ్జెట్ అందుబాటులో వున్నా, ఉత్తర రామాయణ కావ్యాన్ని రమణీయంగా తెరకెక్కించగల దర్శకుడు బాపును సినిమాకు ఎంచుకోవడంతో తొలి సమస్య తొలగి లవకుశకు దీటైన సినిమా కళ్ల ముందు నిలిచింది, ప్రేక్షకులు సినిమా చూస్తున్నంత సేపూ లవకుశ పెద్దగా స్ఫురణకు రాలేదంటే దానికి కారణం ముమ్మాటికీ నిర్మాత-దర్శకుడు సమష్టిగా చేసిన కృషే. కానీ ఎటొచ్చీ ముందు చెప్పుకున్న రెండో సమస్య మెలోడ్రామా సంద్రాన్ని దాటడానికి మాత్రం ఈ ఇద్దరూ కలిసి సరైన వారధి నిర్మించలేకపోయారు. అదే ఈ సినిమాకు ప్రతిబంధకంగా నిలిచింది. అందునా ప్రతి ఫ్రేమ్‌ను వీలయినంత స్పష్టంగా తీసే బాపుశైలి ఈ మెలోడ్రామాను మరింత పెంచింది. దీనికి తోడు క్లయిమాక్స్‌ను కాస్త కట్‌షార్ట్ చేయడం కూడా జనానికి నచ్చదు గాక నచ్చదు. వాస్తవానికి ఈ సినిమాకు ఆయువుపట్టు అదే. తండ్రీ తనయుల నడుమ వాదన, పోరు అన్నది కీలకమైన అంశం. దాన్ని తృటిలో తేల్చేసి బాపు లాంటి దిగ్దర్శకుడు కూడా కాస్త తప్పు చేసారనిపించింది. ఎలాగూ పౌరాణికం తీయాలని సాహసించినపుడు, క్లయిమాక్స్‌లోనైనా ఒక్క పద్యం వినిపించే ధైర్యం చేయాల్సింది. ‘చిన్నిపాపలు..కడసారి చెప్పుచుంటి..’ ‘చాలు.చాలు’ లాంటి లవకుశ పద్యాలు ఇప్పటికీ జనానికి గుర్తున్నాయి. సినిమాకు మరో కీలక సన్నివేశమైన పామరుడైన రజకుడు భార్యతో అడ్డగోలు వాదనకు దిగడం, అది రాముడిలో రేకెత్తించిన ఆలోచనా సంచలనం కూడా అంతగా పండలేదు. రామాయణ కథానాయకుడి పాత్ర ఔచిత్యం వర్తమానం జనం దృష్టిలో పలుచన కావడం మంచిది కాదన్న ఉద్దేశంతో సృష్టించిన రాముడి సీతావిరహవేదన దృశ్యాలు సినిమాకు కాస్త బరువుగా మారాయి. పైగా కాస్త సృజన కలిగిన దర్శకులంతా చేసిన తప్పే బాపూ కూడా చేశారనిపించింది. సినిమాని దృశ్య కావ్యంగా మలచడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్ట్ మీద అంతగా పెట్టలేదనిపించింది.
ఇక సినిమాకు సాంకేతిక పరంగా ప్రాణం పోసింది ఆర్ట్ డైరక్టర్ల కృషి. ఆపై ఇళయరాజా స్వరసమ్మేళనం. అందుబాటులోకి వచ్చిన వస్తుసామగ్రి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అయోధ్యను, రామమందిరాన్ని, వాల్మీకి ఆశ్రమాన్ని కళ్ల ముందు అధ్బుతంగా సాక్షాత్కరింపచేయగలిగారు. రాముడి దర్బారు, శయన మందిరం, రాజభవనం, నిలువులెత్తు సూర్యవిగ్రహం, ప్రతి ఒక్కటీ ప్రేక్షక జనం కళ్లను మైమరిపింపచేస్తాయి. వాటి కొలతలన్నీ సినిమాకు భారీతనాన్నిచ్చాయి. బాపు ఊహాశక్తికి రూపం ఇచ్చిన ఆర్ట్ డైరక్టర్ల కృషికి ఫొటోగ్రాఫర్ రాజు కృషి తోడై మరింత ఆకర్షణ కూర్చింది. ఫొటోగ్రాఫర్ రాజు కూడా బాపు శైలిని ఆకళింపు చేసుకుని, కెమేరా కదలికలన్నీ తదనుగుణంగా నడిపించాడు. పైగా ఇందుకు గ్రాఫిక్స్ తోడయ్యాయి. అగ్ని, వరుణ, వాయు, సుదర్శన, పాశుపత, బ్రహ్మాస్త్రాలను గ్రాఫిక్స్‌లో చిత్రీకరించిన తీరు బాగుంది. సినిమాకు ఇళయరాజా అందించిన నేపథ్యసంగీతం, పాటలు ఎంతయినా ప్రశంసాపాత్రం. కానీ ఎటొచ్చీ ‘ఓ రామా లేరా..రఘురామా’ పాటలో మొదటి చరణం ఎందుకు తీసేసారో తెలియదు. స్క్రిప్ట్‌కు అనుగుణంగా నడవడం వల్ల కావచ్చు ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ వుండదు. ఇక ముళ్లపూడి వారి మాటలు. పౌరాణికం అయినా తన చమక్కు, వెటకారం, చమత్కారం తనదే అనిపించారు ఆయన తన చివరి సినిమాలో సైతం. సీతా లక్ష్మణ సంవాదం, సీతాభూదేవి సంభాషణం, సీతారాముల ముచ్చట్లు అన్నింటా రమణ మార్కు పండింది. ‘సూర్యవంశ రాజ్య ప్రతిష్టలో నా బాధ్యత ఏమీ లేదా..నన్ను త్యజిస్తే సూర్యవంశ ప్రతిష్ట ఇనుమడిస్తుందా అనే అర్థాల్లో సీత ప్రశ్నించిన తీరు ఆధునిక భావజాలానికి సరిపోతాయి. జొన్నవిత్తుల పాటలు ఇప్పటికే జనానికి పట్టాయి. అయితే పాటల్లో వాడిన పదాలే మళ్లీ మళ్లీ వాడకుండా, మరిన్ని పదాలు చేర్చి వుంటే బాగుండేది.
సినిమాలోని పాత్రధారుల్లో ఎక్కువ మార్కులు సంపాదించినది సీత పాత్రధారిణి నయనతార. సహజంగానే బాపు సినిమాల్లో కథానాయికలకే ఎక్కువ మార్కులు పడతాయి. దీనికి తోడు సినిమా మూడు వంతులు సీత పాత్ర చుట్టూనే తిరుగుతుంది. దీనికి నయనతార ఆహార్యం, నటన తోడయ్యాయి. సినిమా చూస్తున్నపుడు ఆమె నటించిన గతకాలపు వాణిజ్య సినిమాలు ఏవీ గుర్తుకురావు. కేవలం కళ్ల ముందు సీత మాత్రమే సాక్షాత్కరించేలా చేయగలిగింది. ఇక రాముడిగా నటించిన బాలకృష్ణను ఏ మేరకు, ఏయే యాంగిల్స్‌లో ఎలా చూపించాలో, అంతమాత్రమే చూపించడం, ఎంత మేరకు తెరపై వుండాలో అంతమేరకే వుంచడం అతగాడికే అనుకూలించింది. అసలు ఎన్టీఆర్ జీవించిన పాత్రలో బాలకృష్ణను జనం ఎలా రిసీవ్ చేసుకుంటారా అన్న అనుమానం పటాపంచలైంది. అయితే కొన్ని కొన్ని క్లోజప్ సన్నివేశాల్లో ముఖానికి వేసిన మేకప్ వల్ల కావచ్చు. వయసు మీద పడుతుండడం వల్ల కావచ్చు. కాస్త వృద్ధాప్యపు ఛాయలు కనిపించాయి. కానీ బాపు ‘చిత్రీ’కరణ భంగిమల్లో బాలకృష్ణ కూడా ఒదిగిపోవడం వల్ల ఇటువంటి ఒకటి రెండు మైనస్ పాయింట్లు కవరైపోయాయి. ఇక వాల్మీకిగా ఎఎన్‌ఆర్, లక్ష్మణుడిగా శ్రీకాంత్ ఓకె. లవకుశలుగా నటించిన కుర్రాళ్ల కన్నా బాల హనుమంతుడిగా నటించిన బాలుడికే మంచి మార్కులు పడతాయి.
ముదిమి మీద పడిన వేళ కూడా తన భావుకత, రమణీయత ఏ మాత్రం చెక్కు చెదరలేదని నిరూపించుకున్న బాపు కృషిని చూడాలని వున్నా, రూపాయలకు విలువిచ్చే కాలంలో కోట్లను వెదజల్లి, చిల్లర ఏరుకునేంత రిస్క్‌కు సాహసించిన నిర్మాత ధైర్యాన్ని, అభిరుచిని అభినందించాలని వున్నా ఈ సినిమాను చూడొచ్చు.

డబ్బింగ్ చిత్రాల దడ
November 24th, 2011
ఇదంతా ఎందుకు వచ్చింది? ఈసారి దీపావళికి భారీ బడ్జెట్‌లో తీసిన హిందీ డబ్బింగ్ ‘రావణ్’, తమిళ డబ్బింగ్ ‘సెవెంత్ సెన్స్’ విడుదల చూసి దడుసుకున్న తెలుగు నిర్మాతలు ఎవరూ తమ సినిమాలను విడుదల చేసుకోడానికి ముందుకు రాలేకపోయారు. ఎందుకంటే తాము తీసిన సినిమాల క్వాలిటీ వారికి తెలుసు కాబట్టి. సినిమాలో దమ్ముంటే అది పోటీని తట్టుకుని ఎలాగైనా నడుస్తుంది. చిరంజీవి సినిమాతో పాటు విడుదలయిన ‘ఆనంద్’ అనే చిన్న చిత్రం పోటీని తట్టుకుని ఘనవిజయం సాధించలే దా? డబ్బింగ్ సినిమాల ధాటికి భయపడి దీపావళి తర్వాత రిలీజైన సినిమాలు ఘోరంగా దెబ్బతినడంతో, చతికిలబడ్డ డబ్బింగ్ చిత్రాలు మళ్ళీ పుంజుకోగలిగాయి. తమిళ చిత్రాలకు, తమిళ హీరోలకు ఉన్న డిమాండ్‌నుబట్టి ‘సెవెంత్ సెన్స్’ సినిమా దాదాపుగా నాలుగు వందల థియేటర్లలో రిలీజ్ అయింది. దీపావళికి విడుదల చేసుకోవడానికి ముందుకు రాని నిర్మాతలకు, సంక్రాంతికి ఇంకో పిడుగు పడనున్నది. వచ్చే సంక్రాంతికి శంకర్ తీసిన ‘త్రీ ఇడియట్స్’ తమిళ డబ్బింగ్ రానున్నది. శంకర్‌కున్న క్రేజ్‌ను బట్టి చూస్తే ఇది కూడా నాలుగు వందల థియేటర్లలో విడుదల కావచ్చు. తెలుగునాట సంక్రాంతి సెంటిమెంట్ పుంది. పెద్ద హీరోల చిత్రాలు పోటాపోటీగా విడుదలై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. శంకర్ దెబ్బకు తమ సినిమాలను వాయిదా వేసుకోవడమైనా జరగాలి. లేకపోతే విడుదల చేద్దామంటే థియేటర్లు దొరకకపోవచ్చు. ఈ ఇబ్బందినుండి బయటపడాలంటే శంకర్ సినిమాను ఆపాలి. అది ఆపలేరు కాబట్టి డబ్బింగ్ చిత్రాలమీద నిషేధాస్త్రం ప్రయోగించాలి లేదా వాటిమీద టాక్స్‌విపరీతంగా పెంచేస్తే సరి.
తెలుగులో పెద్ద హీరోలనబడే వారి చిత్రాలు బోల్తాపడుతున్నాయి. ఇంకోవైపు తమిళంలో వచ్చిన చిన్నా చితకా చిత్రాలు కూడా ఇక్కడ డబ్బు చేసుకుంటున్నాయి. ఎక్కడుంది కిటుకు? నాణ్యతలో మనవాళ్ళు హీరోయిజం పేరిట తయారుచేసే మూస సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఇంకెంత కాలం చూస్తారు. అందుకనే వారు వైవిధ్యభరితంగా వున్న చిత్రాల వైపు దృష్టి సారిస్తున్నారు. మన నేటివిటికీ అనుగుణంగా వుండి, డిఫరెంట్‌గా వుండడంవల్ల తమిళ చిత్రాలు మనవాళ్ళను ఆకర్షిస్తున్నాయి. ‘మృగం’ అనే స్మాల్ బడ్జెట్‌లో వచ్చిన డబ్బింగ్ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు విస్మయానికి గురిచేశాయి. ఇక ‘రంగం’ సినిమా ఒరిజినల్ కంటే డబ్బింగ్ చిత్రమే ఎక్కువగా డబ్బులు వసూలుచేయడం పరిశీలకులనే దిగ్భ్రమ కలిగించింది.
డబ్బింగ్ సినిమాలు విరివిగా రావడానికి కారణం కూడా మనవాళ్ళే. మూడు ఫైట్లు, ఆరుపాటలతో, నెగెటివ్ పాత్రలతో మన హీరోలు ఒక మూసలో ఇరుక్కుపోయారు. వైవిధ్యభరితమైన పాత్రలు ఎన్నుకోవడం ఉండదు. ఇక కుర్ర హీరోల సినిమా ఒకటి హిట్టయితే చాలు, వాళ్ళకు సర్వజ్ఞత అలవడుతుంది. ఇకవాళ్లు వేలుపెట్టని శాఖేలేదు. ఇక చిత్రీకరణ అంతా నాసిరకమే. ద్వంద్వార్థాల పాటలు, శబ్ద కాలుష్యానికి దోహదపడే పాటలు, విదేశీ షూటింగ్‌లతో అవగాహన, అనుభవం లేని కుర్రకారంతా సాంకేతిక నిపుణులుగా తయారయి సినిమాను భ్రష్టుపట్టిస్తున్నారు. ఇంగ్లీషు కాసెట్లు ముందేసుకుని కథను వండేయడమే. ఎంత రిచ్‌గా తీశామని మురిసిపోతున్నారే తప్ప కథా కథనాల గురించి పట్టించుకోవడంలేదు. సినిమాకు ఆయువుపట్టు అయిన కథను విస్మరించి, ఎన్ని హంగులతో సినిమాను నింపితే ఏం లాభం? అది వట్టి శవాలంకరణలా నిష్ప్రయోజనమైపోతుంది. పలుపు దొరికిందని బర్రెను కొన్నట్లు, హీరో కాల్షీటు దొరికిందనగానే కథను పట్టించుకోకుండా, రెడీమెడ్ మిక్స్‌తో సినిమా తీస్తే ఎవరు చూస్తారు? ఎన్నాళ్ళు చూస్తారు? ప్రేక్షకుల అజ్ఞానమే శ్రీరామరక్ష అనుకునే సినిమా వాళ్ళకు ప్రేక్షకులు తెలివిమీరడం, ప్రత్యామ్నాయాలు వెతకడం చూసి తట్టుకోలేకపోతున్నారు.
ఇంకోవైపు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులంతా కలిసి నిర్మాణవ్యయం విపరీతంగా పెంచేశారు. ‘మగధీర’ నిర్మాణం సినిమా రంగం పతనానికి దారితీసింది. వారు సెట్టింగులు, గ్రాఫిక్స్‌తో భారీ ఎత్తున నలభై కోట్లతో సినిమా తీయడంతో పోటీ ప్రారంభమైంది. ఇక మిగతా హీరోలంతా తమ సినిమాలు కూడా భారీగా తీయాలని తాపత్రయపడడంతో నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. ‘బృందావనం’ లాంటి సాంఘిక చిత్రానికి 35 కోట్లు ఖర్చు పెట్టారంటే ఎందుకు? అవసరమా? అని ప్రశ్నించుకునే నాథుడు లేకపోయాడు. యువ హీరోలు, యువ దర్శకులు కలిసి వ్యయాన్ని పెంచేసి నిర్మాతలను దివాలా తీయిస్తున్నారు. ‘మగధీర’ నలభై కోట్లకు అరవై కోట్లు సంపాదించింది. చిన్న చిత్రమైన ‘అలా మొదలయింది’ మూడు కోట్లకు పది కోట్లు సంపాదించింది. ఎవరికి ఎంత లాభించిందో మనకు ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు కొత్తగా ‘దూకుడు’ సినిమా నూరు కోట్లు వసూలుచేస్తుందని ప్రకటనలిస్తున్నారు. నిజంగా తెలుగు సినిమాకు అంత స్టామినా ఉందా? ఎవర్ని వంచించడానికి ఈ ప్రకటనలు? ఈ ప్రకటనల ఆధారంగానే ప్రభుత్వం వారు ఇన్‌కంటాక్స్ వసూలుచేస్తే బాగుంటుంది. ఇలాంటి ప్రకటనలు అనవసర పోటీని పెంచి నిర్మాణ వ్యయం పెరగడానికే దోహదం చేస్తాయి.
ఇలా పోటీలు పడి అంతా నిర్మాణ వ్యయం పెంచేస్తుంటే చిన్న నిర్మాతలు ఏం చేయాలి? వాళ్ళు డైరెక్టుగా సినిమాలు తీసి చేతులు కాల్చుకునే రిస్కు తీసుకోకుండా డబ్బింగ్ చిత్రాలకు ఎగబడుతున్నారు. మనవాళ్ళ ఆత్రుత చూసి తమిళ చిత్ర నిర్మాతలు డబ్బింగ్ రేట్లను విపరీతంగా పెంచేస్తున్నారు. ఫేలయిన తమిళచిత్రాలు, చిన్నా చితకా హీరోల సినిమాలను కూడా మంచి రేటుకు మనవాళ్ళకు అంటగడుతున్నారు. వైవిధ్యమైన కథా కథనాలకు, పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చే తమిళహీరోలు, దర్శకులవల్ల ఎన్నో మంచి చిత్రాలు వస్తున్నాయి. ఆ చిత్రీకరణలోని కొత్తదనానికి మన ప్రేక్షకులు ఎప్పుడో దాసోహమైపోయాం.
ఈ రోజు సూర్య, విశాల్ లాంటి తమిళ నటులకు కూడా మన దగ్గర మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ఆ తమిళనటులు ఆంధ్ర దేశానికి తమ సినిమా ప్రమోషన్లకోసం వస్తుంటే, మరి మన హీరోలు ఏం చేస్తున్నట్లు? వాళ్ళు తమ మార్కెట్లను విస్తరించుకుంటూ పోతూ వుంటే, మనవాళ్ళు బావిలో కప్పల్లా ఉండిపోతున్నారు. మన సినిమాలను కూడా ఇతర భాషలలోకి డబ్ చేసి డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంటే అంత సీనున్న సినిమాలు లేవు. ఒక్క అల్లుఅర్జున్ మాత్రమే మళయాళంలో పాగా వేయగలిగాడు. ‘గమనం’లా ద్విభాషా చిత్రాలు తీస్తూ ఇతర భాషా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయాలి. అలా మనం పరిచయం అయితే, అక్కడ మన డబ్బింగ్‌లకు గిరాకీ ఏర్పడుతుంది.
తమిళ కుర్రహీరోల డబ్బింగుల ముందు, తెలుగు హీరోల ఆకర్షణ, హంగులు పనికిరాకుండా పోతున్నాయి. ఒక హీరోకు ఇంకో హీరో సినిమా పోటీరాకుండా డబ్బింగ్ సినిమాలే ప్రధానంగా పోటీగా నిలబడడం ఊహించలేని విషయం. ఈ పోటీని తట్టుకోవాలంటే వైవిధ్యభరితంగా చిత్రాలను తీయాలనే గుణం నేర్చుకోవాల్సింది పోయి, సదరు తమిళ డబ్బింగ్ చిత్రాలను లేకుండా చూడాలనే ప్రయత్నం దేనికి? దీనికి వాళ్ళు చూపే సాకుఏమిటంటే, తెలుగు సినిమాకు థియేటర్లు దొరక్కుండా పోతున్నాయి, ఒక పెద్ద హీరో సినిమా నాలుగువందల థియేటర్లలో రిలీజవుతుంటే, చిన్న సినిమా వాళ్ళకే థియేటర్లు దొరకకుండా పోతున్న దశలో, డబ్బింగ్ సినిమాలను పట్టించుకునే నాథుడెవరు? ‘‘రోబో, సెవెంత్‌సెన్స్, గాంబ్లర్’ మాత్రమే ఎక్కువ థియేటర్లలో రిలీజయ్యాయి. అన్ని డబ్బింగ్ చిత్రాలను అంత భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు లేవు. ఒకప్పుడు కనీసం మార్నింగ్ షోలలో చిన్న సినిమాలు విడుదల చేసుకోవడానికి అవకాశముండేది. కాని ఇప్పుడు ప్రతి సినిమా రిలీజయినప్పటినుండి చివరి రోజు వరకు నాలుగు ఆటలు ఆడాల్సిందే. ఈ పద్ధతి తీసేయాలి. శుక్ర, శని, ఆది నాలుగు ఆటలు మిగతా రోజులు మూడు ఆటలకే కుదించాలి.
మన పొరుగున ఉన్న కర్ణాటకలో డబ్బింగ్ చిత్రాలను నిషేధించారు. అక్కడి సంగతి వేరు. బెంగుళూరు కాస్మో పాలిటన్ సిటీ. అక్కడ తమిళం, మళయాళం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు నేరుగా విడుదలవుతాయి. కన్నడ సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి. ఇక డబ్బింగ్‌ల హడావుడి వేరు. అందుకని కన్నడ చిత్రరంగం నిలదొక్కుకోవాలంటే ప్రతి థియేటర్లో కొన్ని వారాలు విధిగా కన్నడ చిత్రాలను ప్రదర్శించాలి. డబ్బింగులు కాకుండా ఆయా చిత్రాలను నేరుగా విడుదల చేసుకోవచ్చని ప్రతిపాదించాలి. హాలీవుడ్ డబ్బింగులు హిందీచిత్ర పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని వాటిని నిషేధించమని మహేష్ భట్ లాంటి ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. నిషేధం సరియైనది కాదు.
వాటిమీద టాక్సులు పెంచేస్తే సరి. ఆంధ్రప్రదేశ్‌లో అనువాద చిత్రాలపై నిర్మాతల మండలి కొత్తగా ఆంక్షలు విధించాలని ప్రయత్నించడం సమంజసం కాదని, ఆ చిత్రాలపై భారీగా పన్ను విధించాలని చెబుతుండటం భావ్యం కాదని చెన్నైలోని అనువాద చిత్రాల నిర్మాతలు, సాంకేతిక నిపుణుల సంఘం పేర్కొన్నది. అనువాద చిత్ర నిర్మాతల సాధకబాధకాలను, అనువాద చిత్ర నిర్మాణంలో ఎదుర్కొనే కష్టనష్టాల గురించి ఏమాత్రం అడిగి తెలుసుకోకుండా, కనీసం తమకు తెలియజేయకుండా థియేటర్ల విషయంలోగానీ, పన్ను పెంపుదల వంటి ఇతర విషయాలను గురించి ప్రతిపాదన చేయటం సమంజసంకాదని తెలపాలి. చెన్నై అనువాద చిత్ర నిర్మాతల తరఫున, ఆంధ్రప్రదేశ్‌లో అనువాద చిత్రాలకు సంబంధించి యాభై ప్రింట్లతో ప్రదర్శింపబడితే వాటిపై ఇరవై శాతం పన్ను విధిస్తే సరిపోతుందనీ, యాభై ప్రింట్లకన్నా అధిక సంఖ్యలో అనువాద చిత్రాలను ప్రదర్శిస్తే వాటికి యాభై శాతం పన్ను విధిస్తే తప్పులేదని తమ ప్రతిపాదనను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి పరిశీలనకై పంపారు. అన్నిరకాల డబ్బింగ్ సినిమాలకు ఇప్పుడు వున్న టాక్సు విధానమే కొనసాగాలని విజయవాడ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతిపాదించడం ఇంకో మలుపు. ఈవిషయమై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ పెద్దలు, అనువాద చిత్ర నిర్మాతల మండలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడే డబ్బింగ్ చిత్రాలపై వచ్చిన గందరగోళం పోతుంది.

మన హీరోలు సినిమాలు చూడరా?.-
November 17th, 2011
ఓ డాక్టర్ ఎప్పటికప్పుడు తన వృత్తికి సంబంధించి లేటెస్ట్ పరిశోధనలను తెలుసుకుంటూ ఉంటాడు. ఎంబిబిఎస్ చదువు అయిపోగానే వైద్యవృత్తిలో పండిపోయానని అనుకోడు.
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డే టు డే తన ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లలో కొత్త వెర్షన్స్‌ని తెలుసుకుంటూ అప్‌డేట్ అవుతాడు.
ఆఖరికి ఓ కిరాణా కొట్టు వ్యాపారి కూడా మార్కెట్లో వస్తున్న కొత్త కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలుసుకుంటూ ఉంటాడు...
వీళ్లందరు తమ తమ రంగాలలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలను పరిశీలిస్తూ ఇతర వ్యక్తుల తీరు తెన్నులను నిరంతరం అంచనా వేసుకుంటూ తమని తాము అప్‌డేట్ చేసుకుంటూ వెడుతున్నారు.
మరి ఇదే పనిని మన తెలుగు హీరోలు చేస్తున్నారా? అని ప్రశ్నించుకుంటే ఓ పెద్ద సందేహం మన ముందు నోరెళ్లబెట్టి నిలబడుతుంది. ఇటీవలి కాలంలో మన తెలుగు హీరోలు ఎంపిక చేసుకుంటున్న కథలు...చేస్తున్న సినిమాలలోని కథా వస్తువులను గమనిస్తే మన హీరోలు రోజురోజుకి ‘నిలవనీరు’గా అవుతున్నారు. ప్రవహించే సెలయేరు కావట్లేదేమో అని ఇట్టే అర్ధమవుతుంది.
కంచుకోటల్లో హీరోలు!
మన హీరోలలో చాలామంది వారి పూర్వీకుల వంశం తాలూకు ‘కంచుకోటల్లో’ తమని తాము బంధించుకుని, అదే గొప్పతనమని అనుకుంటూ, తమ చుట్టూ తాము గిరి గీసుకుని కూచున్నవాళ్లే ఎక్కువ! లేదంటే తమకంటూ ఓ ‘ఇమేజ్’ ఏర్పడిందని, ఫ్యాన్స్‌ని డిజప్పాయింట్ చేయలేమని తమని తాము భ్రమ పెట్టుకుంటూ ఆ ‘ఇల్యూజనరీ’ ప్రపంచంలోని ‘చట్రం’ల మధ్య ఉన్న వాళ్లు మరికొందరు. దీనికి తోడు, పైకి ఎన్ని చెప్పినా, ఎన్ని చిరునవ్వులు నటించినా, మన హీరోల మధ్య సరైన సత్సంబంధాలు లేవు అనేది సత్యం! అసలు ఆరోగ్యకరమైన పోటీ అటుంచి ఆహ్వానించదగిన అనుబంధాలూ తక్కువే!
అయితే కొందరు హీరోల మధ్య వృత్తిపరమైన వైరుధ్యాలు ఉన్నప్పటికీ ప్రశంసించదగిన స్నేహసంబంధాలు కూడా ఉన్నాయి.
అయితే ఇవన్నీ వారి వారి ‘చట్రాలకు’ లోబడే అని గమనించాలి. ఈ రకమైన ధోరణులు-స్వభావాలవల్ల మన హీరోలు మన సినీ ప్రపంచంలో తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలేంటో గమనించలేని స్థితికి వచ్చారేమో లేదా ‘కామ్’గా పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటూ, తమ పని తాము చేస్కుంటూ ఇతర హీరోల సినిమాల గురించి ఏమాత్రం తెలుసుకోకుండా వెళ్లిపోయే స్థితికి వచ్చారేమో! దీనికి తోడు, వారికి ఉండే షూటింగ్ షెడ్యూల్ వల్ల కూడా ఇలాంటి స్థితికి వచ్చి ఉండవచ్చు. ఇలా తమ పనిలో తాము తలమునకలుగా ఉండే హీరోలు తమ చుట్టూ జరుగుతూ ఉండే అంశాలను, డెవలప్‌మెంట్స్‌ని తెలుసుకోలేకపోతుండవచ్చు. ఒకవేళ తెలుసుకున్నా ఆ విషయాలన్నీ తమ అంతరంగికుల ద్వారానే తెలుసుకుంటారు కనుక, నిజమైన విషయాలు నిజాయితీగా హీరోలను చేరే అవకాశాలు తక్కువగానే ఉండవచ్చు. ఇన్ని కారణాలవల్ల మన హీరోలు ఎవరికి వారు తమ కంచుకోటల్లో ఉంటున్నారేమో అనిపిస్తోంది.మన హీరోలు ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా చక్కగా తమ పని తాము చేసుకోవడం ‘ప్రొఫెషనలిజమే’ కదా? దీన్లో తప్పేంటి?
అనే ప్రశ్న రావచ్చు. ఇక్కడ పాయింటు, ఇతర హీరోల విషయాల్లో జోక్యం చేసుకోవాలని కాదు. సమకాలీన తెలుగు సినీ రంగంలోని సినిమాలు-కథలు-కథా వస్తువుల పరంగా వచ్చే పరిణామాలను తెలుసుకోవాలనేదే పాయింటు! ఆమధ్య ‘మన హీరోలు వారి సినిమాలు తప్ప, ఇతర హీరోల సినిమాలు అసలు చూస్తారా? అలా చూసి, చూసినామని చెప్పేంత విశాల హృదయం మన హీరోలకు ఉందా?’’ అని కూడా ప్రశ్నలు వచ్చాయి.
సరే, మన హీరోలకు అంత విశాల హృదయం ఉందో లేదో మనకనవసరం. కానీ దీనివల్ల వచ్చే సమస్యలేంటి? అనేది మరో ప్రశ్న! సమస్యేం లేదు కానీ, ప్రేక్షకులు-హీరోల సినిమాలను చూసి, గతంలోని మరో హీరో సినిమాలతో, పోల్చుకుని ఆయా కథల ఎంపికలో హీరోల ‘కామన్‌సెన్స్’ను అనుమానించే పరిస్థితి వస్తోంది. అదే సమస్య! ఈ రకమైన అభిప్రాయం హీరోలపై సామాన్య ప్రేక్షకులలో సైతం ఏర్పడడానికి ఇటీవలి సినిమా కథనే ఓ కారణం అని చెప్పాలి.
ఆ మధ్య బాలకృష్ణ నటించిన ‘ఒక్కమగాడు’ సినిమా అత్యంత భారీ అంచనాలతో వచ్చింది. తీరా సినిమా విడుదలయ్యాక ‘ఒక్కమగాడు’ సినిమా దాదాపుగా ‘్భరతీయుడు’కు నకలు అనే విషయం (బాలకృష్ణ మేకప్‌తో సహా) ఈజీగానే తెలిసిపోతుంది. అలాగే పవన్‌కల్యాణ్ హీరోగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా బాలు సినిమా వచ్చింది. ఈ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకుడికి సైతం నాగార్జున నటించిన ‘అంతం’ సినిమాయే గుర్తువచ్చింది. అలాగే కల్యాణ్‌రామ్ కూడా ‘కత్తి’ అనే సినిమాని తీశాడు. టైటిల్ విషయంలో ఎనె్నన్నో వాదవివాదాలు సృష్టించిన ఈ సినిమా తీరా విడుదలయ్యాక అభిమానులను సైతం పెదవి విరిచేలా చేసింది. పైగా ఈ సినిమా మహేష్‌బాబు ‘అర్జున్’ సినిమా కథను గుర్తు చేసేలా ఉండడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
ఇవన్నీ ఒకెత్తయితే, సిద్ధార్ధ-రవితేజ-నితిన్‌ల సినిమాలు మరో ఎత్తు. సిద్ధార్ధ-ఇలియానా జోడీగా వచ్చిన ‘ఆట’ సినిమా పవన్‌కల్యాణ్ ‘గుడుంబా శంకర్’ సినిమాకు మరో రూపాన్ని గుర్తు చేస్తుంది. రవితేజ-బోయపాటి కాంబినేషన్‌లోని ‘్భద్ర’ సినిమా ‘ఒక్కడు‘ సినిమాని, నితిన్-హన్సికల ‘సీతారాముల కల్యాణం’ సినిమా ‘గుడుంబా శంకర్’ని వద్దనుకున్నా గుర్తు చేస్తాయి. ఇక రవితేత ‘కిక్’ సినిమా యావత్తూ ‘జెంటిల్‌మేన్’ సినిమాకు అనుకరణే అనే మాటలు విపరీతంగా వినిపించాయి.
ఇలా పెద్ద హీరోల ఇటీవలి కాలపు సినిమాలన్నీ మరో సమకాలీన హీరో సినిమాలకు కాపీలే అనే ఆలోచన ఎంత వద్దనుకున్నా వస్తోంది. ఈ స్థితి హీరోలు తమ కాంటెంపరరీ హీరోల ఇతర సినిమాలని చూడకపోవడం వల్లనే దాపురించేందేమో అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ మన హీరోలు మన చుట్టూ ఉన్న సినీ ప్రపంచంలోని కథల్లోని విషయాలను అప్‌డేట్ చేసుకోగలిగితే ఎంత పెద్ద డైరక్టర్ చెప్పినప్పటికీ కథ మధ్యలోనే ఆపి ఇది ‘్భరతీయుడు’లా ఉంది అనో, ‘అంతం’లా ఉందేంటి అనో ఆయా దర్శకులను అడిగేవారు కదా? అనేది సగటు సినీ జీవికి సైతం వస్తున్న మిలియన్ రీళ్ల సందేహం!
రీసైక్లింగ్ కథలూ చెప్పేదదే!
నేటి తెలుగు సినిమా ప్రేక్షకుడు ఇదివరికటిలా లేడు. మీడియా, ఇంటర్‌నెట్‌ల పుణ్యమా అని ప్రపంచంలోని సినిమా రంగంలో జరిగే ప్రతి డెవలప్‌మెంట్‌నీ సునాయాసంగా తెలుసుకుంటున్నాడు. ఇంతకాలం హాలీవుడ్, కొరియన్, ఇరానియన్, చైనీస్ సినిమా కథలను, సీన్లను మక్కికి మక్కి కాపీ చేసినా అంతగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఈజీగా చెప్పేయగలుగుతున్నారు. ఎక్కడెక్కడి విదేశీ భాషా చిత్రాల మూల కథలనే చెప్పగలుగుతున్నప్పుడు మన తెలుగు సినిమాల కథలని మాత్రం గుర్తుపట్టలేరా? అందుకే సినిమా తెరపై నడుస్తున్నప్పుడే ‘ఈ సీన్ ఆ హీరో సినిమాలో ఉందే’ అని చెప్పేస్తున్నాడు. మరి ఓ సామాన్య ప్రేక్షకుడు గుర్తించిన విషయాన్ని కూడా మన తెలుగు హీరోలు గుర్తించలేకపోతున్నారా? లేక ఐచ్ఛికంగానే విస్మరిస్తున్నారా? అనేది అర్ధంకాని ప్రశ్న!
ఇక ఇటీవలి కాలంలో తెలుగు తెరని పావనం చేస్తున్న సినిమాలలో ఇలాంటి కథా చిత్రాలది ఒక ‘స్టైల్’ అయితే, మరో ‘స్టైల్’ రీ సైక్లింగ్ కథలది!...ఈ ‘రీసైక్లింగ్ కథలు’ రాస్తున్న రచయిత-దర్శకులు కొంచెం తెలివిగా ఒక్క సినిమా కథ మీదనే ఆధారపడకుండా రెండు మూడు తెలుగు సినిమాలనే కలిపి కథలల్లుతున్నారు. ఇది ఒకందుకు మంచిదే...ఏ హాలీవుడ్‌నో, బాలీవుడ్‌నో కాపీ చేయడమో లేద ఇన్‌స్పిరేషన్ పొందడం కంటే మన తెలుగు సినిమాలలో హిట్ అయిన సినిమాలలోని రెండు మూడు లైన్‌లను ‘మిక్స్’ చేసి ‘రీ సైక్లింగ్ కథలని’ తయారు చేయడం గొప్ప విషయమే కదా?
‘కింగ్’ సినిమా చూడండి. అది ఢీ, చంద్రముఖి సినిమాలను కలిపి వండిన రీమిక్స్ సినిమా అని ఇట్టే అర్ధమవుతుంది. అలాగే ‘దూకుడు’ చూడండి. అతడు, కింగ్, ఢీల మిక్చర్ అని ఎంత వద్దనుకున్నా తెలిసిపోతుంది. ‘ఊసరవెల్లి’ కూడా అంతే! తెనాలి, ఒక్కడు సినిమాల రీమిక్స్ సినిమా అని తేటతెల్లమవుతుంది. సినిమాని థియేటర్లో చూసిన సగటు సినీ ప్రేక్షకుడు సైతం గుర్తిస్తున్న ఈ విషయాలు ‘కథల నెరేషన్’ అపుడు హీరోలకు స్ఫురణకు రావడంలేదంటే, వారు ఇతర హీరోల సినిమాలను చూడట్లేదనే కదా? చూస్తే ఇలా జరుగుతుందా? లేదా హిట్ ఫార్ములాలుగా ప్రూవ్ అయినాయి కనుక రిపీట్ చేయడంలో తప్పులేదని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు ‘హీరోను కొత్తగా వెరైటీగా, డిఫరెంట్‌గా చూపే సినిమా’’ అని ప్రచారం చేయడం వంచన కాదా? అన్నీ సమాధానం దొరకని ప్రశ్నలే!
బాక్సాఫీసు లక్ష్యం!
ఏది ఏమైనా, సమకాలీన తెలుగు సినిమా కథల తీరు తెన్నులను కూలంకషంగా గమనిస్తే సినిమా దేనికి కాపీ? దేనికి ఇన్‌స్పిరేషన్ అనే సందేహాల కన్నా బాక్సాఫీసు కలెక్షన్లు సాధించిందా? లేదా? అనేదే ముఖ్యం అనే విషయం ఇట్టే తెలిసిపోతుంది. ప్రేక్షకులు అలాంటి సినిమాలనే తెలిసి తెలిసీ ఆదరిస్తున్నప్పుడు అవి కాపీ కథలైనా, రీ సైక్లింగ్ కథలైనా, రీమిక్స్ కథలైనా ముఖ్యంకాదు అనేది మరో అభిప్రాయం! అల్టిమేట్‌గా తెలుగు సినిమా అంతిమలక్ష్యం వినోదమే...సినిమాకు వచ్చే ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే! అలాంటి వినోదాన్ని అందుకోవడానికి హీరోలు కథల పరంగా అనుసరించే ఏ మార్గం అయినా తప్పుపట్టలేనిదే అనేది దీని సమర్ధించేవారి ఆలోచన.
కొసమెరుపు: ఈమధ్య మన హీరోలు కథలు చెప్పడానికి వెళ్లిన రచయితలు, దర్శకులకు ‘్ఫలానా సినిమాలోని ఫలానా సీన్ లేదా కథలాంటి దానే్న మనమూ చేద్దాం’ అని సజెస్టు చేస్తున్నారట! మరి ఈ లెక్కన మన తెలుగు సినిమా హీరోలు ఇతర సినిమాలు చూస్తున్నట్టా? లేనట్టా?

ఇదయ్యా మీడియా
November 26th, 2011
పెట్టుబడికి కట్టుకథకు
పుట్టిన విషపుత్రిక
-అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ! కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో! ఏమి రాసేవాడో!!
ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం. కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు - ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని, ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం.
తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు?
అలాగే - పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!
గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప? ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి... గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు - ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది. ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో... సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక... అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు అది చీకొట్టినట్టే వినపడుతుంది.
పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు!
మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’!
అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే - హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు. వారు విననూ కూడదు!
సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ, తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత! ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి... ప్రతిపక్ష మహానాయకుడితో భుజం కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి, ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!!

న్యూస్ చానెళ్ళా .. సస్పెన్స్ థ్రిల్లర్లా?
November 29th, 2011
ఈ మధ్యకాలంలో ప్రపంచంలో దుర్మార్గం పెరిగిపోతోందని మా మేనత్త ఎప్పుడూ అంటూండేది. ప్రపంచంలో దుర్మార్గం ఎప్పుడూ ఉంది, ఇప్పుడు పత్రికలు చదివీ, టీవి చూసీ తెల్సుకోగలుగుతున్నామన్న జవాబు ఆమెకు నచ్చేదికాదు. బీహార్‌లో తన పాలనలో నేరాలు పెరుగుతున్నాయని అందరూ అంటున్నారు కానీ తన పాలనలో నేరస్థులను ఎక్కువగా పట్టుకోవడంవల్ల నేరాల సంఖ్య తెలుస్తోందనీ, అందుకుముందు పాలనలో నేరస్థులను అచ్చుగుద్ది వదిలేసేవారనీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఒకరు ప్రవచించారు. ఆ మాట నిజమేనా? ఆయన పాలనలో నేరాలు పెరిగాయా, ప్రభుత్వ యంత్రాంగం పని తీరు మెరుగయిందా? ప్రపంచంలో దుర్మార్గం ఈమధ్య కాలంలో పెరిగిందా లేక దుర్మార్గాలగురించి ఎక్కువ తెలుస్తోందా?
నేర ప్రవృత్తీ, దుర్మార్గం వంటివి కొలవడం కష్టం. కానీ కొలవగలిగినవి కొన్ని ఉంటాయి. దేశంలో రైలు ప్రమాదాలూ, ప్రమాదాలలో మరణాలూ పూర్వం కన్నా ఇప్పుడు ఎక్కువయ్యాయా అంటే కచ్చితంగా ఎక్కువయ్యాయనే చాలా ఎక్కువమంది చెప్తారు. కానీ 1950లలో ప్రమాదాలు గమనించండి. మద్రాసు -ట్యూటికార్న్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 154మంది 1956లో, ఢిల్లీ పఠాన్‌కోట ప్రమాదంవల్ల 32 మంది 1958లో మరణించారని ఎందరికి ఆనాడైనా తెలుసు? 1964లో ధనుష్కోడి వంతెన మీద రైలు మొత్తం సముద్రం అలలలో ములిగిపోయింది. ఒక్క 1956లోనే మహబూబ్‌నగర్ వద్ద 156మందీ, అరియలూర్ వద్ద 154మందీ ప్రమాదంలో మరణించినందుకు నాటి రైల్వేమంత్రి స్వర్గీయ లాల్‌బహదూర్‌శాస్ర్తీ నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేశారన్న సంగతి మాత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది.
మరి రైలు ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అందరికీ ఎందుకనిపిస్తుంది. 1950, 1960లలో నేటివలె వార్తలను తొందరగా చేరవేసే ప్రసార సాధానాలులేవు. ఉత్తరాన వారణాసిలోనో, లక్నోలోనో రైలు ప్రమాదం జరిగితే రెండో రోజునో, మూడో రోజునో దక్షిణాది వార్తాపత్రికలో మధ్య పేజీలలో ఎక్కడో చిన్న కాలమ్‌గా వార్త ప్రచురితమయ్యేది. ప్రమాదం గురించీ, మరణాలగురించీ అంతగా మనస్సుకెక్కే అవకాశం లేదు. ఆ రైలులో బంధు మిత్రులు ప్రయాణిస్తే తప్ప ఆ వార్త ఎవరికీ అంతగా తెలుసుకోవలసిన అవసరమూ లేదు.
అప్పట్లో రైలు మార్గాలు చాలామటుకు సింగిల్‌లైన్‌నే ఉండేవి. సిగ్నలింగ్ వ్యవస్థ నేటివలె వృద్ధిచెందలేదు. కొన్ని స్టేషన్లకు కరంటు సౌకర్యం కూడా లేదు. టెక్నాలజీ అంతగా వృద్ధి చెందని రోజుల్లోనే ఆక్సిడెంట్లు ఎక్కువ జరిగేవి. నేడు మ్రాదాల సంఖ్య- రైళ్ళసంఖ్య పెరిగినప్పటికీ బాగా తగ్గింది.
అయితే ప్రస్తుతమే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఎందుకనిపిస్తున్నది? ప్రమాదం జరగ్గానే రిలీఫ్ టీం కన్నా ముందుగా న్యూస్ చానెల్స్ టీం అక్కడ వాలిపోతుంది. ప్రమాదం తాలూకు భయానక దృశ్యాలను వీలైనన్ని కోణాలలోతీసి ప్రేక్షకులకు చూపిస్తుంది. కాళ్ళు విరిగినవాళ్ళని ‘‘మీకెలా ఉందని’’ ప్రశ్నిస్తుంది. బాగున్న కొంతమందిముందు మైకుపెట్టి, రైల్వేలు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నాయో చెప్పిస్తుంది. ప్రజల మనస్సులలో రైల్వేల పని తీరు ఘోరంగా ఉందని ముద్రపడేదాకా చూపిన దృశ్యాలే చూపిస్తూ, చెప్పిన విషయాలే చెప్పిస్తూ తన టిఆర్‌పిలు పెంచుకుంటుంది.
రైల్వేలో ప్రమాదాలు జరగడంలేదనీ, ఎవరూ తప్పులే చెయ్యడంలేదనీ చెప్పడం లేదు. ఒకరాత్రి మనం రైలెక్కి పడుకుని ఉదయం హాయిగా గమ్యం చేరామంటే కొన్ని వందలమంది స్టేషన్‌మాస్టర్లు, డ్రైవర్లు, గార్డులు, సిగ్నలింగ్ స్ట్ఫా, మెయింటనెన్స్ వర్కర్లు సక్రమంగా పనిచేసి ఉంటారు. ప్రమాదానికి కారణమేమిటి, జరగకుండా ఉండడానికి జాగ్రత్తలేమిటి, ప్రమాదం జరిగాక చేపడుతున్న కార్యక్రమాలేమిటి వంటివి వార్తలకిందకి వస్తాయి. బీభత్సరసాన్ని మాత్రం పోషించడం ఏ విధంగా వార్త అవుతుంది? పాశ్చాత్య దేశాలలో శవాన్ని కూడా లాంగ్ షాట్‌లో తెల్లగుడ్డ కప్పి చూపుతారు. ఆ మంచిని మనం నేర్చుకోలేమా?
ఎక్కడ జరిగిన ప్రమాదాలైనా విజువల్ మీడియా పద్ధతి మారదు. అమెరికాలో దురదృష్టవశాత్తూ భారతీయులు ప్రమాదంలో మరణిస్తే అది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఆ ప్రమాదం కొన్ని కుటుంబాలవారికి విషాదకరం. తెలిసిన ఎవరికైనా బాధాకరం. కానీ అందులో ప్రేక్షకులందరికీ అప్పటికప్పుడు తెలుసుకునే న్యూస్ వాల్యూ ఏముంది? అసలు తెలుసుకోవలసిన అవసరం ఏది? అమెరికాలో ట్విన్‌టవర్స్‌ని పేల్చివేయడం అందరూ తెలుసుకోవలసిన సంగతి. ట్విన్ టవర్స్‌ని కూల్చడం ప్రపంచంలో అన్ని దేశాల చారిత్రక, ఆర్థిక పరిస్థితులను మార్చివేసింది. అమెరికాకు వీసా నిబంధనలూ, ఎయిర్‌పోర్టులలో తనిఖీలూ కఠినమయ్యాయి. ఒక సంఘటన ప్రజల జీవితంలో మార్పు తెస్తే అది వార్త. టివి చానెళ్ళలో అమెరికాలో మనవాళ్ళకి రోడ్డు ప్రమాదాలు చూపించే తీరు ఎలా ఉంటుందంటే మన దేశమే మెరుగనిపిస్తుంది. కానీ ప్రమాదాలలో భారతదేశమే మొదటిస్థానంలో ఉంది.
నేరాలని చూపే పద్ధతి నేరాలను ప్రోత్సహించడానికేనన్న విమర్శ విన్పిస్తూనే ఉంది. నేరం చెయ్యని వాళ్ళని శిక్షించగలగడమూ మీడియాకి వెన్నతోపెట్టిన విద్య. వ్యభిచారంవృత్తిగా కల ఒకమ్మాయిని పట్టుకున్న పోలీసులు ఆమె నిరపరాధి అని విడిచిపెట్టారు. టివి చానెళ్ళు విడిచిపెట్టలేదు. సంఘంలో తలెత్తుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రేక్షకుల్లో బేసిక్ ఇన్‌స్టింక్ట్‌ని రెచ్చగొట్టి వారి సంఖ్య పెంచుకోవడమే వార్తా చానెళ్ళ లక్ష్యమైతే ఇక ఐటెమ్‌సాంగ్ (పూర్వం జ్యోతిలక్ష్మి డాన్స్) పెట్టి సినిమా ఆడించాలనుకునే నిర్మాతలకూ, వీరికి తేడా ఏముంది? ఒక విధంగా నిర్మాతలే నయం. వారు వినోదం ఇస్తున్నామంటున్నారు కానీ విజ్ఞానం పంచుతున్నామనడం లేదు. వారికి హిపోక్రసీలేదు.
ఈ మధ్య సిబిఐవారు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిణిని విచారణకు పిలిచారు. ఆమె నిందితురాలే కానీ నేటివరకూ నేరస్థురాలుకాదు. ఆమె కారులోనుంచి దిగడం, మెట్లెక్కి లోపలకు వెళ్ళడం దృశ్యాన్ని పదేపదే చూపించారు. చూస్తూంటే మీడియా ఆమెను అరగంటసేపు చిత్రీకరించిట్లనిపిస్తుంది. ఒక సీనియర్ అధికారిణిని ఆ విధంగా చూస్తే సామాన్య ప్రజలలో ‘ఆహా బాగా అయింది ఈవిడకి’ అన్న భావం కలుగుతుందనుకుని చూపించారా? ఆమెను అడిగిన ప్రశ్నలూ, ఆమె చెప్పిన జవాబులూ వార్తలవుతాయి కానీ ఆమె పరిగెడుతున్నట్లుగా లోపలకు వెళ్ళే దృశ్యం కాదే (వాస్తవానికి ఆమె పరిగెత్తనూ లేదు).
వార్త అన్నది ప్రేక్షకులలో విజ్ఞానాన్ని పెంచాలి. వారి నిత్య జీవితంలో మార్పులు చేసుకుందుకు ఉపయోగపడాలి. తప్పుడు సంకేతాలను ఎప్పటికీ ఇవ్వకూడదు. వాస్తవానికి పురుషుల్లో ఆత్మహత్యలు స్ర్తిలలో ఆత్మహత్యలకన్నా మూడు రెట్లెక్కువ. ఈ విషయానికి గణాంకా
లున్నాయి. కానీ ఎక్కడైనా ఒక అమ్మాయి భర్త ఆరళ్ళకో, అత్తవారి వరకట్న హింసలకో ఆత్మహత్య చేసుకుంటే ఉరితాడు వేలాడేసిన కొక్కెం దగ్గరనుంచి ఆమె పాదాలదాకా చూపించి రాద్ధాంతం చేసి మగవారందరూ మృగాలన్న అభిప్రాయాన్ని చానెళ్లు కల్గిస్తాయి. కారణమేమిటి? స్ర్తిల కష్టాలను చూపిస్తే కన్నీటితో కరిగిపోయి టివికి అతుక్కుపోయే వారున్నారు కనుక. మగవాడి ఆత్మహత్య మనసుకి ఎక్కదుకనుక.
రాష్ట్రంలో ముఖ్య నాయకుడు ఒకాయన ప్రమాదంలో చిక్కుకుని జాడ తెలియనప్పుడు ‘‘ప్రజలంతా ఆయన ఏమయ్యారోనని భయపడుతున్నారు. రాష్టమ్రంతా ఉత్కంఠగా ఉంది. ఏమైందో తెలిసేలోగా షార్ట్ బ్రేక్’’ అని వార్తలు చదువుతూంటే జరుగుతున్న సంఘటన చూస్తున్నామా లేక చివరకేమవుతుందో ఊహించలేని సస్పెన్స్ థ్రిల్లర్ నవల చదువుతున్నామా అని అన్పించడం సహజం కాదా.
ఈ పరిస్థితినుంచి బయటపడ్డానికి ఏం చెయ్యాలి? వార్తలు విజ్ఞానాన్ని అందించాలి, భీభత్సరస ప్రధానమైన వినోదం కాదు అన్నది చానెళ్లు అనుసరించడానికి ఏం చెయ్యాలి? స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గం అని ముక్తకంఠంతో చెప్తున్నారు. కానీ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ప్రోగ్రాంలు నిరుత్సాహకరంగా ఉండేవేమో కానీ విజ్ఞాన దూరంగా ఉండేవికావు. ఒకవేళ ఆ దిశలో వెడుతుంటే పైనుంచి కంట్రోల్ ఉండేది. వృద్ధవనితను చూపి ‘‘ఈమె వయస్సు అరవై ఏళ్ళా ఇరవై ఏళ్ళా’ అనే క్విజ్ ప్రోగ్రాంని (మషూర్ మహల్) దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జోక్యం చేసుకుని ఆపించారు. శ్రీకృష్ణదేవరాయలను బఫూన్‌గా చూపించిన ‘తెనాలి రామకృష్ణ’ సీరియల్‌ని సమాచార ప్రసార శాఖ మంత్రి దివంగత ఉపేంద్ర స్వయంగా పూనుకుని నిలిపివేశారు. కొంతైనా ప్రైవేటు చానెళ్ళపై ప్రభుత్వ నియంత్రణ ఉంటే వార్తలు కల్పిత పుస్తకాలలా ఉండవేమో.

Friday, November 25, 2011
మిగిలేదెవరు?!
ఛఛ! ఇదేం బాగో లేదు! వారి మీద కేసులు, వీరికి రిమాండ్లు భలే బాగున్నాయని అందరూ పళ్లికిలిస్తున్నారే తప్ప అరవై ఏళ్లుగా మన మహానేతలు కడు జాగ్రత్తగా కలిసికట్టుగా కాపాడుకొస్తున్న ఎంచక్కని ఏర్పాటుకు ముంచుకొస్తున్న ముప్పును ఎవరూ గ్రహించటమే లేదు!
పేరు మోసిన మన పార్టీల మధ్య, వాటిని నడిపే నేతల మధ్య పైకి చెప్పుకోని, చెప్పుకోకూడని పెద్ద మనుషుల ఒప్పందం చాలా ఏళ్లుగా ఉంది. ఒకసారి గెలిచి తాము పవర్లోకి వస్తే జనానికి రోతపుట్టి మళ్లీ ఎన్నికల్లో తమను తన్ని తగలెయ్యటం ఖాయం. (పూర్తికాలం అధికారం చలాయంచీ మళ్లీ గద్దెనెక్కగలిగింది ఇటీవలి రాజశేఖరరెడ్డి ఒక్కడే) తమ మీద అసహ్యంతో ఎగస్పార్టీని నెత్తిన పెట్టుకున్నా, తప్పుడు పనుల్లో వాళ్లూ తమకు తోడు బోయిన వారే కనుక, మళ్లీ వచ్చే ఎన్నికల్లో వారినీ గెంటేయటం దాదాపు గ్యారంటీ! వాళ్లకు శాస్తి చెయ్యాలంటే ఇష్టమున్నా లేకున్నా మళ్లీ తమనే పిలిచి పల్లకి ఎక్కించటం మినహా వెర్రిజనానికి వేరే దారి ఉండదు. కాబట్టి గద్దెమీద ఉన్నప్పుడు అడ్డగోలుగా నొక్కేసినదాన్ని అపోజిషన్లో ఉన్న ఐదేళ్లూ దర్జాగా ఎంజాయ్ చేస్తే తరువాయి ఎన్నికల్లో వద్దన్నా పవరు తమ కాళ్లదగ్గరికి నడిచొస్తుంది.
ఈ అధర్మ సూక్ష్మం అన్ని పార్టీలకీ అర్థమైంది. తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు అపోజిషను వాళ్ల పాత పాపాలను కెలక్కుండా ఉంటే వాళ్ల ‘వంతు’ వచ్చినప్పుడు వాళ్లూ తమను తిప్పలు పెట్టకుండా ఉంటారు. అందుకే - ‘తిను-తిననివ్వు; బతుకు-బతకనివ్వు’ అన్న పాలిసీతో అన్ని పార్టీల అందరు లీడర్లూ పైకి మాత్రం కలహించుకుంటూ, అవసరమైనప్పుడు సహకరించుకుంటూ జనాల చెవిలో పూలు పెడుతూ వచ్చారు. అధికార పార్టీ వాళ్లు అక్కడ ఇంత తిన్నారు, ఇందులో ఇంత బొక్కారు; మాకే కనుక అధికారం వస్తే వాళ్లు తిన్నది మొత్తం కక్కిస్తాం... జైల్లో కుక్కేస్తాం... విచారణలు జరిపించి, పాపాల చిట్టా విప్పిస్తాం... అని రంకెలేసే విపక్ష మేళం వాళ్లకు పవరు చేతికొచ్చాక ఆ ఊసే గుర్తుండదు. కాంగ్రెసు పోయి ‘దేశం’ వచ్చినా, ‘దేశం’ పోయి కాంగ్రెసు వచ్చినా ఏ పార్టీ వాడి ఏ అక్రమ ఆస్తీ చెక్కు చెదరదు. పట్టుకుంటారేమోనన్న భయమూ ఎవరికీ ఉండదు.
ఇంతకాలమూ బహు చక్కగా, అందరికీ వాటంగా నడుస్తున్న ఈ భలే మంచి ఏర్పాటు కాస్తా ఇప్పుడు భళ్లున బద్దలైంది. ఏ పార్టీ ప్రభువూ తనకు తానై మాజీ పాలకుల, వారి ఇలాకావాళ్ల అక్రమ ఆర్జనల జోలికి పోకుండా ఎంత గొప్ప సంయమం చూపితేనేమి? పనిలేని కోర్టులు తీరికూర్చుని మారాజుల బంగారు పుట్టలో వేలు పెట్టటంతో అంతులేని కథ కాస్తా అడ్డం తిరిగింది. పరిపాలకుల పెంపుడు జంతువులా బుద్ధిగా ఒదిగి ఉండి, వారు కరవమన్న వారిని మాత్రమే కరవమన్న మేరకే కరుస్తూ, నమ్మినబంటులా సేవ చేసిన సిబిఐకి కూడా కోర్టుల చేతిలో పడ్డాక కోరలొచ్చాయి. కొమ్ములూ మొలిచాయి. వాటితో పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వారిని కుమ్ముతూ... విచారణలు, అరెస్టులు అంటూ కుళ్లబొడిచేస్తున్నది. మరీ ఇంత ఓఘాయిత్యమైతే మన రాజకీయ మణిమాణిక్యాలు ఇక ఎవరితో మొరపెట్టుకోవాలి?!
కృష్ణపక్షంలో చంద్రుడికాంతి అంతకంతకూ క్షీణించి అంతరించినట్టు, ఎన్నికలు దగ్గరపడే కొద్దీ సర్కారు ప్రకాశం సన్నగిల్లుతుంది. అపోజిషను మీద మోజు నానాటికీ పెరుగుతుంది. ఎన్నికల అమావాశ్య నాటికి పాలకపక్షం పరువు నేలమట్టమైతే అపోజిషను కళ అదే దామాషాలో పెరగుతూపోయి, పాత ప్రత్యామ్నాయాన్ని దుమ్ము దులిపి మళ్లీ కళ్లకద్దుకోవటం ఓటరయ్యలకు సులువవుతుంది.
కాని - ఇప్పుడో? రూలింగు పార్టీ షరామామూలుగా డీలాపడింది. పాత పహిల్వాన్‌కు తోడు కొత్త వస్తాదు గోదాలోకి దిగటంతో అపోజిషను సీను మారింది. బిగ్ ఫైటు అంతా బాబు, జగన్‌ల మధ్యే హోరాహోరీగా నడుస్తోంది. ‘పవర’మాల చివరికి వీరిలో ఎవరి మెళ్లో పడవచ్చునని జనాలు తర్కిస్తున్న సమయంలో ఉరుములేని పిడుగులా ఇద్దరి నెత్తినా సిబిఐ కేసుల బండలు పడ్డాయి. తన బద్ధ శత్రువైన కాంగ్రెసు జగన్ మీద పెట్టించిన కేసుకు టి.డి.పి. పక్క తాళం వేస్తే.. తమరు మాత్రం తక్కువ తిన్నారా బాబూ అని జగనమ్మ కోర్టుకెక్కి బాబు ఆస్తుల మీద సిబిఐ దర్యాప్తు వేయించింది. మళ్లీ ఎన్నికల్లో అధికార దండం అందుకోవాలనుకుంటున్న ఇద్దరు నేతాశ్రీలూ అవినీతి ఆరోపణల ఊబిలో ఇరుక్కుని, కాంగ్రెసుకు దీటుగా కుదేలైతే ఇక జనం ఎవరికి ఓటెయ్యాలి? అధికారం మార్పిడి ఎలా జరుగుతుంది? సిబిఐ వాళ్లొచ్చి ఆటంతా మార్చేస్తే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షం మీద కొరడా ఝళిపిస్తే పవిత్ర ప్రజాస్వామ్యం ఏమి కావాలి? ఇదీ సమస్య.
ఎప్పుడో రెండేళ్ల తరవాత వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం మాట దేవుడెరుగు. ముందు మన ధర్మ ప్రభుత్వం నడిచేదెలా? ‘‘ఊబ నా మగడు ఉండీ ఒకటే లేకా ఒకటే’’ అన్నట్టు మంత్రిశ్రీలు కొలువులో ఉన్నా ఒకటే. లేకున్నా ఒకటే. ఆ సంగతి మొన్న తెలంగాణ ‘సకలం’లోనే అందరికీ తెలిసి వచ్చింది. మంత్రులు లేకుంటే పోయేగానీ సర్కారు రథాన్ని నడపటానికి పై ఎత్తున అధికారులైతే కావాలి కదా? జమానా మారినా తమ జోలికి ఎవరు రారు అన్నది అనుభవంలో రూఢి కావటంతో అధికార గణానికి పట్టపగ్గాలు లేవు. వారిది ఆలిండియా సర్వీసు కనుక తప్పుడు పనులు చేసేది లేదని కరాఖండిగా తిరస్కరించినా రాజకీయ నాయకులు చేయగలిగింది పెద్దగా ఉండదు. అయినా ఆ సోయి బతకనేర్చిన అధికార్లకు ఉండదు. స్వామిని మించిన స్వామి భక్తితో పాలకపక్షానికి తాబేదారులా తమను తాము దిగజార్జుకుని, ముఖ్యమంత్రి మెహర్బానీకి అంగలార్చి, కనుసైగ చేస్తే చాలు ఎలాంటి తప్పుడు పనినైనా చేసి, రూల్సు నడ్డి విరిచి ‘పై’వాళ్లను ఖుషీ చేసి, అత్తసొత్తును అల్లుడు దానం చేసినట్టు గనాఘనులకు లీజులు, పర్మిషన్లు అడ్డగోలుగా కట్టబెట్టిన ఆఫీసరు రత్నాలకు ఇప్పుడు మూడింది.
ఒక్క గాలి కేసుకే ఇంత గోలైంది. ఇప్పటికే ఇద్దరు ఐ.ఎ.ఎస్. పెద్ద్ఫాసర్లు జైలుదారిలో ఉన్నారు. ఇక జగన్ ఆస్తుల తబిసేళ్లలోనూ ఉచ్చు బిగిసి, పనిలో పనిగా అనేక ఆరోపణలలో ఆరియు తేరిన బాబు మీదా సిబిఐ కోర్టు పురమాయింపుపై కేసుల బండలు పడి... తొమ్మిదేళ్ల ‘సైకిల్’ రాజ్యంలో బాబు అడుగులకు మడుగులెత్తిన బాబుశ్రీల మీదా కేసుల నోళ్లు తెరచుకుంటే ఎన్ని డజన్ల అధికారుల మీద, మంత్రుల మీద కేసులు పెట్టాలి? ఈ తీగలతో కేసుల డొంకలు ఒకటొకటిగా కదులుతూ పోతే, పట్టువదలని శంకరరావు మంత్రిగా ఉండీ సాటి మంత్రుల మీద, ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించి ఇలాగే ముందుకు పోతే ప్రభుత్వంలో మిగిలేదెందరు? జైలు విడిదిలో సెటిలయ్యేదెందరు? ఎక్కువమంది జైల్లో ఉంటే సర్కారు ఎలా నడుస్తుంది. ఈ వరస ఇలాగే కొనసాగి అధికారులు, మంత్రులు సచివాలయానికి రాలేకపోతే సచివాలయం బ్రాంచి ఆఫీసును వారున్న చోటే పెడితే బాగుంటుందేమో?

డ్యామ్ 999 సినిమా జగడం !
రాజకీయ కథనం కాకపోయినా ఒక సినిమా రాజకీయాలను ప్రభావితం చేయగలదా? అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక పాత ఆనకట్ట కూలిపోతే ఎటువంటి ఉపద్రవాలు సంభావిస్తాయో చూపే హాలివుడ్ చిత్రం ‘డ్యామ్ 999’ విడుదల ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తమిళనాడు, కేరళల మధ్య వివాదంగా ఉన్న ముళ్ళపెరియార్ ఆధారంగా తీసిన చిత్రమిదంటూ డిఎంకె అధ్యక్షుడు ఎం.కరుణానిధి బుధవారం బహిరంగంగా ఈ చిత్ర విడుదలను వ్యతిరేకించారు. పైగా, ఈ చిత్రాన్ని విడుదల చేస్తే అది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తుందని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, రాష్ట్రంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడాన్ని నిలిపివేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
సోహన్ రాయ్ దర్శకత్వం వహించిన, నవంబర్ 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిషేధించాలని ఎండిఎంకె నాయకుడు వైగో, పిఎంకె వ్యవస్థాపకుడు ఎస్.రాందాస్ డిమాండ్ చేసిన ఒక రోజు అనంతరం కరుణ స్పందించారు. ఎన్నో సంవత్సరాలుగా ముళ్ళపెరియార్ డ్యాం సమస్య పరిష్కారం కాకుండానే ఉండిపోయిందని, ఈ ఆనకట్టపై తమిళనాడుకు ఉన్న 999 సంవత్సరాల హక్కులను ప్రస్తావిస్తూనే సినిమాకు ఆ పేరు పెట్టారని కరుణానిధి అభిప్రాయపడ్డారు. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉన్న 116 సంవత్సరాల ఆనకట్ట తమిళనాడు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది. దక్షిణ జిల్లాల నీటిపారుదల అవసరాలను ఇది తీరుస్తున్నది. భద్రతకు సంబంధించి వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకొని పాత ఆనకట్ట స్థానంలో కొత్తదానిని నిర్మించాలని కేరళ ప్రతిపాదించింది. అయితే అది రాష్ట్ర ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందనే కారణంతో తమిళనాడు దానిని వ్యతిరేకిస్తున్నది.
ఈ అంశాన్ని తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తిన విషయాన్ని పేర్కొంటూ, కేంద్రం, చిత్ర పరిశ్రమ అన్ని విషయాలను పరిగణించి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావాన్ని కరుణానిధి వ్యక్తం చేశారు.కాగా, శుక్రవారం నాడు ఈ చిత్ర విడుదలను నిరసిస్తూ తమ పార్టీ కార్యకర్తలు శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తారని వైగో వేరొక ప్రకటనలో తెలిపారు. సినిమా ప్రివ్యూను అడ్డుకునేందుకు ఎండిఎంకె కార్యకర్తలు ప్రివ్యూ థియేటర్‌లో ఫిల్మ్ రోల్స్‌ను సోమవారం ధ్వంసం చేసిన ఘటనలో పది మందిని అరెస్టు చేశారు.ఇదిలా ఉండగా, ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలని బిజెపి తమిళనాడు శాఖ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ డిమాండ్ చేశారు.
ఈ చిత్రం ప్రజలలో అనవసరమైన ఆందోళనను సృష్టిస్తుందని, ముఖ్యంగా కేరళ వాసులను గందరగోళంలో పడేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించకపోతే, తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో దీనిని ప్రదర్శించడాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ేరళ, తమిళనాడుతో సహా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అటువంటి చిత్రాలను ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా, ఆ ఆనకట్టను తనిఖీ చేసి కేంద్ర, రాష్ట్ర నిపుణుల బృందాలు దాని భద్రతకు ఎటువంటి ముప్పులేదని హామీ ఇచ్చిన తర్వాత ఇటువంటి చిత్రాలను ప్రదర్శించడానికి అనుమతివ్వకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ 999 కథనం
తన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రతిష్ఠకోసం లక్షలాది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తూ ఒక అవినీతి మేయర్ కొత్త ఆనకట్టను నిర్మిస్తాడు. ఈ నేపథ్యంలో తన సోదరిని కాపాడే నావికుడు, కలవాలనుకున్న ఇద్దరు ప్రేమికులు, తన కుటుంబాన్ని దక్కించుకోవాలని ఒక మహిళపడే తపన, తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒక బాలుడు, మరణంలో కూడా తన భర్త వెంటే ఉండాలనుకునే భార్య; వారి పరిస్థితిని ముందుగానే చూసిన జ్యోతిష్కుడు - ఇలా జరుగనున్న ఉపద్రవంతో తొమ్మిది జీవితాలు ముడిపడి ఉన్న కథ ఇది. తొమ్మిది పాత్రలు, తొమ్మిది చిత్తవృత్తులు కూలిపోతున్న భావోద్వేగాల ఆనకట్టే ఈ చిత్రం.
చైనాలో 1975లో దాదాపు 250,000మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న బాంకియావో ఆనకట్ట విధ్వంసంపై డ్యాం 999 వెలుగు ప్రసరిస్తుంది. ఇక భారతదేశంలో కేరళ- తమిళనాడు సరిహద్దులలోని ఇడుక్కి జిల్లాలో ఉనన ముళ్ళపెరియార్ ఆనకట్ట వద్ద భూప్రకంపనలు తిరిగి చోటు చేసుకున్న నేపథ్యంలో డ్యాం 999 కేరళ ప్రభుత్వానికి మేల్కొలుపులా ఉపయోగపడుతుంది.ఈ సంవత్సరం జనవరి నుంచి ఇడుక్కిలోని కొన్ని ప్రాంతాలలోనూ, పక్కనే ఉన్న కొట్టాయం, పాతానంతిట్ట జిల్లాల్లోనే 22సార్లు స్వల్పంగా భూమి కంపించి, అనంతర ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. గత వారమే డ్యాం ప్రాంతం సహా రిక్టర్ స్కేల్‌పై 2.02, 3.04లతో రెండుసార్లు భూమి స్వల్పంగా కంపించింది. రిజర్వాయర్ కింద రెండు బీటలు ఏర్పడ్డాయని, తాజాగా చోటు చేసుకున్న ప్రకంపనల కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని రిజర్వాయర్ ఇన్‌ఛార్జి అధికారులు పేర్కొన్నారు.
కేరళలోని ఇడుక్కి ప్రాంతం ట్రావెంకోర్ రాజ్యం, తమిళనాడు కింద, బ్రిటిష్ పాలనలో మద్రాసు ప్రావిన్సులో ఉన్న సమయంలో ముళ్ళపెరియార్ ఆనకట్టను నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆనకట్ట మధ్య తమిళనాడు జిల్లాలకు నీటిపారుదలకు ఆధారంగా ఉంటూ వస్తున్నది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ ఆనకట్ట ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశమైంది. కేరళ ప్రభుత్వం ప్రస్తుతమున్న ఆనకట్టను డికమిషన్ చేసి కొత్తది నిర్మించాలన్న యోచన తమిళనాడుకు ఆమోదయోగ్యం కాలేదు.
స్థానిక ప్రతిఘటన బృందాలను పక్కన పెడితే ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఈ అంశంపై తీవ్రమైన వైఖరినే తీసుకున్నాయి. ముళె్ళైపెరియార్ ఆనకట్టను అంతరించిపోతున్న ఆనకట్టల జాబితాలో చేర్చడంతో ఆ డ్యాంలో నీటి స్థాయి 136 ఫీట్లకు మించి ఉండడాన్ని నిరోధిస్తూ కేరళ ప్రభుత్వం 2006లో కేరళ నీటిపారుదల, నీటి సంరక్షణ (సవరణ) చట్టం 2006ను ఆమోదించింది. డ్యాం 999కు సోహన్ రాయ్ దర్శకత్వం వహించగా, రజిత్ కపూర్, జోషువా ఫ్రెడ్రిక్ స్మిత్, లిండా ఆర్సెనియో, గ్యారీ రిచర్డ్‌సన్, జాలా పిరింగ్, ఆశిష్ విద్యార్ధి, వినయ్‌రాయ్, విమలా రామన్, మేఘా బర్మన్‌లు ఇందులో నటిస్తున్నారు.

Subscribe to:
Comments (Atom)