దాశరథి పేరు చెబితేనే తెలంగాణ ఆత్మవిశ్వాసం తొణికిస లాడుతుంది. కవిత్వంలోనే కాదు, సినిమా పాటల్లోనూ ఉన్నత సాహిత్య విలువలకు ఆయన ఎప్పుడూ పెద్దపీటే వేశారు. సామాన్యుల నుండి భాషావేత్తలు, సినీ పండితుల వరకు ఎందరివో ప్రశంసలు ఆయన కంఠహారాలైనాయి. ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు, నిన్ను బోలిన రాజు మా కెన్నడేని, తీగెలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని తెలంగాణ తేజాన్ని తెలుగు సాహిత్యంలోకి రంగరించిన కవి బెబ్బులి మన దాశరథి.
ఆయనది మొత్తం తెలంగాణ సాహిత్యంలో బహుముఖమైన ప్రతిభ. ఆనాటి నిజాం నవాబు నిరంకుశత్వాన్ని జైలు గోడలమధ్యే గర్జించి సవాలు చేసిన కలం వీరుడాయన. తొలితెలుగు సినీకవి చందాల కేశవదాసు తర్వాత గేయ రచయితగా సినీ పరిక్షిశమలోకి అడుగిడిన వారు దాశరథి. మనసు కవి ఆత్రేయ దర్శకత్వంలో 1961లో వచ్చిన ‘వాగ్దానం’ చిత్రం ద్వారా దాశరథి కృష్ణమాచార్య తొలిసారిగా ‘సినీకవి’గా పరిచయమయ్యారు. ఇందులో ఆయన రాసిన ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా’ అన్న పాట ఈనాటికీ తెలుగు సినిమా పాటల చరివూతలోనే శిఖరస్థానంలో ఉంది. అదే సంవత్సరం దుక్కిపాటి మధుసూధనరావు ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం కోసమూ ఆయన పాటలు రాశారు.
కృష్ణమాచార్యులు 1927 జులై 22న వరంగల్ జిల్లా చిన్న గూడూరులో దాశరథి వెంకటాచార్యులు, వెంకటమ్మ దంపతులకు జన్మించారు. సంస్కృత, ద్రావిడ భాషల్లో విద్యాభ్యాసం చేశారు. తల్లివద్ద తెలుగు నేర్చుకున్నారు. బడిలో ఉర్దూ భాషను ఔపోసన పట్టారు. కొన్నాళ్లు మదరాసులో, తర్వాత ఖమ్మం జిల్లాలో ఆయన చదువు సాగింది. హైదరాబాద్‌లో ఆంగ్లంలో పట్టభవూదులైనారు.
దాశరథి ఎంత అక్షర సైనికుడో అంత మానవతా హృదయం ఉన్న మనిషి. గార్లలోని కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర మహాసభల్లో చేరి, అనేక పోరాటాలలో పాలుపంచుకున్నారు. అడవుల్లో తిరుగుతూ, కోయలతో కలిసి జీవించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలుకు వెళ్లారు. చివరికి ‘పోలీసు చర్య’ తర్వాతే విడుదలయ్యారు. ఈ పోరాట నేపథ్యమే ఆయనలో కవితా జ్వాలను పుట్టిస్తే, జీవితంలో ఎదురైన అనేక కష్టాలు సినీకవిగా అద్భుత గేయాలను పండించాయి.
గేయ రచనా స్రవంతిలో...
‘ఇద్దరు మిత్రులు’లో ఎస్8.రాజేశ్వర్‌రావు సంగీతంలో దాశరథి రాసిన రెండు పాటలూ గొప్పవే. మొదటిది ‘ఖుషిఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు రువ్వుతూ’, రెండోది ఖవ్వాలి పాట. దీనితోనే తెలుగు సినిమాల్లో ఖవ్వాలి పాటలకు శ్రీకారం చుట్టారాయన.
ఆ రోజు మొదటి పాట ఓకే కాగానే దుక్కిపాటి ‘‘మాకు ఖవ్వాలి పాట కావాలి’’ అన్నారు. ఆయన ముందుగానే ట్యూన్ చేసి సాహిత్యాన్ని రాయించుకునేవారు. ఎస్.రాజేశ్వర్‌రావు పద్ధతీ ఇదే. అలా ఆయన ట్యూన్ వినిపించాక మరీ ‘‘చాలా కష్టమండోయ్ రాయడం’’ అని కూడా అన్నారు. దాశరథి ‘‘అవును కష్టంగానే ఉందని’’ రెండు క్షణాలు ఆలోచించి ‘‘నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి’’ అని అన్నారు. అంతే, అందరు ఆశ్చర్యపోయారు. ట్యూన్‌కి ఆ పదాలు అల్లుకు పోయాయి. నిమిషాల్లో పాటంతా పూర్తయ్యింది. ‘‘అమ్మో! హైదరాబాద్ దెబ్బ గట్టిదే’’ అనుకున్నారట అంతా. ఇలా మొదలైన దాశరథి సినిమా పాటల ప్రస్థానానికి తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత దాశరథి అన్నపూర్ణ వారి చిత్రాలకు, ఆదుర్తి వారి చిత్రాలకు ఎక్కువగా పాటలు రాశారు.
దాశరథి సినిమాల్లోకి వచ్చేనాటికే పరిక్షిశమల్లో సీనియర్ సమువూదాల, కొసరాజు, పింగళి, శ్రీశ్రీ, ఆత్రేయ, కృష్ణశాస్త్రి, ఆరుద్ర వంటి దిగ్గజాలు, సినీ కవులుగా ప్రసిద్ధులు. వీళ్ల నడుమ ఆయన తనను తాను సినీకవిగా రుజువు చేసుకోగలగడం సామాన్య విషయం కాదు. ‘మొదటి బంతే సిక్సర్ పోయినట్టు’ తొలి పాటలే పరిక్షిశమలో మారుమోగాయి. ఇదే ఆయనకు పెద్ద బ్రేక్.
ఆత్రేయ మనుసు పాటలు, విరహ గీతాలకు, కొసరాజు జానపదాలకు, శ్రీశ్రీ అభ్యుదయ గీతాలకు, కృష్ణశాస్త్రి, ఆరువూదలు భావగీతాలకు పెట్టింది పేరైనట్లుగా చలామణి అవుతుంటే దాశరథి తనదైన పంథాలో వీణపాటలకు, భక్తి పాటలకు, ఖవ్వాలి పాటలకు కేరాఫ్ అడ్రస్8 అయ్యారు. ఇంకా ప్రకృతిలోని వెన్నెల, చందమామ, పూలసంపదను తన పాటల్లో విరివిగా కవితాత్మకంగా వినియోగించుకున్నారు. బ్రాండ్‌కు భిన్నంగా కూడా పాటలు రాయగలిగింది దాశరథి ఒక్కరే.
ఇతి వృత్తంలో వైవిధ్యం ఉన్న పాటలు రాయడం కూడా దాశరథి వారి ప్రత్యేకత. ‘పునర్జన్మ’ (1963)లోని ‘దీపాలు వెలిగే, పరదాలు తొలిగే’, ‘కన్నెవయసు’ (1973)లోని ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ పాటలు ఆ రోజులోన్లే సంగీత ప్రపంచంలో మారుమోగాయి. అంతకు ముందరి ‘పాడెద నీ నామమే గోపాలా’ (అమాయకురాలు-1971) పాట తరతరాలుగా ఆడపిల్లలకు అభిమాన గీతమైంది. ‘మీ కోసం నీ కోసం నా గానం నా ప్రాణం నీ కోసం’ (పునర్జన్మ), ‘కన్ను మూసింది లేదు, నిన్ను మరిచింది లేదు, నీ తోడు’ (మనుషులు, మమతలు) అనే రెండు పాటలైతే విరహ ప్రేమికులకు ఆ రోజుల్లో తారక మంత్రాల్లా పనిచేశాయి.
ప్రధానంగా ఆదుర్తికి ఆత్రేయలాగ దాశరథి తనకు ‘ఆస్థానకవి’గా పాటలు రాశారు. ‘ఓ బొంగరాల బుగ్గలున్న దాన’ (డాక్టర్ చక్రవరి), ‘గోదారి గట్టుంది, గట్టుమీద సెట్టుంది’ (మూగ మనసులు), ‘నీవు రావు నిదుర రాదు’ (పూలరంగడు), ‘దివినుంచి భువికి దిగివచ్చే’ (తేనె మనుసులు), ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ (మంచి మనసులు), ‘అందెను నేడే అందని జాబిల్లి’ (ఆత్మగౌరవం), ‘ఒకటే హృదయం కోసం’ (చదువుకున్న అమ్మాయిలు) వంటి ఆణిముత్యాల్లాంటి పాటలు ఇంకెన్నో.
దాశరథి వ్యక్తిత్వ పరిమళాన్ని తెలియజెప్పే ఒక సంఘటన. అప్పట్లో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఆదుర్తి చక్రవర్తి చిత్ర బ్యానర్‌పై ‘సుడిగుండాలు’ సినిమా తీస్తున్నప్పుడు స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి గురించి దాశరథి ఒక పెద్ద పాటను రోజుల తరబడి కూర్చొని రాశారు. దానికి ఆదుర్తి రెట్టింపు పారితోషికాన్ని ఆఫర్ చేయగా ‘‘నేను దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. మీ నో ప్రాఫిట్ చిత్రానికి నేను పైసా తీసుకోను. ఉచితంగా పాట రాసిస్తా’’ అన్నారు. అలాగే, ‘రాం రహీం’ చిత్రంలో ‘యూనాని హకీం హూ’ అని ఉర్దులో పాట రాసి మహ్మద్ రఫి ప్రశంసలు అందుకున్నారాయన.
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్జించిన దాశరథి సినిమాల్లోనూ వీణపాటల స్పెషలిస్ట్ అయ్యారు. ‘మదిలో వీణలు మ్రోగే’ (ఆత్మీయులు), ‘మ్రోగింది వీణ పదేపదే హృదయాలలోన’ (జమిందారుగారి అమ్మాయి) పాటలను పాడుకోని వారుండరు. ‘దొరబాబు’లో ‘ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే’, ‘ఆడపడుచు’లోని ‘అన్నా! నీ అనురాగం’ పాటలు అన్నాచెప్లూల్ల ప్రేమ బంధానికి ప్రతీకలైనాయి. ఆయన రాసిన మొత్తం పాటలు సుమారు 500.
దాశరథి ‘ఆకాశవాణి’లో కార్యక్షికమాల నిర్వహకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌లో ఉన్నప్పుడే సినిమాలకు రాయడం మొదలైనా మదరాసు బదిలీపై వెళ్లి పూర్తి కాలం పాటలు రాయడానికి ఆ రేడియో ఉద్యోగాన్ని వదులుకున్నారు. కానీ, ఆయన అంచనాల మేరకు సినిమా రంగం ఆయనను వినియోగించుకోలేకపోయింది. అయితే, అప్పటికే ఆయన రాసిన వందలాది పాటలు తరతరాల పాటు ఆయనకు తరగని కీర్తిని ఆర్జించిపెట్టాయి.
సినిమాల కోసం ఉద్యోగం వదులుకున్న ఆయన చివరి రోజుల్లో కొన్ని ఇబ్బందులకు గురయ్యారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు 1983లో ఆయనను ‘ఆస్థానకవి’ పదవి నుంచి తప్పించటంతో మనస్థాపం చెందారు. చివరకు 1987 నవంబర్ 5న భౌతికంగా మనకు దూరమయ్యారు. అయినా, ఆయన కవితా గర్జన నేటి తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరోవైపు తన సినీపాట సోయగం మనల్ని మరిపిస్తూనే ఉంది.
దాశరథి వారి మరిన్ని మధుర గీతాలు:
‘నడిరేయి ఏ జాములో’ (రంగులరాట్నం), ‘రారా కృష్ణయ్య’ (రాము), ‘తిరుమల మందిర సుందర’ (మేనకోడలు), ‘నను పాలింపగ నడిచి వచ్చితివా’ (బుద్ధ్దిమంతుడు) వంటివి దాశరథి రాసిన భక్తి గీతాలు కాగా, ‘ఓహో గులాబిబాల’ (మంచిమనిషి), ‘పాపాయి నవ్వాలి, పండగే రావాలి’ (మనుషులు మారాలి), ‘ముత్యాల జల్లు కురిసె’ (కథానాయకుడు), ‘ఆవేశం రావాలి, ఆవేదన కావాలి’ (మనసు మాంగల్యం), ‘ఎచటికోయి నీ పయనం’, ‘అందాలబొమ్మతో ఆటాడవా’ (అమరశిల్పి జక్కన), ‘అందాల ఓ చిలక’ (లేతమనుసులు), ‘చిన్నారి పొన్నారి నవ్వు’ (నాదీ ఆడజన్మే), ‘ఒక పూలబాణం రగిలింది మదిలో’ (ఆత్మగౌరవం), ‘మప్లూతీగ వాడిపోగా’ (పూజ) వంటి పాటలకు ఎన్నింటికో అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. అవి చిరస్థాయిగా ప్రజల గుండెలో చిరకాలం నిలిచిపోయాయి.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment